Iconic Towers: అమరావతిలో సరికొత్త రికార్డు.... ఆకాశాన్ని తాకే దిశగా ఐకానిక్ టవర్ల జంపింగ్! Lok Sabha seats: 33 శాతం రిజర్వేషన్లు.. 15 ఏళ్ల అమలు.. సీట్ల పెంపుపై తెలంగాణ, ఏపీ నేతల తీవ్ర ఆందోళన.. Lok Sabha: రేపు, ఎల్లుండి లోక్‌సభలో ఓటింగ్.. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఉత్కంఠ నిరీక్షణ.! Chandrababu: సీనియర్ల అనుభవం - యువత ఉత్సాహం.. సామాజిక న్యాయమే ప్రాతిపదికగా టీడీపీ కొత్త కమిటీలు.. Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేశ్ ముఖాముఖి.. తిరుపతి వేదికగా క్రీడాభివృద్ధికి సరికొత్త రోడ్ మ్యాప్! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేష్ భేటీ! ఏపీలో క్రీడల అభివృద్ధికి సరికొత్త ప్లాన్..! Praja Vedika: రేపు (16/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tdp new Committee: మంగళగిరి ఎమ్మెల్యే టు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా! జాతీయ కమిటీలో కీలక నియామకాలు ఇవే...! Minister Narayana: తండ్రికి తగ్గ తనయుడు.. లోకేష్‌కు సరికొత్త బాధ్యతలు.. మంత్రి నారాయణ హర్షం! Iconic Towers: అమరావతిలో సరికొత్త రికార్డు.... ఆకాశాన్ని తాకే దిశగా ఐకానిక్ టవర్ల జంపింగ్! Lok Sabha seats: 33 శాతం రిజర్వేషన్లు.. 15 ఏళ్ల అమలు.. సీట్ల పెంపుపై తెలంగాణ, ఏపీ నేతల తీవ్ర ఆందోళన.. Lok Sabha: రేపు, ఎల్లుండి లోక్‌సభలో ఓటింగ్.. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఉత్కంఠ నిరీక్షణ.! Chandrababu: సీనియర్ల అనుభవం - యువత ఉత్సాహం.. సామాజిక న్యాయమే ప్రాతిపదికగా టీడీపీ కొత్త కమిటీలు.. Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేశ్ ముఖాముఖి.. తిరుపతి వేదికగా క్రీడాభివృద్ధికి సరికొత్త రోడ్ మ్యాప్! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేష్ భేటీ! ఏపీలో క్రీడల అభివృద్ధికి సరికొత్త ప్లాన్..! Praja Vedika: రేపు (16/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tdp new Committee: మంగళగిరి ఎమ్మెల్యే టు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా! జాతీయ కమిటీలో కీలక నియామకాలు ఇవే...! Minister Narayana: తండ్రికి తగ్గ తనయుడు.. లోకేష్‌కు సరికొత్త బాధ్యతలు.. మంత్రి నారాయణ హర్షం!

Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్!

Minister Lokesh on Fee Reimbursement: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మంత్రి నారా లోకేష్ వైసీపీని నిలదీశారు. గత ప్రభుత్వం పెట్టిన రూ. 4064 కోట్ల బకాయిల వివరాలను వెల్లడించారు...

Published : 2026-02-13 14:14:00
  • లోకేష్ ఘాటుగా స్పందిస్తూ.. నిజాలు చేదుగా ఉంటాయి కాబట్టే.!
     
  • తమ ప్రభుత్వం రాగానే ఇంటర్ విద్యార్థులకు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈరోజు ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల చదువులకు సంబంధించిన ఫీజులను చెల్లించకుండా కోట్లాది రూపాయల బకాయిలు పెట్టి వెళ్లారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సభలో చర్చకు రావాలని, అబద్ధపు ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని  హితవు పలికారు.

మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, గత ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి లోకేష్ లెక్కలతో సహా ఎండగట్టారు. వైసీపీ పాలనలో అక్షరాలా రూ. 4064.59 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బకాయిల వివరాలను వివరిస్తూ.. 2020-21 సంవత్సరానికి సంబంధించి రూ. 683.1 కోట్లు, అలాగే 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ క్వార్టర్లకు సంబంధించి సుమారు రూ. 1753 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటికి తోడు మెయింటెనెన్స్ ఫీజు (MTF) కింద మరో రూ. 895 కోట్లు చెల్లించలేదని చెప్పారు.

ప్రభుత్వం మారే సమయానికి కూడా రూ. 645 కోట్లు అప్పగించకుండా వెళ్లిపోయారని, ఇవన్నీ రికార్డుల్లో ఉన్న సత్యాలని ఆయన సభలో నిలదీశారు. తాను విద్యాశాఖ మంత్రిగా ఈ వాస్తవాలను బయటపెట్టే హక్కు తనకు ఉందని, ఈ లెక్కలను సభ ముందు ఉంచుతానని సవాల్ విసిరారు. మంత్రి లోకేష్ విమర్శలపై వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. తమ హయాంలో అన్ని బకాయిలు లేవని, కేవలం రెండు వాయిదాలు మాత్రమే ఉన్నాయని వాదించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇంటర్ విద్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, తమ నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

దీనిపై లోకేష్ ఘాటుగా స్పందిస్తూ.. నిజాలు చేదుగా ఉంటాయి కాబట్టే వైసీపీ నేతలు పారిపోతున్నారు. వాకౌట్ చేయడం వారికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ తలుపు నుంచి బయటకు వెళ్లి, హాయిగా టీ తాగి మళ్ళీ మరో తలుపు నుంచి లోపలికి వస్తారు. వీరికి ప్రజల సమస్యల మీద కంటే డ్రామాల మీద ఎక్కువ ఆసక్తి ఉంది అని ఎద్దేవా చేశారు. ఇంటర్ విద్యపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలను లోకేష్ తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏకంగా 70 వేల మంది విద్యార్థులు పెరిగారని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కనీసం విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు కూడా సరిగ్గా ఇవ్వలేదని, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అటకెక్కించారని మండిపడ్డారు.

కానీ తమ ప్రభుత్వం రాగానే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించామని, టెన్త్ మరియు ఇంటర్ పిల్లల కోసం 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నామని వివరించారు. వైసీపీ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరం కావడం వారి వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. చివరగా, రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజల ప్రభుత్వమని, గతంలో లాగా పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి ఇప్పుడు లేరని లోకేష్ అన్నారు.

Spotlight

Read More →