USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Middle East Conflict: లెబనాన్‌తో శాంతి చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని హెచ్చరిక! Middle East War: ట్రిగ్గర్‌పైనే మా వేలు... ఇరాన్‌కు నెతన్యాహు మాస్ వార్నింగ్! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Middle East Conflict: లెబనాన్‌తో శాంతి చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని హెచ్చరిక! Middle East War: ట్రిగ్గర్‌పైనే మా వేలు... ఇరాన్‌కు నెతన్యాహు మాస్ వార్నింగ్!

Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..!

Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ఆధారంగా శాశ్వత శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. ఈ చారిత్రక భేటీకి సంబంధించిన వివరాలు..

Published : 2026-04-10 10:14:00

Middle East Peace:  ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు నేడు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికి, యుద్ధ వాతావరణాన్ని చల్లార్చడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి భేటీ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని దౌత్య వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఈ సమావేశం కోసం ఇప్పటికే అమెరికా, ఇరాన్ దేశాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు ఇస్లామాబాద్ చేరుకున్నారు. పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి తమ ప్రతినిధి బృందం రాకను అధికారికంగా ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ చర్చలు సఫలమైతే పశ్చిమ ఆసియాలో మళ్లీ ప్రశాంతత నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా తరపున ఈ కీలక చర్చలకు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తున్నారు. ఒక అగ్రరాజ్య ఉపాధ్యక్షుడే నేరుగా ఈ చర్చల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధాన్ని ఆపి, శాంతిని నెలకొల్పే విషయంలో అమెరికా ఎంత పట్టుదలగా ఉందో జేడీ వాన్స్ రాకతో స్పష్టమవుతోంది. ఆయనతో పాటు అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ముఖ్య అధికారులు కూడా ఈ బృందంలో ఉన్నారు.

ఈ చర్చల్లో ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల  ప్రణాళిక అత్యంత కీలకంగా మారనుంది. యుద్ధం ముగింపు, ఆంక్షల తొలగింపు,  సరిహద్దు భద్రత వంటి ప్రధాన అంశాలు ఈ పది పాయింట్లలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనల ఆధారంగానే ఇరు దేశాల మధ్య సుదీర్ఘమైన చర్చలు జరగనున్నాయి. ఇరాన్ ఆశిస్తున్న హామీలను అమెరికా ఎంతవరకు అంగీకరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ చర్చల ప్రభావం ఉండనుంది. ముఖ్యంగా చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాలు ఈ శాంతి చర్చల ఫలితంపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఇస్లామాబాద్ చర్చలు విజయవంతమైతే, అది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఇరు దేశాలు పాత పగలను పక్కన పెట్టి, శాంతి మార్గంలో పయనించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు.

Spotlight

Read More →