సంక్రాంతి బరుల్లో కోడిపందాల హోరు.. ఆ జిల్లాల్లో రాజకీయ నేతల సందడి.. పందెం కోళ్లతో.. Brahmamgari path: నాలుగేళ్ల వివాదానికి తెర.. బ్రహ్మంగారి మఠం పీఠంపై వెంకటాద్రి స్వామి TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ మధ్య ఆ సమస్యకు చెక్… క్యూఆర్ కోడ్ సదుపాయం అమలు!! ఈ రోజు జరిగే ఆ సంప్రదాయం ఎందుకు తరతరాలుగా కొనసాగుతోంది! Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై ‘డిజిటల్’ శకం.. ఇక టిక్కెట్ల కోసం క్యూలు లేవు, దర్శనం సులభం! Sankranti Festival 2026: సంక్రాంతి గాలిపటాల వెనుక ఉన్న రహస్యం ఇదే..!! ఆంధ్రప్రదేశ్ లో కలకలం - ఆ ఆలయంలో భారీ చోరీ! ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం.. TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!! Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు! Somnath temple: భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని.. సోమనాథ్ దర్శనంతో! సంక్రాంతి బరుల్లో కోడిపందాల హోరు.. ఆ జిల్లాల్లో రాజకీయ నేతల సందడి.. పందెం కోళ్లతో.. Brahmamgari path: నాలుగేళ్ల వివాదానికి తెర.. బ్రహ్మంగారి మఠం పీఠంపై వెంకటాద్రి స్వామి TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ మధ్య ఆ సమస్యకు చెక్… క్యూఆర్ కోడ్ సదుపాయం అమలు!! ఈ రోజు జరిగే ఆ సంప్రదాయం ఎందుకు తరతరాలుగా కొనసాగుతోంది! Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై ‘డిజిటల్’ శకం.. ఇక టిక్కెట్ల కోసం క్యూలు లేవు, దర్శనం సులభం! Sankranti Festival 2026: సంక్రాంతి గాలిపటాల వెనుక ఉన్న రహస్యం ఇదే..!! ఆంధ్రప్రదేశ్ లో కలకలం - ఆ ఆలయంలో భారీ చోరీ! ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం.. TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!! Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు! Somnath temple: భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని.. సోమనాథ్ దర్శనంతో!

ఈ రోజు జరిగే ఆ సంప్రదాయం ఎందుకు తరతరాలుగా కొనసాగుతోంది!

2026-01-14 07:00:00

సంక్రాంతి పండుగకు ఆరంభంగా జరుపుకునే భోగి పండుగ తెలుగు ప్రజల సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి ముందు రోజు అయిన భోగి పండుగను, పాతదాన్ని విడిచిపెట్టి కొత్త జీవనానికి స్వాగతం పలికే ప్రతీకగా భావిస్తారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఆశలు, ఆకాంక్షలతో నూతన ఆరంభానికి సంకేతంగా ఈ పండుగను జరుపుకుంటారు.

భోగి పండుగకు ప్రధాన ఆకర్షణ భోగి మంటలుమరియు బోగీ పండ్లు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెల్లవారుజామున గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా భోగి మంటలు వెలిగిస్తారు. పాత పనికిరాని వస్తువులను అగ్నికి ఆహుతి చేయడం ద్వారా పాత అలవాట్లు, బాధలు, నిరాశలను దూరం చేసుకుని, శుభ్రమైన ఆలోచనలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది. పెద్దలు, పిల్లలు కలిసి మంటల చుట్టూ తిరుగుతూ శుభాకాంక్షలు చెప్పుకోవడం సంప్రదాయం. అలాగే చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు. పిల్లల ఆయురారోగ్యాల కోసం ఇలా చేస్తారని అందరూ నమ్ముతారు.

భోగి సందర్భంగా ఇళ్లను శుభ్రం చేసి, ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను అలంకరించడం మరో విశేషం. మహిళలు ప్రత్యేకంగా గొబ్బెమ్మలతో ఇంటి ముందు ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేస్తారు. రైతులకు ఇది పంటలు చేతికొచ్చిన ఆనందాన్ని పంచుకునే పండుగగా కూడా నిలుస్తుంది. కొత్త బియ్యం, చెరకు, నువ్వులతో చేసిన వంటకాలు భోగి నాడు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భోగి విభిన్న పేర్లతో, విధానాలతో జరుపుకుంటారు. తమిళనాడులో దీనిని భోగి పొంగల్‌గా పిలుస్తూ, ఇళ్ల ముందు మంటలు వేసి పాత వస్తువులను తొలగిస్తారు. కర్ణాటకలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా భోగిని జరుపుకుంటారు. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో లోహ్రీ పండుగగా దీనిని నిర్వహిస్తారు. ప్రతి ప్రాంతంలో విధానం మారినా, పాతదాన్ని వదిలి కొత్తదాన్ని ఆహ్వానించాలనే భావన మాత్రం ఒకటే.

భోగి పండుగ మనకు శుభ్రత, ఐక్యత, ఆశావాదాన్ని నేర్పుతుంది. కుటుంబ సభ్యులు, పొరుగువారు కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకోవడం ద్వారా సామాజిక బంధాలు మరింత బలపడతాయి. వ్యవసాయం, ప్రకృతి, సంప్రదాయాల పట్ల మనకు ఉన్న కృతజ్ఞతను గుర్తు చేస్తూ, భోగి తెలుగు సంస్కృతిలో ఆనందం, ఆత్మీయత నింపే పండుగగా నిలుస్తోంది.

మీకూ మీ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రవాసి తరపున భోగి పండుగ శుభాకాంక్షలు.

Spotlight

Read More →