Healthcare Systems: అమెరికా కంటే భారత్ లోనే వైద్యం మేలు! చార్లీ ఎవాన్స్ ప్రశంసలు! Healthy Food: ఇవి రోజు తింటే బీపీ, షుగర్ సమస్యలు మీ దరిచేరవు! Health Tips: రోజుకు ఒక చిన్న ముక్క తింటే డాక్టర్ అవసరం ఉండదట! Dehydration: వేసవిలో డిహైడ్రేషన్ ముప్పు! లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! Green Tea Vs Black Tea: గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ! ఎవరికి ఏది మంచిది..! Guava Leaves: జామ ఆకులతో అద్భుత ప్రయోజనాలు! ఆయుర్వేదం చెప్పే రహస్యాలివే! Curd Benefits: వేసవిలో రాత్రి పూట పెరుగు తింటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు! Amla Powder: రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో ఉసిరి పొడి కలిపి తాగండి.. ఆరోగ్యానికి అద్భుత ఫలితాలు! Diabetes Tips: షుగర్ పేషెంట్లు బంగాళదుంపలు తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజం! Healthcare Systems: అమెరికా కంటే భారత్ లోనే వైద్యం మేలు! చార్లీ ఎవాన్స్ ప్రశంసలు! Healthy Food: ఇవి రోజు తింటే బీపీ, షుగర్ సమస్యలు మీ దరిచేరవు! Health Tips: రోజుకు ఒక చిన్న ముక్క తింటే డాక్టర్ అవసరం ఉండదట! Dehydration: వేసవిలో డిహైడ్రేషన్ ముప్పు! లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు! CT Vs MRI Scan: సిటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే! Green Tea Vs Black Tea: గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ టీ! ఎవరికి ఏది మంచిది..! Guava Leaves: జామ ఆకులతో అద్భుత ప్రయోజనాలు! ఆయుర్వేదం చెప్పే రహస్యాలివే! Curd Benefits: వేసవిలో రాత్రి పూట పెరుగు తింటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు! Amla Powder: రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో ఉసిరి పొడి కలిపి తాగండి.. ఆరోగ్యానికి అద్భుత ఫలితాలు! Diabetes Tips: షుగర్ పేషెంట్లు బంగాళదుంపలు తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజం!

Bipolar Disorder Symptoms: ఏది ఆనందమో.. ఏది విచారమో తెలియని స్థితి..బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి? ఎందుకు గుర్తించడం కష్టం?

Selena Gomez Mental Health: హాలీవుడ్ స్టార్ సెలీనా గోమెజ్ తన బైపోలార్ డిజార్డర్ ప్రయాణాన్ని పంచుకున్నారు. సరైన రోగ నిర్ధారణ జరగక ముందు తాను పడిన ఇబ్బందులు, నాలుగు సార్లు రీహాబ్‌కు వెళ్లడం ఈ వ్యాధి లక్షణాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు..

Published : 2026-03-07 15:14:00

Selena Gomez Mental Health: ప్రముఖ హాలీవుడ్ గాయని, నటి సెలీనా గోమెజ్ తన మానసిక స్థితిపై మరోసారి మనసు విప్పారు. తాజాగా తన భర్త బెన్నీ బ్లాంకో నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె పాల్గొని, తను అనుభవించిన  వివరించారు. ముఖ్యంగా 'బైపోలార్ డిజార్డర్' అనే మానసిక సమస్యను గుర్తించడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన వ్యాధిని సరిగ్గా నిర్ధారించడానికి ముందు ఎంతోమంది డాక్టర్లు తప్పుగా అర్థం చేసుకున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.

సెలీనా మాట్లాడుతూ.. తన ప్రవర్తనలో ఏదో తేడా ఉందని తనకు ముందే తెలుసని, కానీ సరైన కారణం ఎవరూ చెప్పలేకపోయారని అన్నారు. "నేను ఎంతో మంది థెరపిస్టుల దగ్గరకు వెళ్లాను. నాలుగు సార్లు రీహాబిలిటేషన్ సెంటర్లలో కూడా ఉన్నాను. ఇదంతా చాలా గందరగోళంగా ఉండేది" అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన భర్త బెన్నీ బ్లాంకో ఇస్తున్న మద్దతు వల్ల తాను కోలుకుంటున్నానని, తన మూడ్ స్వింగ్స్ వచ్చే ముందే ఇప్పుడు తాను గుర్తించగలుగుతున్నానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

అసలు ఈ బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటంటే.. ఇది మనిషిని తీవ్రమైన మానసిక ఒడుదుడుకులకు గురిచేస్తుంది. ఒక దశలో మనిషి విపరీతమైన ఆనందంతో, ఉత్సాహంతో ఊగిపోతాడు మరికొద్ది సేపటికే తీవ్రమైన నిరాశలోకి, బాధలోకి వెళ్లిపోతాడు  ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.7 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం మూడ్ మారడం మాత్రమే కాదు, దీనివల్ల నిద్ర, ఆలోచనా తీరు  ప్రవర్తన పూర్తిగా మారిపోతాయి.

ఈ వ్యాధిని గుర్తించడం ఎందుకు కష్టమంటే.. దీని లక్షణాలు ఇతర మానసిక సమస్యలను పోలి ఉంటాయి. చాలామంది కేవలం తాము బాధగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరకు వెళ్తారు, అప్పుడు డాక్టర్లు అది కేవలం సాధారణ డిప్రెషన్ అని అనుకుంటారు. వారు అత్యంత ఉత్సాహంగా ఉన్న సమయాలను  రిపోర్ట్ చేయకపోవడం వల్ల వ్యాధిని సరిగ్గా పట్టుకోవడం కష్టమవుతుంది. సెలీనా విషయంలో కూడా ఇదే జరిగింది. సరైన రోగ నిర్ధారణ జరగడానికి సగటున 5 నుండి 10 ఏళ్లు పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం సెలీనా గోమెజ్ తన మానసిక స్థితిపై పూర్తి అవగాహనతో ఉన్నారు. ఒక భాగస్వామి మన పరిస్థితిని అర్థం చేసుకుని తోడుగా నిలబడితే ఇలాంటి సమస్యల నుండి త్వరగా బయటపడొచ్చని ఆమె సూచించారు. సెలబ్రిటీలు ఇలా బహిరంగంగా మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం వల్ల సమాజంలో దీనిపై ఉన్న భయాలు, అపోహలు తొలగిపోతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైన ఉన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే మీ వైద్య నిపుణులను సంప్రదించాలి.

Spotlight

Read More →