- ఆర్టీజీఎస్ నుంచి స్వర్ణాంధ్ర - తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు!
- 2047 వరకు చంద్రబాబు దూరదృష్టికి అంతర్జాతీయ మద్దతు!
Palla SrinivasaRao Speech: విజన్ ఉన్న నాయకుడు విలువ ప్రపంచానికి తెలిసింది. అందులో భాగం గానే ప్రపంచంలోనే అపర కుబేరుడు గా పేరు గాంచిన మైక్రోసాఫ్ట్ ఫౌండర్ మరియు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనా విధానాన్ని, టెక్నాలజీ దూరదృష్టిని ప్రశంసించడం రాష్ట్రానికి గర్వకారణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించి, అక్కడ అమలవుతున్న రియల్ టైమ్ గవర్నెన్స్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరించిన పాలనా నమూనాపై ఆసక్తి చూపించడం ఆయన విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందనే విషయాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు.
చంద్రబాబు దూరదృష్టిపై బిల్ గేట్స్ ప్రత్యేక ప్రశంసలు
బిల్ గేట్స్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ స్థాయి దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పాలన, టెక్నాలజీ వ్యవస్థలను పరిశీలించిన తన అనుభవంలో, డిజిటల్ గవర్నెన్స్‌ను ప్రజల జీవితాలతో ఇంత సమర్థంగా మేళవించిన నాయకుడు చాలా అరుదని వ్యాఖ్యానించారు. డిజిటల్ గవర్నెన్స్ గురించి ప్రపంచ వేదికలపై తాను సిద్ధాంతపరంగా వివరిస్తుంటే, ఆ సిద్ధాంతాలను నేలమీద కార్యరూపం దాల్చేలా అమలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని బిల్ గేట్స్ స్పష్టం చేయడం విశేషమన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా పాలనను వేగవంతం చేయడం, ప్రజల అవసరాలను రియల్ టైమ్‌లో గుర్తించి స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం ఆయన ముందుచూపుకు నిదర్శనమని గేట్స్ ప్రశంసించారు.
డిజిటల్ విప్లవంలో చంద్రబాబు కీలక పాత్ర
భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషిస్తున్నారని బిల్ గేట్స్ స్పష్టంగా పేర్కొనడం రాష్ట్రానికి గర్వకారణమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. టెక్నాలజీని కేవలం పరిపాలన కోసం కాకుండా, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ వంటి ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే రంగాల్లో ఉపయోగించడం చంద్రబాబు గారి ప్రత్యేకత అని గేట్స్ వ్యాఖ్యానించారని తెలిపారు.
చంద్రబాబు –భవిష్యత్ ని ముందే చూసే నాయకుడు
తాను తొలిసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడే ఆయన ఆలోచనల్లో అసాధారణమైన ముందుచూపు కనిపించిందని బిల్ గేట్స్ గుర్తు చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయమన్నారు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యాధునిక నగరాలుగా ఎదిగిన కొన్ని దేశాల నేతలతో పోల్చదగ్గ విజన్ చంద్రబాబు గారిలో ఉందని, నాటి సింగపూర్ ప్రధాని స్థాయిలో ఆలోచించిన భారతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని గేట్స్ వ్యాఖ్యానించడం ఆయన విజనరీ నాయకత్వానికి ప్రపంచ స్థాయి గుర్తింపుగా పల్లా అభివర్ణించారు.
స్వర్ణాంధ్ర–2047కు గేట్స్ ఫౌండేషన్ మద్దతు
స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్యాలను సాధించడంలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని బిల్ గేట్స్ స్పష్టంగా చెప్పడం, చంద్రబాబు నాయుడు గారి దీర్ఘకాలిక అభివృద్ధి దృష్టికి లభించిన అంతర్జాతీయ మద్దతుగా పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమాన్ని బిల్ గేట్స్ “అద్భుతమైన మోడల్”గా ప్రశంసించడం, చంద్రబాబు గారి ప్రజాకేంద్రిత పాలనకు నిదర్శనమన్నారు.
‘గుడ్ ఓల్డ్ ఫ్రెండ్’గా చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారిని తన “గుడ్ ఓల్డ్ ఫ్రెండ్”గా బిల్ గేట్స్ సరదాగా వ్యాఖ్యానించడం, దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పరస్పర గౌరవం, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. 90వ దశకంలో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు చంద్రబాబు గారు మద్దతు ఇచ్చిన దూరదృష్టే, నేటి డిజిటల్ పాలనకు పునాది అయిందని బిల్ గేట్స్ స్పష్టం చేయడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.