Middle East Crisis: అమెరికా-ఇరాన్ చర్చలకు ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో బిగ్ మీటింగ్..! Middle East Crisis: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 15 రోజుల కాల్పుల విరమణ.. లెబనాన్‌కు వర్తించదన్న నెతన్యాహు! Trump: ట్రంప్ కీలక నిర్ణయం... ఇరాన్‌కు ఆఖరి ఛాన్స్! శాంతి ఒప్పందానికి మరో 15 రోజుల గడువు! Middle East War: మీ నాగరికతను భూస్థాపితం చేస్తా".. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ యుద్ధ గర్జన! Hormuz Strait Conflict: ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్... ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తాం" - టెహ్రాన్ ఘాటు కౌంటర్! USA MC130J: అమెరికా ఎంసీ-130జే విమానాలు నేలమట్టం... రక్షణ రంగంలో కలకలం. Middle East War: నేడు ముగియనున్న గడువు! జలసంధి తెరవకుంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యం… Australia: పల్నాడు పౌరుషం.. విదేశీ గడ్డపై సందడి! న్యూజిలాండ్‌లో జీవీ ఆంజనేయులకు ఘన వీడ్కోలు.. 50కి పైగా కార్లతో.. Middle East War: ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం... భారత్‍కు చేరుకున్న 345 మంది మత్స్యకారులు...! NRITDP Melbourne: మెల్బోర్న్‌లో అమరావతి సంబరాలు... చట్టబద్ధతపై ఎన్నారైల హర్షం! Middle East Crisis: అమెరికా-ఇరాన్ చర్చలకు ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో బిగ్ మీటింగ్..! Middle East Crisis: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 15 రోజుల కాల్పుల విరమణ.. లెబనాన్‌కు వర్తించదన్న నెతన్యాహు! Trump: ట్రంప్ కీలక నిర్ణయం... ఇరాన్‌కు ఆఖరి ఛాన్స్! శాంతి ఒప్పందానికి మరో 15 రోజుల గడువు! Middle East War: మీ నాగరికతను భూస్థాపితం చేస్తా".. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ యుద్ధ గర్జన! Hormuz Strait Conflict: ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్... ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తాం" - టెహ్రాన్ ఘాటు కౌంటర్! USA MC130J: అమెరికా ఎంసీ-130జే విమానాలు నేలమట్టం... రక్షణ రంగంలో కలకలం. Middle East War: నేడు ముగియనున్న గడువు! జలసంధి తెరవకుంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యం… Australia: పల్నాడు పౌరుషం.. విదేశీ గడ్డపై సందడి! న్యూజిలాండ్‌లో జీవీ ఆంజనేయులకు ఘన వీడ్కోలు.. 50కి పైగా కార్లతో.. Middle East War: ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం... భారత్‍కు చేరుకున్న 345 మంది మత్స్యకారులు...! NRITDP Melbourne: మెల్బోర్న్‌లో అమరావతి సంబరాలు... చట్టబద్ధతపై ఎన్నారైల హర్షం!

Middle East Crisis: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 15 రోజుల కాల్పుల విరమణ.. లెబనాన్‌కు వర్తించదన్న నెతన్యాహు!

Middle East Crisis: అమెరికా, ఇరాన్ మధ్య 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించగా, ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.

Published : 2026-04-08 08:51:00

Middle East Crisis: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచ దేశాలకు ఊరటనిస్తూ అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కేవలం గంట ముందు ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు సఫలమయ్యాయని, శుక్రవారం రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు జరుగుతాయని తెలుస్తోంది.

ఈ కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని  ప్రకటించారు. ఇరాన్ నుంచి ఎదురయ్యే అణు ముప్పు, క్షిపణి దాడులు  ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఇజ్రాయెల్ స్వాగతిస్తోందని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఇరాన్ వల్ల కలిగే ముప్పును శాశ్వతంగా తొలగించే దిశగా అమెరికా కట్టుబడి ఉండాలని ఇజ్రాయెల్ కోరింది.

 ఈ కాల్పుల విరమణ విషయంలో నెతన్యాహు ఒక ముఖ్యమైన స్పష్టత ఇచ్చారు. ఈ 15 రోజుల ఒప్పందం కేవలం అమెరికా-ఇరాన్ మధ్య మాత్రమేనని, ఇది లెబనాన్‌కు వర్తించదని ఆయన తేల్చి చెప్పారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ఈ ఒప్పందం లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని చెప్పగా, నెతన్యాహు మాత్రం దాన్ని ఖండించారు. లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను యథావిధిగా కొనసాగిస్తుందని  మాటల ద్వారా స్పష్టమవుతోంది.

లెబనాన్ ప్రస్తుత పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మార్చి 2న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యకు ప్రతీకారంగా హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్ నగరాలపై రాకెట్ దాడులు చేయడంతో యుద్ధం మొదలైంది. దీనికి సమాధానంగా ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల్లో ఇప్పటివరకు 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశ జనాభాలో ఐదో వంతు అంటే దాదాపు 10 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లారు. తాజాగా నెతన్యాహు చేసిన ప్రకటనతో లెబనాన్ ప్రజలకు యుద్ధం నుంచి తక్షణ ఉపశమనం లభించేలా కనిపించడం లేదు.

మరోవైపు, ఈ కాల్పుల విరమణ వార్తతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. యుద్ధం ముదురుతుందన్న భయంతో గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలు, ఇప్పుడు శాంతి చర్చల సంకేతాలతో సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ఈ కాల్పుల విరమణను తన "విజయం"గా అభివర్ణించుకుంటుండగా, అమెరికా మాత్రం ఇది కేవలం చర్చలకు ఇచ్చిన సమయం మాత్రమేనని, ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందో లేదో తెలియాలంటే మరో రెండు వారాలు వేచి చూడాల్సిందే.

Spotlight

Read More →