Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! Chandrababu Speech: నాడు హైదరాబాద్.. నేడు అమరావతి! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు నగరాల మ్యాప్! AP CM bill gates Friendship: కాలం మారింది.. కానీ ఆ స్నేహం మారలేదు! ఒకరిది విజన్ మరొకరిది ఇన్నోవేషన్ - కానీ స్టైల్ ఒక్కటే! Pashu Kisan Card: రైతులకు తక్కువ వడ్డీ లోన్…! పశు కిసాన్ కార్డు ప్రయోజనాలు ఇవే! AP Technology: చంద్రబాబు విజన్ అద్భుతం.. ఏపీ టెక్నాలజీపై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు! Bill Gates Meets CBN: ఏపీలో టెక్ పాలన గ్రేట్.. ఆర్జీజీఎస్ సందర్శన అనంతరం బిల్ గేట్స్ వ్యాఖ్యలు.. Gannavaram: గన్నవరంలో చారిత్రాత్మక ఘట్టం.. అమరావతి గడ్డపై అపర కుబేరుడు! AP New Pensions 2026: పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్: ఏపీలో కొత్త దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు! Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Nara Lokesh: ఢిల్లీకి మంత్రి లోకేష్... ఈరోజు సాయంత్రం అమిత్ షాతో కీలక భేటీ! Under water Tunnel: రూ. 18,000 కోట్లతో దేశంలోనే తొలి అండర్ వాటర్ టన్నెల్! గంటల సమయం ఇక నిమిషాల్లోనే! Chandrababu Speech: నాడు హైదరాబాద్.. నేడు అమరావతి! ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తు నగరాల మ్యాప్! AP CM bill gates Friendship: కాలం మారింది.. కానీ ఆ స్నేహం మారలేదు! ఒకరిది విజన్ మరొకరిది ఇన్నోవేషన్ - కానీ స్టైల్ ఒక్కటే! Pashu Kisan Card: రైతులకు తక్కువ వడ్డీ లోన్…! పశు కిసాన్ కార్డు ప్రయోజనాలు ఇవే! AP Technology: చంద్రబాబు విజన్ అద్భుతం.. ఏపీ టెక్నాలజీపై బిల్ గేట్స్ ప్రశంసల జల్లు! Bill Gates Meets CBN: ఏపీలో టెక్ పాలన గ్రేట్.. ఆర్జీజీఎస్ సందర్శన అనంతరం బిల్ గేట్స్ వ్యాఖ్యలు.. Gannavaram: గన్నవరంలో చారిత్రాత్మక ఘట్టం.. అమరావతి గడ్డపై అపర కుబేరుడు! AP New Pensions 2026: పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్: ఏపీలో కొత్త దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

Bill Gates visit Amaravati Highlights: నైస్... గుడ్... గ్రేట్-రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై.. బిల్ గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్..!

Bill Gates visit to Amaravati: అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన కేవలం ఒక అతిథి రాక మాత్రమే కాదు, అది రెండు దశాబ్దాల నాటి స్నేహానికి పునర్వైభవం. సామాన్యుడి జీవితంలో సాంకేతికత ఎలా మార్పు తెస్తుందో నిరూపించేందుకు చంద్రబాబు - బిల్ గేట్స్ జోడీ మరోసారి సిద్ధమైంది.

Published : 2026-02-16 20:32:00
  • ప్రకృతి సాగు గురించి రైతులు అధికారులతో చర్చించిన బిల్ గేట్స్.. ఆ పంట ఉత్పత్తులను.!
     
  • తొలి మీటింగ్ లోనే చంద్రబాబు విజనరీ..

Bill Gates visit to Amaravati Highlights: అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన కేవలం ఒక అతిథి రాక మాత్రమే కాదు, అది రెండు దశాబ్దాల నాటి స్నేహానికి పునర్వైభవం. సామాన్యుడి జీవితంలో సాంకేతికత ఎలా మార్పు తెస్తుందో నిరూపించేందుకు చంద్రబాబు - బిల్ గేట్స్ జోడీ మరోసారి సిద్ధమైంది. గన్నవరం విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నలుగురు మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే, అసలు సందడి సచివాలయం వద్ద మొదలైంది. కారు దిగీ దిగగానే ముఖ్యమంత్రి చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ ముఖంలో ఒక వింత మెరుపు కనిపించింది. "హలో ఫ్రెండ్.. హౌ ఆర్ యూ!" అంటూ అప్యాయంగా పలకరించారు. ఆ పిలుపులోనే వారి మధ్య ఉన్న దశాబ్దాల నాటి అనుబంధం స్పష్టంగా కనిపించింది. అనంతరం డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఇతర మంత్రులను సీఎం పేరుపేరునా గేట్స్‌కు పరిచయం చేశారు.

బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కోసం సీఎం చాంబర్‌లోకి వెళ్లిన బిల్ గేట్స్‌కు చంద్రబాబు ఒక అద్భుతమైన బహుమతిని చూపించారు. అది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిలువెత్తు చిత్రపటం. శ్రీవారి విశిష్టతను, తిరుమల క్షేత్రం యొక్క గొప్పదనాన్ని గేట్స్‌కు సీఎం వివరించారు. టెక్నాలజీ గురించి మాట్లాడటానికి ముందు ఇలాంటి ఆధ్యాత్మిక అంశాలను పంచుకోవడం ఒక గొప్ప అనుభూతిని మిగిల్చింది. బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఇద్దరూ కలిసి రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) సెంటర్‌కు వెళ్లారు. విపత్తుల సమయంలో, ప్రజా సేవలను వేగంగా అందించడంలో టెక్నాలజీని ఎలా వాడుతున్నారో సీఎం ఉదాహరణలతో వివరించారు.

డేటా లేక్ & వాట్సాప్ గవర్నెన్స్: వీటి ద్వారా పౌర సేవలను సులభతరం చేయడాన్ని చూసి గేట్స్ ఆశ్చర్యపోయారు.
సంజీవని ప్రాజెక్టు: కుప్పంలో ఏఐ (AI) సాయంతో హెల్త్ రికార్డులను పర్యవేక్షిస్తున్న తీరును చూసి "దట్స్ నైస్" అంటూ మెచ్చుకున్నారు. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు పేదలకు తక్కువ ధరకే అందాలన్న గేట్స్ సూచన ప్రాధాన్యత సంతరించుకుంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రణాళికలను చూసి బిల్ గేట్స్ ముగ్ధులయ్యారు. బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్ (నీరు మరియు పచ్చదనం) మరియు గ్రీన్ ఎనర్జీ వినియోగంపై సీఎం చేస్తున్న ప్రయోగాలు బాగున్నాయని ఆయన కొనియాడారు. రాజధాని మాస్టర్ ప్లాన్ చూసి "గ్రేట్ వర్క్" అంటూ కితాబిచ్చారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అమరావతిని ఒక రోల్ మోడల్ సిటీగా నిర్మిస్తున్న తీరును గేట్స్ ఆసక్తిగా విన్నారు. మంత్రులు, సెక్రటరీల సమావేశంలో గతాన్ని గుర్తు చేసుకున్నారు. నాడు ఢిల్లీలో జరిగిన తొలి సమావేశం, అప్పుడు చంద్రబాబు గారు మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్ రప్పించడానికి పడిన తాపత్రయం, అమెరికా బయట తొలి డెవలప్‌మెంట్ సెంటర్ మన దగ్గరే ఏర్పాటు కావడం గురించి ఇద్దరూ నెమరువేసుకున్నారు. "చంద్రబాబులో ఆ రోజే నేను ఒక గొప్ప విజనరీని చూశాను" అని గేట్స్ చెప్పడం సభికులను ఆకట్టుకుంది.

సచివాలయం నుంచి నేరుగా బిల్ గేట్స్ బృందం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లింది. అక్కడ సాగులో టెక్నాలజీ వినియోగాన్ని చూసి ఆయన ఫిదా అయ్యారు.
AP-AIMS యాప్: రైతు తన మొబైల్ ద్వారా పంటకు వచ్చిన తెగులును గుర్తించే విధానాన్ని చూశారు.
డ్రోన్ స్ప్రేయింగ్: డ్రోన్ ద్వారా మందులను పిచికారి చేయడం ఆయనను ఆకట్టుకుంది.
రుచికరమైన ఆతిథ్యం: మన రైతులు ప్రేమతో వడ్డించిన స్థానిక వంటకాలను బిల్ గేట్స్ రుచి చూశారు. ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించి, వాటి నాణ్యతను మెచ్చుకున్నారు.

బిల్ గేట్స్ పర్యటన కేవలం ఫోటోలకే పరిమితం కాలేదు. అది ఒక బలమైన ఆర్థిక మరియు సామాజిక మార్పుకు సంకేతం. ఆరోగ్య రంగంలో ఏఐ, వ్యవసాయంలో టెక్నాలజీ, రాజధాని నిర్మాణంలో గ్రీన్ ఎనర్జీ.. ఇలా ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందుకు వేశాం. బిల్ గేట్స్ వంటి ప్రపంచ మేధావి అభినందనలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

Spotlight

Read More →