Australia: పల్నాడు పౌరుషం.. విదేశీ గడ్డపై సందడి! న్యూజిలాండ్‌లో జీవీ ఆంజనేయులకు ఘన వీడ్కోలు.. 50కి పైగా కార్లతో.. Middle East War: ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం... భారత్‍కు చేరుకున్న 345 మంది మత్స్యకారులు...! NRITDP Melbourne: మెల్బోర్న్‌లో అమరావతి సంబరాలు... చట్టబద్ధతపై ఎన్నారైల హర్షం! Iran Nuclear Facility: బుషెహర్ అణు ప్లాంట్ లక్ష్యంగా దాడి... ప్రపంచవ్యాప్తంగా హై అలర్ట్! Middle East War: ఇరాన్ దెబ్బకు కుప్పకూలిన అమెరికా 'ఈగిల్' యుద్ధ విమానం! NRI TDP: ఖండాంతరాల్లో మారుమోగిన 'జై అమరావతి' నినాదం! చట్టబద్ధతపై ఎన్ఆర్ఐల విజయ సంబరాలు! Middle East War: ఇరాన్ అదుపులో అమెరికన్ పైలట్.. యుద్ధంలో అనూహ్య మలుపు! New Zealand: అందమైన దేశం.. కానీ ఆగని వలసలు! న్యూజిలాండ్‌ను ప్రజలు ఎందుకు వదిలివెళ్తున్నారు? NewYork Shooting: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం... ఏడు నెలల పసిపాప దుర్మరణం! US Israel Iran Conflict: డాలర్ వద్దు 'రియాల్' ముద్దు... చమురు నౌకలకు ఇరాన్ భారీ టోల్ షాక్..! Australia: పల్నాడు పౌరుషం.. విదేశీ గడ్డపై సందడి! న్యూజిలాండ్‌లో జీవీ ఆంజనేయులకు ఘన వీడ్కోలు.. 50కి పైగా కార్లతో.. Middle East War: ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం... భారత్‍కు చేరుకున్న 345 మంది మత్స్యకారులు...! NRITDP Melbourne: మెల్బోర్న్‌లో అమరావతి సంబరాలు... చట్టబద్ధతపై ఎన్నారైల హర్షం! Iran Nuclear Facility: బుషెహర్ అణు ప్లాంట్ లక్ష్యంగా దాడి... ప్రపంచవ్యాప్తంగా హై అలర్ట్! Middle East War: ఇరాన్ దెబ్బకు కుప్పకూలిన అమెరికా 'ఈగిల్' యుద్ధ విమానం! NRI TDP: ఖండాంతరాల్లో మారుమోగిన 'జై అమరావతి' నినాదం! చట్టబద్ధతపై ఎన్ఆర్ఐల విజయ సంబరాలు! Middle East War: ఇరాన్ అదుపులో అమెరికన్ పైలట్.. యుద్ధంలో అనూహ్య మలుపు! New Zealand: అందమైన దేశం.. కానీ ఆగని వలసలు! న్యూజిలాండ్‌ను ప్రజలు ఎందుకు వదిలివెళ్తున్నారు? NewYork Shooting: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం... ఏడు నెలల పసిపాప దుర్మరణం! US Israel Iran Conflict: డాలర్ వద్దు 'రియాల్' ముద్దు... చమురు నౌకలకు ఇరాన్ భారీ టోల్ షాక్..!

Australia: పల్నాడు పౌరుషం.. విదేశీ గడ్డపై సందడి! న్యూజిలాండ్‌లో జీవీ ఆంజనేయులకు ఘన వీడ్కోలు.. 50కి పైగా కార్లతో..

Australia: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా క్రైస్ట్‌చర్చ్‌లో జి.వి. ఆంజనేయులు ఆయన కుటుంబ సభ్యులను ఎన్నారై వింగ్ నల్లదిమ్ము కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా వీడ్కోలు పలికారు.

Published : 2026-04-05 22:45:00
  • NRI: "మీకు ఏ కష్టమొచ్చినా నేనున్నా": న్యూజిలాండ్ ఎన్నారైలకు భరోసా ఇచ్చిన వినుకొండ ఎమ్మెల్యే..
     
  • "ఏపీలో పెట్టుబడులకు రండి.. ప్రభుత్వం అండగా ఉంటుంది": ప్రవాసాంధ్రులకు జీవీ ఆంజనేయులు పిలుపు..

Australia: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్  పర్యటనలను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా క్రైస్ట్‌చర్చ్‌లో జి.వి. ఆంజనేయులు ఆయన కుటుంబ సభ్యులను ఎన్నారై వింగ్ నల్లదిమ్ము కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా వీడ్కోలు పలికారు. విదేశీ పర్యాటనలో జీవీ తో పాటు ఆయన సతీమణి లీలావతి, కుమారుడు హరీష్, కోడలు సత్య హరీష్, మనవడు ఆర్య వీర్ పాల్గొన్నారు. వీడ్కోలుకు ముందు ఏర్పాటు చేసిన ఆత్మీయ అల్పాహార విందులో ప్రవాసాంధ్రులు నేత దంపతులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇదే వేదికపై జి.వి. ఆంజనేయులు కుమారుడు హరీష్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

అనంతరం హోటల్ నుంచి విమానాశ్రయం వరకు 50కి పైగా కార్లతో భారీ ర్యాలీ నిర్వహించిన ప్రవాసాంధ్రులు, తమ అభిమాన నేతకు ఘనమైన సెండాఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా జి.వి. ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన గురించి వివరిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ప్రవాసాంధ్రులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నారైలకు ఏ అవసరం వచ్చినా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీకాంత్ మరియు కరుణాకర్‌లకు నల్లదిమ్ము కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో తమను కలిసినందుకు పల్నాడు, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వ పాలనను ప్రశంసించారు.

Spotlight

Read More →