NRI Missing: అలాస్కాలో మిస్సింగ్ ఎన్నారై హరి... ఆచూకీ కోసం 'తానా' ముమ్మర అన్వేషణ! UAE Ramadan 2026 Updates: ప్రవాస భారతీయులకు తీపి కబురు.. రంజాన్ సందర్భంగా తగ్గిన పని గంటలు! Oman DeadCase: ఒమన్‌లో 72 రోజుల నిరీక్షణకు ముగింపు – దేశం కానీ దేశం వెళ్లిన పది రోజులకే మృత్యువాత! ఎన్నారై టిడిపి సభ్యుల చేయూత! America economic collapse: డాలర్ పతనం - రష్యా, చైనాల మాస్టర్ ప్లాన్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు.. మీపై పడే ప్రభావం ఎంత? US Pakistan Relations: పాకిస్తాన్ దుస్థితి.. అమెరికా చేతిలో ‘టాయిలెట్ పేపర్’లా మారిపోయిందా? రక్షణ మంత్రి వ్యాఖ్యల వెనుక అసలు నిజం! Indian Currency Singapore: సింగపూర్‌లో భారతీయ 100 రూపాయల విలువ ఎంత? జీవనశైలి మరియు ఆర్థిక విశేషాలు మీకోసం! Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి…! కోట్ల పరిహారం ప్రకటించిన సియాటెల్..! UAE what'sUP Updates: వాట్సాప్ వెబ్ వినియోగదారులకు అదిరిపోయే వార్త.. ఇక నేరుగా బ్రౌజర్ నుంచే వాయిస్, వీడియో కాల్స్! ట్రంప్ ‘వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్’ లిస్ట్ సంచలనం! జాబితాలో 89 మంది మన వాళ్ళే...! ఫిలిప్పీన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. సముద్రతీర నగరం బొంగావోలో బూడిదైన వెయ్యి ఇళ్లు.. NRI Missing: అలాస్కాలో మిస్సింగ్ ఎన్నారై హరి... ఆచూకీ కోసం 'తానా' ముమ్మర అన్వేషణ! UAE Ramadan 2026 Updates: ప్రవాస భారతీయులకు తీపి కబురు.. రంజాన్ సందర్భంగా తగ్గిన పని గంటలు! Oman DeadCase: ఒమన్‌లో 72 రోజుల నిరీక్షణకు ముగింపు – దేశం కానీ దేశం వెళ్లిన పది రోజులకే మృత్యువాత! ఎన్నారై టిడిపి సభ్యుల చేయూత! America economic collapse: డాలర్ పతనం - రష్యా, చైనాల మాస్టర్ ప్లాన్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు.. మీపై పడే ప్రభావం ఎంత? US Pakistan Relations: పాకిస్తాన్ దుస్థితి.. అమెరికా చేతిలో ‘టాయిలెట్ పేపర్’లా మారిపోయిందా? రక్షణ మంత్రి వ్యాఖ్యల వెనుక అసలు నిజం! Indian Currency Singapore: సింగపూర్‌లో భారతీయ 100 రూపాయల విలువ ఎంత? జీవనశైలి మరియు ఆర్థిక విశేషాలు మీకోసం! Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి…! కోట్ల పరిహారం ప్రకటించిన సియాటెల్..! UAE what'sUP Updates: వాట్సాప్ వెబ్ వినియోగదారులకు అదిరిపోయే వార్త.. ఇక నేరుగా బ్రౌజర్ నుంచే వాయిస్, వీడియో కాల్స్! ట్రంప్ ‘వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్’ లిస్ట్ సంచలనం! జాబితాలో 89 మంది మన వాళ్ళే...! ఫిలిప్పీన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. సముద్రతీర నగరం బొంగావోలో బూడిదైన వెయ్యి ఇళ్లు..

NRI Missing: అలాస్కాలో మిస్సింగ్ ఎన్నారై హరి... ఆచూకీ కోసం 'తానా' ముమ్మర అన్వేషణ!

NRI hari missing Alaska: అలాస్కాలో అదృశ్యమైన ఎన్నారై హరి ఆచూకీ కోసం 'తానా' సంస్థ చేస్తున్న కృషిని అంతర్జాతీయ కో-ఆర్డినేటర్ కృష్ణప్రసాద్ సోంపల్లి వివరించారు. వాతావరణం అనుకూలించకపోయినా అన్వేషణ కొనసాగుతోందని, విదేశాల్లో ఉండేవారు ట్రాకింగ్ టెక్నాలజీని వాడాలని ఆయన సూచించారు.

Published : 2026-02-15 17:57:00

హరి తల్లిదండ్రులకు 'తానా' భరోసా…

 అలాస్కా గడ్డపై ఆగని గాలింపు చర్యలు.

టెక్నాలజీతో ప్రాణ రక్షణ..

అలాస్కాలో అదృశ్యమైన ఎన్నారై హరి ఆచూకీ కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు చేస్తున్న అన్వేషణ వివరాలను తానా ఇంటర్నేషనల్ కో-ఆర్డినేటర్ కృష్ణప్రసాద్ సోంపల్లి హరి తల్లితండ్రులకు, బంధువులకు వివరించారు.
హ్యూస్టన్లో నివసిస్తున్న ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి డిసెంబరు 22న అలాస్కా పర్యటనకు వెళ్లి అదృశ్యమైన సంగతి తెలిసిందే. తానా అధ్యక్షుడు సరేన్ కొడాలి, అంతర్జాతీయ విద్యార్థుల సమన్వయకర్త డాక్టర్ ఉమా ఆర్.కటికి సూచన మేరకు సంతమాగులూరులో నివసిస్తున్న హరి కుటుంబాన్ని ప్రసాద్ సోంపల్లి సందర్శించారు.

హరి తల్లిదండ్రులను, అతని సన్నిహితులను కలిశారు. తానా ప్రతి సంవత్సరం అనేక కేసులను పరిష్కరిస్తోందని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సహాయం చేస్తుంటుందని చెప్పారు. కానీ ఈ కేసు ప్రత్యేకమైనది కావడంతో తాము అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్టు వివరించారు. అలాస్కాలో ముఖ్యంగా అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకు వాతావరణ పరిస్థితులు అధ్వానంగా ఉంటాయని తెలిపారు.

అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం సహాయంతో ఏపీ ప్రభుత్వం అమెరికా, అలాస్కా ప్రభుత్వానికి ఈ అన్వేషణలో సహాయపడమని సిఫార్సు లేఖలను జారీ చేసిందని చెప్పారు. విదేశాల్లో నివసిస్తున్న తమవారి కోసం, తల్లితండ్రులు, విద్యార్థులు తమ ప్రియమైన వ్యక్తిని ట్రాక్ చేయడంలో టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు, ఆపిల్ ప్రొడక్ట్ ఎయిర్ ట్యాగ్ స్పెషాలిటీ గురించి లోతుగా వివరించారు. హరి కరసాని ఆచూకీ లభించే వరకూ అలాస్కా ప్రభుత్వ కృషి ఆగదని చెప్పారు.

అమెరికాలో నివసిస్తున్న తమవారి పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో ప్రతిరోజూ మాట్లాడాలని సూచించారు. అమెరికాలో ఉండేవారు కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ భారత్లోని తమ తల్లితండ్రులతో, బంధువులతో రోజూ మాట్లాడుతూనే ఉండాలని కోరారు. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ... అమెరికాలో ఉన్నవారు ఏదైనా సలహా కావాల్సివస్తే 1-855-687-8262 లేదా 855-OUR-TANAకు కాల్ చేయాలని సూచించారు.

Spotlight

Read More →