Sharif: లైవ్ కెమెరాలు ఆపేసి నాపై దాడి చేశారు.. మంత్రి నేరుగా.. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మాజీ ఛైర్మన్ ఆవేదన.! APNRT: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రుల సంబరాలు.. ఎన్నారైలకు ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక పిలుపు.. మీ సంతోషాన్ని పంచుకోండి - రవి వేమూరు APThanksIndia: జాతీయ స్థాయిలో ఏపీ గళం - 'X'లో నంబర్ వన్ స్థానంలో.. లక్షలాది ట్వీట్లతో టాప్ ప్లేస్‌కు.. నిమిషాల్లోనే వైరల్.! Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Parliament special session: దేశ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. మూడు రోజుల పాటు ఢిల్లీలో హైడ్రామా.. ఉత్కంఠ రేపుతున్న ప్రత్యేక సెషన్.! Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి! Prajavedhika: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్కామ్... భూ కబ్జాలపై బాధితుల గర్జన! గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన వైసీపీ నేతల అక్రమాల చిట్టా Amaravati Celebrations: అమరావతి గెలిచింది: గ్రామాల్లో సంబరాలు.. ఢిల్లీలో రాజకీయ కలయికలు! Minister Nimmala: పోలవరం లక్ష్యం 2027.. వచ్చే పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి.. మంత్రి నిమ్మల కీలక ప్రకటన.! Sharif: లైవ్ కెమెరాలు ఆపేసి నాపై దాడి చేశారు.. మంత్రి నేరుగా.. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై మాజీ ఛైర్మన్ ఆవేదన.! APNRT: ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రుల సంబరాలు.. ఎన్నారైలకు ఏపీఎన్ఆర్టీ ప్రత్యేక పిలుపు.. మీ సంతోషాన్ని పంచుకోండి - రవి వేమూరు APThanksIndia: జాతీయ స్థాయిలో ఏపీ గళం - 'X'లో నంబర్ వన్ స్థానంలో.. లక్షలాది ట్వీట్లతో టాప్ ప్లేస్‌కు.. నిమిషాల్లోనే వైరల్.! Nara Lokesh: ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని... ఢిల్లీ వేదికగా లోకేశ్ గర్జన! Parliament special session: దేశ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. మూడు రోజుల పాటు ఢిల్లీలో హైడ్రామా.. ఉత్కంఠ రేపుతున్న ప్రత్యేక సెషన్.! Polavaram Update 2026: పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి... విజయవంతంగా పూర్తయిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం! Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం... కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి! Prajavedhika: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్కామ్... భూ కబ్జాలపై బాధితుల గర్జన! గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన వైసీపీ నేతల అక్రమాల చిట్టా Amaravati Celebrations: అమరావతి గెలిచింది: గ్రామాల్లో సంబరాలు.. ఢిల్లీలో రాజకీయ కలయికలు! Minister Nimmala: పోలవరం లక్ష్యం 2027.. వచ్చే పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి.. మంత్రి నిమ్మల కీలక ప్రకటన.!

Amaravati Bill: ఐదు కోట్ల ఆంధ్రుల విజయం - సీఎం చంద్రబాబు హర్షం..!

Amaravati Bill: పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం అమరావతి రైతులకు అంకితమని, ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని ఆయన పేర్కొన్నారు

Published : 2026-04-02 19:30:00

Amaravati Bill: ఆంధ్రప్రదేశ్ జీవనాడి, కోట్లా మంది ప్రజల కలల రాజధాని అమరావతికి సంబంధించి దేశ అత్యున్నత చట్టసభలో కీలక ముందడుగు పడింది. పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ  బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు నేడు నెరవేరాయని ఆయన కొనియాడారు. ఈ విజయం కేవలం ప్రభుత్వానిది మాత్రమే కాదు, ప్రతి ఆంధ్రుడి గర్వకారణమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అమరావతి నిర్మాణంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2015లో రాజధాని నగరానికి పునాది వేయడం నుంచి, 2025లో పునర్నిర్మాణ పనుల వరకు ప్రధాని అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ సహకారం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని, కేంద్ర-రాష్ట్రాల అనుబంధం ఏపీని అగ్రపథాన నిలుపుతుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా అమరావతి రైతుల పోరాటాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. "ఈ విజయం అమరావతి రైతులకే అంకితం" అని ఆయన ప్రకటించారు. గత కొన్నేళ్లుగా రాజధాని కోసం రైతులు చేసిన భూత్యాగం, వారు ఎదుర్కొన్న కష్టాలు, చూపిన పట్టుదల మరువలేనివని కొనియాడారు. రాజధానిపై గతంలో ఉన్న సందిగ్ధతలకు, అడ్డంకులకు నేటితో పూర్తిగా తెరపడిందని, ఇకపై అమరావతి ఏకైక ప్రజా రాజధానిగా వెలుగులీనుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొందని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ చీకటి రోజులకు ఈ బిల్లు ఆమోదం ఒక ముగింపు పలికిందని, రాష్ట్ర ప్రగతికి ఇది ఒక కొత్త నాంది అని చెప్పారు. అమరావతిని కేవలం ఒక నగరంగా చూడటం లేదని, అది ఏపీకి గుండె  ఆత్మ అని ఆయన అభివర్ణించారు. రాజధాని నగరం ఇకపై 'అన్‌స్టాపబుల్' అని, అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించారు.

రాబోయే రోజుల్లో అమరావతిని దేశంలోనే అత్యుత్తమ భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సుస్థిరమైన పరిపాలన, ఆధునిక వసతులతో అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. పార్లమెంటులో పార్టీలకతీతంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఏపీలో నూతన శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక గొప్ప సంకల్పంతో మొదలైన అమరావతి ప్రయాణం నేడు గమ్యానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు.

Spotlight

Read More →