Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం! NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళన…! డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్! Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!! Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!! Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!! Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!! TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!! Movie: విజయ్ మూవీకి ఊహించని షాక్..! ‘జన నాయగన్’పై డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం! Oscars 2026: ఆస్కార్ బరిలో తెలుగు సూపర్ హిట్స్ మూవీస్ ఇవే..!! Telugu Movies: మాజీ ప్రపంచ సుందరితో మెగాస్టార్.. ‘మెగా 158’పై ఇండస్ట్రీలో హాట్ టాక్! Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం! NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళన…! డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్! Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!! Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!! Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!! Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!! TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!! Movie: విజయ్ మూవీకి ఊహించని షాక్..! ‘జన నాయగన్’పై డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం! Oscars 2026: ఆస్కార్ బరిలో తెలుగు సూపర్ హిట్స్ మూవీస్ ఇవే..!! Telugu Movies: మాజీ ప్రపంచ సుందరితో మెగాస్టార్.. ‘మెగా 158’పై ఇండస్ట్రీలో హాట్ టాక్!

Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ డేట్ ఖరారవ్వడంతో సినీ వర్గాల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా

2026-01-18 15:17:00
Trump: ట్రంప్ ప్రకటనలపై గ్రీన్‌లాండ్ మండిపాటు..! టారిఫ్‌లకు నిరసనగా ర్యాలీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ డేట్ ఖరారవ్వడంతో సినీ వర్గాల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా ప్రకటించినట్లుగా ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. అంత దూరంగా ఉన్న మార్చి నెలనే ఎందుకు ఎంచుకున్నారు అన్నదే ఆ చర్చ. దీనికి సినిమా టీమ్ దగ్గర స్పష్టమైన వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుందని చెప్పుకోవాలి.

తెలుగుజాతి వెలుగురేఖ.. 'అన్న' ఎన్టీఆర్ 30వ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు! చరిత్ర మార్చిన సంక్షేమ పథకాలు..

మార్చి నెలే ఎందుకు కలెక్షన్లకు అనుకూలమని  భావిస్తున్నారా ?

Indigo: ఇండిగోకు భారీ షాక్... వేల విమానాలు రద్దు!

2027 మార్చి నెల క్యాలెండర్‌ను గమనిస్తే, సినిమా విడుదలకు అనువైన రోజులు వరుసగా ఉన్నాయి. మార్చి 5 శుక్రవారం సినిమా విడుదలైన వెంటనే శనివారం, ఆదివారం వీకెండ్ వస్తుంది. అంతేకాదు మార్చి 6న మహా శివరాత్రి పండుగ ఉంది. అంటే తొలి మూడు రోజుల్లోనే ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పెద్ద సినిమాకైనా ఓపెనింగ్ వీకెండ్ చాలా కీలకం. ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడమే ‘స్పిరిట్’ టీమ్ ఆలోచనగా తెలుస్తుంది.

బండ్ల గణేశ్ 'సంకల్ప యాత్ర'.. షాద్‌నగర్ గడప నుంచి శేషాచలం కొండ దాకా.. బాబు కోసం మొక్కు తీర్చుకునే వేళ!

పండుగలు, వీకెండ్‌లు వ్యూహంలో ఎలా భాగమయ్యాయి?

రాయలసీమలో వ్యవసాయానికి కొత్త దిశ.. 2 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష!!

మార్చి నెల మొత్తాన్ని పరిశీలిస్తే విడుదలైన తర్వాత కూడా కలెక్షన్లకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. రంజాన్, హోలీ, గుడ్ ఫ్రైడే వంటి పండుగలు అదే నెలలో ఉన్నాయి. వీటితో పాటు వరుస వీకెండ్‌లు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే దాదాపు 10 నుంచి 12 రోజులు సినిమా బాక్సాఫీస్ పరుగులకు అనువైన సమయం దొరుకుతుంది. ఈ గ్యాప్‌లో పెద్ద సినిమాలు లేకుండా ప్లాన్ చేసుకుంటే ‘స్పిరిట్’కు సొలో రన్ దొరికే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Sankranthi rush: సంక్రాంతి రద్దీతో TGRTCకి కాసుల వర్షం.. 5 రోజుల్లో రూ.67 కోట్ల ఆదాయం!

ఫస్ట్ లుక్ పోస్టర్ ఎందుకు అంత చర్చనీయాంశమైంది?

అమృత్ భారత్ II రైళ్లలో కొత్త రూల్స్.. ఇక ఆ కష్టాలు ఉండవు.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం!

‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. ప్రభాస్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. గాయాల గుర్తులు, రఫ్ బీర్డ్, స్టైలిష్ అటిట్యూడ్‌తో ఆయన కనిపించిన తీరు, ఈ సినిమా సాధారణ కమర్షియల్ మూవీ కాదని స్పష్టం చేస్తుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్టైల్‌కు తగ్గట్టుగానే పాత్ర ఇంటెన్స్‌గా ఉండబోతుందన్న సంకేతాలు ఈ పోస్టర్‌లో కనిపించాయి. ఇదే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని మరింత పెంచుతుందని చెప్పుకోవాలి.

USA Updates: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్.. 1 బిలియన్ డాలర్ల ఫీజు నిజమేనా? వైట్ హౌస్ క్లారిటీ!

హీరోయిన్ మార్పు సినిమాపై ప్రభావం చూపుతుందా?

Milk Side Effects: పాలలో ఉండే పోషకాలు... ఎముకల బలానికి కాల్షియం మరియు ప్రోటీన్! కానీ....

ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత దీపికా పదుకొణె పేరు వినిపించినా, చివరకు త్రిప్తి దిమ్రికి అవకాశం దక్కింది. ‘యానిమల్’ సినిమాతో సందీప్ రెడ్డి వంగా శైలిని అర్థం చేసుకున్న త్రిప్తి, ఈ పాత్రకు సూటబుల్ అని దర్శకుడు భావించినట్లు సమాచారం. కొత్త కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.

Temple: 310 ఏళ్ల క్రితం బావిలో వెలిసిన దేవుడు..! లక్ష్మి మాధవరాయ స్వామి అద్భుత గాథ!

ఎనిమిది భాషల్లో రిలీజ్ అంటే ఏ స్థాయి టార్గెట్?

‘స్పిరిట్’ను ఎనిమిది భాషల్లో విడుదల చేయడం ఈ సినిమాపై నిర్మాతల విశ్వాసాన్ని చూపిస్తోంది. కేవలం భారత మార్కెట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామా కలబోసిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో కీలక మలుపుగా మారుతుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి.

Spotlight

Read More →