Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..?

Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి..

Prajavedhika: విజయనగరంకు చెందిన లియోనీ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..తన తల్లి విశాఖపట్నంలోని క్వీన్స్ మేరీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 1993లో మరణించారు.

Published : 2026-05-25 21:53:00
  • రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తెంటు లక్ష్మీ నాయుడు..
     
  • Politics: అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు..

Prajavedhika: విజయనగరంకు చెందిన లియోనీ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..తన తల్లి విశాఖపట్నంలోని క్వీన్స్ మేరీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 1993లో మరణించారు. ఆమె మరణానంతరం వచ్చిన సర్వీస్, డెత్ బెనిఫిట్స్ డబ్బుతో తన తండ్రి (సలాది ముత్యాల రాయుడు) విజయనగరంలో సుమారు 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2020లో తండ్రి మరణించిన తర్వాత, అతని రెండో భార్య కుమార్తెలు తప్పుడు సమాచారంతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొంది ఆ భూమిని హస్తగతం చేసుకోవాలని చూశారు. అయితే తమ ఫిర్యాదుతో విచారణ జరిపిన విజయనగరం ఎమ్మార్వో గారు ఆ తప్పుడు సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. దీనితో ఈ 50 ఎకరాలపై తమకే పూర్తి లీగల్ వారసత్వ హక్కులు స్థిరపడ్డాయి. తాము స్థానికంగా ఉండకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, విజయనగరం ఇప్పిలి వీధికి చెందిన రియల్టర్ అప్పలరాజు రంగంలోకి దిగాడు. తనకు సాయం చేస్తానని నమ్మబలికి, తమ వద్ద నుండి పలు ఖాళీ కాగితాలు, నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్నాడు. 

అనంతరం వైఎస్సార్‌సీపీకి చెందిన అప్పటి ప్రముఖ పెద్దలు, ముఖ్య నేతల రాజకీయ అండతో ఆ సంతకాలను ఫోర్జరీ చేసి తమకి తెలియకుండానే ఆ 50 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించాడు. ఈ భూదందా కేవలం 50 ఎకరాలతో ఆగలేదు. అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు కలిసి ప్రభుత్వ భూములు, పంట కాలువలు, చిన్నచిన్న చెరువులను కూడా అడ్డగోలుగా ఆక్రమించారు. మొత్తం 80 ఎకరాల విస్తీర్ణంలో "A.R. గ్రాండ్" పేరుతో ఎలాంటి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనుమతులు లేకుండా, చట్టవిరుద్ధంగా భారీ లేఅవుట్ వేసి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ఈ అక్రమ లేఅవుట్ ద్వారా దాదాపు 700 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని, ప్రైవేటు ఆస్తిని దోచుకోవడానికి స్కెచ్ వేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తెంటు లక్ష్మీ నాయుడులకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించారు.

అనంతపురం జిల్లా యల్లనూరుకు చెందిన కుళ్లాయమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో తాతల కాలం నుండి వస్తున్న భూమి కలదు. సర్వే నంబర్లు 164/c 165/cలో ఉన్న ఈ భూమికి సంబంధించిన అసలైన రిజిస్టర్ పత్రాలు ఇప్పటికీ తమ పేరిటే ఉన్నాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఆ భూమిని సాగు చేసుకుంటున్నది కూడా తామే. అయితే గత 8 సంవత్సరాల క్రితం మాసినేని రామయ్య అనే వ్యక్తి పొరుగువారి భూమిని అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు. దీనికి తోడు అప్పటి స్థానిక తహశీల్దారు గారు నిందితుడి వద్ద భారీగా లంచం తీసుకుని, తమ వైపు నుండి ఎలాంటి సంతకాలు లేదా సమ్మతి పత్రాలు లేకపోయినప్పటికీ, ఆన్‌లైన్ రికార్డులలో తప్పుడు వివరాలను ఎక్కించి అక్రమార్కులకు సహకరించారు. ఈ అన్యాయంపై న్యాయం చేయాలంటూ గత 7 సంవత్సరాలుగా స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. అక్కడ స్పందన లేకపోవడంతో గత ఒక సంవత్సర కాలంగా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని కలిసి ఎన్నో అర్జీలు సమర్పించాను. అయినా ఉన్నతాధికారుల నుండి కూడా ఇప్పటివరకు ఎటువంటి పురోగతి గానీ, న్యాయం గానీ జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రత్నమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ మామగారైన కురుబ బోదన్నకు 1967లో సర్వే నంబర్ 450-2 లోని 4.84 ఎకరాల భూమిని ప్రభుత్వం డి-పట్టాగా మంజూరు చేసింది. కంబదూరు రెవెన్యూ రికార్డులలో పట్టా నెం. 1698గా నమోదైన ఈ భూమిలో తమ కుటుంబం గత 60 సంవత్సరాలుగా శాంతియుతంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. ఆస్తిపై కన్నేసిన కొందరు వ్యక్తులు స్థానిక తహశీల్దార్ ఆఫీస్ అధికారులతో కుమ్మక్కయ్యారు. గత ఏడాది ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని సగానికి విభజించి (సర్వే నం. 450-2 లోని 2.42 ఎకరాలకు) పట్టా నం. 870 పేరుతో దొంగ పట్టాలు సృష్టించారు. ఈ దొంగ పట్టాలను అడ్డం పెట్టుకుని వి. వీరాంజనేయులు, వి. శ్రీరంగరాజులు, వడ్డే గంగాధర్, వి. వెంకటేశులు అనే వ్యక్తులు ఏకమై తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. "భూమిలో సగం భాగం వదిలిపెట్టాలి" అంటూ దౌర్జన్యానికి దిగారు. ఎదురు తిరగడంతో ఆగ్రహం చెందిన సదరు వ్యక్తులు కర్రలు, సైకిల్ చైన్లతో తనను తన కుమారుడిని ఇష్టానుసారంగా కొడుతూ ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

గుంటూరుకు చెందిన ఉమాసాయి ప్రియ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తెనాలి మండలం అంగులకుదురు గ్రామానికి చెందిన బెజవాడ ప్రకాశ్ అనే వ్యక్తి, తన తల్లి క్యాన్సర్ వ్యాధితో చావుబతుకుల్లో ఉందని, అత్యవసరంగా డబ్బులు కావాలని తనను నమ్మించాడు. తన వద్ద ఉన్న ఒక బంగారపు గొలుసు, రెండు గాజులు, చెవి దిద్దులు (సుమారు 70 గ్రాముల బంగారం) తీసుకుని.. గుంటూరు బ్రాడీపేటలోని 'కల్పన ఫైనాన్స్' లో బలవంతంగా తాకట్టు పెట్టించాడు. ఆ తాకట్టు ద్వారా వచ్చిన డబ్బును తీసుకుని నిందితుడు బెజవాడ ప్రకాశ్ పరారయ్యాడు. ఈ మోసంపై గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి న్యాయం చేయాలని వేడుకున్నాను. ఎస్పీ గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ నందు ది. 08-09-2025న FIR నెం. 337/2025 ప్రకారం కేసు నమోదైంది. అయితే కేసు నమోదై 8 నెలలు గడుస్తున్నా నగరపాలెం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంలో తీవ్ర కాలయాపన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండగా.. నిందితుడు బెజవాడ ప్రకాశ్‌ను విచారించామని, కేసును రీ-ఓపెన్ చేశామని కాలక్షేపపు మాటలు చెబుతూ పోలీసులు తప్పించుకుంటున్నారే తప్ప, ఇప్పటివరకు బంగారాన్ని రికవరీ చేయలేదు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Spotlight

Read More →