Samsung Galaxy: శాంసంగ్ కీలక నిర్ణయం.. ఆ పాపులర్ ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ బంద్! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! Second vehicle: సెకండ్ వెహికల్ కొనుగోలుదారులకు శుభవార్త.. త్వరలో కొత్త ఉత్తర్వులు! Upma recipe: పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే ఫంక్షన్ స్టైల్.. ఉప్మా రెసిపీ! Rare Earth Minerals: ఆ ప్రాంతాల వారికి గుడ్ న్యూస్.. ఖరీదైన రేర్ ఎర్త్ నిక్షేపాలు..!! TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! Benefits walking for brain: నడకతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న అసలు నిజాలివే..!! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! Crypto investors: క్రిప్టో ఇన్వెస్టర్లకు షాక్.. రోజురోజుకూ దిగజారుతున్న బిట్కాయిన్ విలువ! Samsung Galaxy: శాంసంగ్ కీలక నిర్ణయం.. ఆ పాపులర్ ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ బంద్! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! Second vehicle: సెకండ్ వెహికల్ కొనుగోలుదారులకు శుభవార్త.. త్వరలో కొత్త ఉత్తర్వులు! Upma recipe: పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే ఫంక్షన్ స్టైల్.. ఉప్మా రెసిపీ! Rare Earth Minerals: ఆ ప్రాంతాల వారికి గుడ్ న్యూస్.. ఖరీదైన రేర్ ఎర్త్ నిక్షేపాలు..!! TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! Benefits walking for brain: నడకతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న అసలు నిజాలివే..!! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! Crypto investors: క్రిప్టో ఇన్వెస్టర్లకు షాక్.. రోజురోజుకూ దిగజారుతున్న బిట్కాయిన్ విలువ!

Lottery Success: ఒక్క ఫోన్ కాల్‌తో మారిన తలరాత.. సామాన్య ఉద్యోగి నుంచి మల్టీ మిలియనీర్‌గా శంతను.!!

దుబాయ్ బిగ్ టికెట్ లాటరీలో కర్ణాటకకు చెందిన శంతను శెట్టిగార్ రూ. 49 కోట్ల జాక్‌పాట్ గెలుచుకున్నారు. స్నేహితుడితో కలిసి కొన్న టికెట్ అతన్ని ఎలా కోటీశ్వరుడిని చేసిందో తెలుసుకోండి

Published : 2026-02-06 10:16:00

అదృష్టం తలుపు తడితే ఎలా ఉంటుందో కర్ణాటకకు చెందిన శంతను శెట్టిగార్ జీవితమే ఒక నిదర్శనం. రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య ప్రవాస భారతీయుడిని అదృష్ట దేవత వరించింది. అబుదాబిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రాలో శంతను ఏకంగా 20 మిలియన్ దిర్హామ్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ. 49 కోట్లు) గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయారు. ఎడారి దేశంలో ఉపాధి కోసం కష్టపడుతున్న ఒక సామాన్యుడి జీవితం ఒక్క ఫోన్ కాల్‌తో ఊహించని మలుపు తిరిగింది.

ఉడుపి నుంచి ఒమన్ వరకు.. సామాన్యుడి ప్రయాణం

కర్ణాటకలోని ఉడుపి జిల్లా ఉద్యావరు గ్రామానికి చెందిన శంతను శెట్టిగార్, గత కొన్నేళ్లుగా ఒమన్‌లోని ఒక రిటైల్ రంగంలో సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం ఉన్న శంతను, తన కుటుంబానికి మెరుగైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడ పని చేస్తూనే అప్పుడప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీ టికెట్లు కొనేవారు. ఈ క్రమంలోనే అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 283లో భాగంగా 305810 నంబర్ గల టికెట్‌ను కొనుగోలు చేశారు.

లైవ్ డ్రాలో వెల్లడైన విజేత పేరు

బుధవారం సాయంత్రం జరిగిన లైవ్ డ్రా వేడుకలో నిర్వాహకులు శంతను పేరును గ్రాండ్ ప్రైజ్ విజేతగా ప్రకటించారు. వేలాది మంది ప్రజలు ఉత్కంఠగా వీక్షిస్తున్న సమయంలో నిర్వాహకులు నేరుగా శంతనుకు ఫోన్ చేసి ఈ శుభవార్తను అందించారు. మొదట ఆ వార్తను ఆయన నమ్మలేకపోయారు. అది ప్రాంక్ కాల్ ఏమోనని భావించిన శంతను, విషయం పూర్తిగా తెలుసుకున్నాక ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఒక్క క్షణం ఆయన కళ్ల ముందు తన పాత జీవితం, పడిన కష్టాలు కదలాడాయి అని తెలిపారు.

 సగం వాటా స్నేహితుడికే!

ఈ భారీ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన కోణం ఉంది. శంతను ఈ టికెట్‌ను ఒక్కరే కొనుగోలు చేయలేదు. తన స్నేహితుడితో కలిసి ఖర్చును పంచుకుని ఈ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్నప్పటికీ, శంతను తన ప్రాణ స్నేహితుడిని మర్చిపోలేదు. ఈ విజయం మా ఇద్దరిది. నిబంధనల ప్రకారం మరియు నైతికంగా ఈ నగదు బహుమతిలో సగం వాటాను నా స్నేహితుడికి అందిస్తాను అని ఆయన ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోట్లు వచ్చినా తన నిజాయితీని పక్కన పెట్టకపోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

భవిష్యత్తు ప్రణాళికలు

రూ. 49 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంత పెద్ద మొత్తంతో ఏం చేయాలనే దానిపై శంతను ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి ఈ విజయోత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. కుటుంబ సభ్యులతో చర్చించి, భవిష్యత్తులో ఈ డబ్బును ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకుంటాను అని ఆయన మీడియాకు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఇలాంటి భారీ బహుమతులు గెలుచుకోవడం ఇదే మొదటిసారి కాదు కానీ శంతను కథ మాత్రం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరూ ఊహించలేరని ఈ ఘటన మరోసారి నిరూపించింది

Spotlight

Read More →