ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం.. సామాన్యులకు ఊరట, కార్పొరేట్లకు షాక్! వారికి జైలు శిక్ష తగ్గింపు.. Modi Reaction: ప్రపంచంలో 3వ స్థానమే లక్ష్యం.. మోదీ మంత్రం.. నిర్మలమ్మ తంత్రం! ప్రధాని కీలక వ్యాఖ్యలు.. TTD Updates: టీటీడీలో భారీ మార్పు.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.! కొత్త ఈవోగా ఆయన నియామకం.. Budget 2026-27: సామాన్యుడి జేబుపై ప్రభావం.. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? వారికి పండగే.. Union Budget 2026: చిన్న రైతులే దేశానికి వెన్నెముక.. పశువుల కాపరి నుండి పాడి రైతు వరకు ఆదాయం డబుల్! కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నారైలకు గోల్డెన్ ఛాన్స్! 10% నుండి 24%కి పెంపు - భారత మార్కెట్లోకి డాలర్ల వరద! ప్రపంచ స్థాయి రాజధాని దిశగా: దోహాలో క్రీడా ప్రాంగణాలు, లండన్‌లో టూరిజం ప్రాజెక్టుల పరిశీలన.. అమరావతికి కొత్త హంగులు! బడ్జెట్ బొనాంజా…. కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీ మ్యాప్‌నే మార్చబోతున్న మెగా ప్రాజెక్టులు! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 !

AP POLITICS: వైసీపీ కి షాక్.. అంబటి అరెస్ట్…! గుంటూరులో హైటెన్షన్..!

సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనలు, దాడులు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Published : 2026-02-01 09:04:00

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబును దూషించారంటూ టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అంబటిపై 126(2), 196, 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నల్లపాడు ఎస్సై కృష్ణమోహన్ ఇచ్చిన మరో ఫిర్యాదు మేరకు 126(2), 132 BNS సెక్షన్ల కింద మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో అంబటిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్‌కు ముందు, అరెస్ట్ అనంతరం కూడా అంబటి నివాసం, కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు అంబటి కార్యాలయంలోకి దూసుకెళ్లి అక్కడ ఉన్న కార్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అంబటిని అరెస్ట్ చేసి తరలిస్తున్న సమయంలో పోలీసుల వజ్రవాహనంపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి దాడికి యత్నించారు. అంతేకాదు అంబటి కార్యాలయానికి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఫ్లెక్సీలకు మంటలు అంటించి కార్యాలయం లోపలికి విసిరేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే మంటలను ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటనల నేపథ్యంలో అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమకు తక్షణమే భద్రత కల్పించాలని పిటిషన్‌లో కోరారు. తనతో పాటు సుమారు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. అంబటి అరెస్ట్ అనంతరం కూడా గుంటూరులో అర్ధరాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి. అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించిన తరువాత కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగింది.

ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. అంబటిపై జరిగిన దాడిని ఖండిస్తూ, ఇవన్నీ సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే జరిగాయని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, ఏపీ జంగిల్ రాజ్‌గా మారిపోయిందని విమర్శించారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ ఆటవిక రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. వంగవీటి మోహనరంగా హత్య తరహాలోనే అంబటిపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. అంబటికి ప్రాణహాని ఉందని పేర్కొంటూ, ఆయనకు మరియు ఆయన కుటుంబానికి భద్రత కల్పించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డీజీపీకి లేఖ రాశారు.

Spotlight

Read More →