ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సర్జరీ..
ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స జరగడంతో ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు, ఆయన ఆరోగ్య పరిస్థితిని దగ్గరగా తెలుసుకున్నారు. వైద్యుల సూచనలను పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఈ పరామర్శతో ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి స్పష్టమైంది.