ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం మార్కులు - ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే? ఏపీలో 175 నియోజకవర్గాల.. రిలీజ్‌కు ముందే లీక్ అయిన సెన్సిటివ్ బుక్…! భద్రతా వర్గాల్లో టెన్షన్! పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్…! కొత్త యాప్‌తో డబ్బు డైరెక్ట్ ఖాతాలోకి! Praja Vedika: రేపు (10/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ యువతకు గ్లోబల్ ఛాన్స్.. అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీ! ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు…! జూన్ నాటికి 1.4 కోట్ల కార్డులు! కేంద్ర ఉద్యోగుల ఖాతాల్లో అదనపు నగదు…! డీఏ 60% ఖాయం! సంక్షేమం నుంచి పెట్టుబడుల వరకు…! ఏపీ భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను వెల్లడించిన సీఎం! ఏపీకి కేంద్ర బడ్జెట్ ధమాకా... రూ. 40,000 కోట్ల భారీ నిధుల కేటాయింపు! AP IT Policy: సంక్షేమం + సాంకేతికత.. ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ ప్లాన్! ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం మార్కులు - ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే? ఏపీలో 175 నియోజకవర్గాల.. రిలీజ్‌కు ముందే లీక్ అయిన సెన్సిటివ్ బుక్…! భద్రతా వర్గాల్లో టెన్షన్! పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్…! కొత్త యాప్‌తో డబ్బు డైరెక్ట్ ఖాతాలోకి! Praja Vedika: రేపు (10/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ యువతకు గ్లోబల్ ఛాన్స్.. అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీ! ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు…! జూన్ నాటికి 1.4 కోట్ల కార్డులు! కేంద్ర ఉద్యోగుల ఖాతాల్లో అదనపు నగదు…! డీఏ 60% ఖాయం! సంక్షేమం నుంచి పెట్టుబడుల వరకు…! ఏపీ భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను వెల్లడించిన సీఎం! ఏపీకి కేంద్ర బడ్జెట్ ధమాకా... రూ. 40,000 కోట్ల భారీ నిధుల కేటాయింపు! AP IT Policy: సంక్షేమం + సాంకేతికత.. ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు…! జూన్ నాటికి 1.4 కోట్ల కార్డులు!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆల్ ఇన్ వన్ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జూన్ నాటికి పంపిణీ చేయనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు

Published : 2026-02-09 17:13:00

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా వినూత్న కార్యక్రమాలు, కీలక విధానాలను అమలు చేస్తోంది. ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, త్వరలో మరో కొత్త ప్రోగ్రామ్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పాలనను మరింత పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పాలసీలను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, జనాభా నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జనాభా నిర్వహణ, ప్రజల ఆరోగ్యం, పిల్లలకు పౌష్టికాహారం అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్ బెనిఫిట్ సిస్టం ద్వారా సమగ్ర స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఫ్యామిలీ కార్డులో కుటుంబానికి సంబంధించిన అన్ని కీలక వివరాలు ఉంటాయని తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ ఆల్-ఇన్-వన్ స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సులభంగా అందించనున్నట్లు వెల్లడించారు. రియల్ టైం గవర్నెన్స్ విధానంలో కుటుంబ, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో సమీకరిస్తారని చెప్పారు. ఇప్పటికే ఈ వివరాల సేకరణ ప్రక్రియ పూర్తయిందని, జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 24 రకాల వివరాలతో పాటు ప్రజలకు అందుతున్న అన్ని ప్రభుత్వ సేవల సమాచారం ఈ కార్డులో ఉండనుంది.

ఇక రాష్ట్రంలో జనాభా మార్పులను దృష్టిలో పెట్టుకుని మార్చి నాటికి ప్రత్యేక పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. రానున్న కాలంలో వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని తెలిపారు. అలాగే సంజీవని ప్రాజెక్ట్ ద్వారా జులై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసులకు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం పథకం, అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యమని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో సిజేరియన్ డెలివరీలు తగ్గి నార్మల్ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ను ఎయిడ్స్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 60 ఏళ్లు దాటితే పనిచేయలేమనే భావన ప్రజల్లో ఉండకూడదని, ఆ సైకాలజీని మార్చేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు అవసరమైన సప్లిమెంట్స్ అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ విధానాలన్నీ సమర్థవంతంగా అమలైతే రాష్ట్రంలో ఆరోగ్య ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →