Iran Attack: యుద్ధరంగంలో గేమ్ చేంజర్..! ఇరాన్ ‘డ్యాన్సింగ్ మిస్సైల్’! Donald Trump: అమెరికా బలహీనత బయటపడింది..! ఇరాన్ విదేశాంగ మంత్రి సంచలన పోస్ట్! Petrol Price: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..! పాక్‌లో నింగికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు..! War Alert: కిమ్ జోంగ్ ఉన్ కొత్త ప్లాన్.. క్షిపణి ప్రయోగం వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే! H1B Visa: అమెరికాలో వీసా కుంభకోణం బట్టబయలు... 11 మంది భారతీయులు అరెస్ట్! Missile Strike: అగ్రరాజ్యానికి కోలుకోలేని దెబ్బ! ఇరాన్ దాడిలో 5 అమెరికా విమానాలు ధ్వంసం! US Iran War: ఇరాన్ క్షిపణి దాడుల ధాటికి అమెరికా బేస్‌లు ధ్వంసం..! వందలాది మంది సైనికులు మృతి? Donald Trump: చమురు ధరలు పెరిగితే అమెరికాకే లాభం..! ట్రంప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ షాక్.. ఇరాక్‌లో కూలిన నాలుగో యుద్ధ విమానం! Iran-Israel War: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.... భారతీయుడు మృతి! Iran Attack: యుద్ధరంగంలో గేమ్ చేంజర్..! ఇరాన్ ‘డ్యాన్సింగ్ మిస్సైల్’! Donald Trump: అమెరికా బలహీనత బయటపడింది..! ఇరాన్ విదేశాంగ మంత్రి సంచలన పోస్ట్! Petrol Price: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..! పాక్‌లో నింగికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు..! War Alert: కిమ్ జోంగ్ ఉన్ కొత్త ప్లాన్.. క్షిపణి ప్రయోగం వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే! H1B Visa: అమెరికాలో వీసా కుంభకోణం బట్టబయలు... 11 మంది భారతీయులు అరెస్ట్! Missile Strike: అగ్రరాజ్యానికి కోలుకోలేని దెబ్బ! ఇరాన్ దాడిలో 5 అమెరికా విమానాలు ధ్వంసం! US Iran War: ఇరాన్ క్షిపణి దాడుల ధాటికి అమెరికా బేస్‌లు ధ్వంసం..! వందలాది మంది సైనికులు మృతి? Donald Trump: చమురు ధరలు పెరిగితే అమెరికాకే లాభం..! ట్రంప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ షాక్.. ఇరాక్‌లో కూలిన నాలుగో యుద్ధ విమానం! Iran-Israel War: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.... భారతీయుడు మృతి!

USA BATA: మిల్పిటాస్‌లో తెలుగు వెలుగులు.. బాటా ఉగాది వేడుకల్లో సరికొత్త హంగులు.! వారికి ఉచిత ప్రవేశం!

USA BATA Ugadi Celebrates: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ బే ఏరియా తెలుగు సంఘం (BATA) ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మహోత్సవం 2026 వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.

Published : 2026-03-19 11:27:00
  • ప్రవాసంలో మన సంస్కృతి వైభవం: బాటా ఆధ్వర్యంలో తెలుగు వారి కొత్త ఏడాది వేడుకలు..
     
  • 25 ఏళ్ల 'యువతరంగం' సంబరం: 400 మంది బాల కళాకారుల ప్రతిభతో వెండి పండుగ..

USA BATA Ugadi Celebrates: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ బే ఏరియా తెలుగు సంఘం (BATA) ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మహోత్సవం 2026 వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో ఉన్న ఇండియా కమ్యూనిటీ సెంటర్ వేదికగా మార్చి 21వ తేదీన ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ ఏడాది వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అంజనా సౌమ్య పాల్గొని, తన అద్భుతమైన గాత్రంతో గ్రాండ్ ఫినాలే మ్యూజికల్ పెర్ఫార్మెన్స్‌ను అందించనున్నారు. దీనికి తోడుగా బాటా గర్వంగా నిర్వహించే వార్షిక యూత్ టాలెంట్ షో ‘యువతరంగం’ ఈ ఏడాదితో 25వ వసంతంలోకి అడుగుపెడుతుండటం విశేషం. ఈ వెండి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో 400 మందికి పైగా యువ కళాకారులు తమ అసాధారణ ప్రతిభను వేదికపై చాటనున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే, ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా వైవిధ్యభరితమైన షోలను నిర్వాహకులు రూపొందించారు. 90వ దశకంలోని మధురమైన డ్యాన్స్ హిట్లతో కూడిన ‘ఛలో 90’, ఉత్కంఠభరితమైన సర్వైవల్ డ్యాన్స్ షో ‘రన్ రాజా రన్’, అదిరిపోయే బీట్స్‌తో అలరించే ‘ముక్కాలా ముకాబ్లా’ వంటి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా శాస్త్రీయ నృత్యాల సమాహారం ‘ఆనంద భైరవి’ని కూడా ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా అత్యాధునిక ఎల్‌ఈడీ (LED) సెట్టింగ్స్‌తో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలు మార్చి 21వ తేదీ శనివారం నాడు ఉదయం 8 గంటల నుండే ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా సాగనున్నాయి.

మిల్పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో జరిగే ఈ ఉగాది వేడుకలకు సంబంధించి టిక్కెట్ ధరలను కూడా అందరికీ అందుబాటులో ఉంచారు. వి.ఐ.పి సీటింగ్ కోసం $25 మరియు సాధారణ ప్రవేశం కోసం $10 గా నిర్ణయించగా, 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. భక్తులు మరియు సందర్శకుల సౌకర్యార్థం ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ మహోత్సవానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు లేదా ఇతర పూర్తి వివరాల కోసం ఆసక్తి ఉన్నవారు www.bata.org వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని బాటా నిర్వాహక బృందం వెల్లడించింది. ప్రవాసంలో ఉన్నప్పటికీ మన తెలుగు పండుగను ఇంతటి ఘనంగా జరుపుకోవడం ద్వారా భావితరాలకు మన సంప్రదాయాలను వారసత్వంగా అందించవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →