Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! TTD: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆర్జిత సేవలపై మార్పులు! Srikalahasti: శ్రీకాళహస్తి భక్తులకు తీపి కబురు... ఇకపై రూ.100లకే సామూహిక రాహు కేతు పూజలు! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! TTD: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆర్జిత సేవలపై మార్పులు! Srikalahasti: శ్రీకాళహస్తి భక్తులకు తీపి కబురు... ఇకపై రూ.100లకే సామూహిక రాహు కేతు పూజలు! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....!

Bamva Temple: ఆ గుడిని నిజంగా దయ్యాలే కట్టాయా? 600 ఏళ్ల నాటి మిస్టరీ వెనుక అసలు నిజం ఏంటి?

Bamva Temple History: ఈ ఆలయంలో ఈశ్వర స్వామి (సుందరేశ్వర స్వామి) కొలువై ఉన్నారు. ఈ గుడి నిర్మాణం చూస్తే చాలా వింతగా ఉంటుంది. పాతకాలపు రాతి కట్టడాలు, పక్కనే ఉన్న పురాతన కోనేరు చూస్తుంటే ఏదో తెలియని రహస్యం దాగి ఉన్నట్లు అనిపిస్తుంది.

Published : 2026-02-25 09:29:00

బెంగళూరు సమీపంలోని 'బమ్వ' గుడి గుట్టు…

ఒక్క రాత్రిలో వెలిసిన భారీ శివాలయం..

బెంగళూరు పర్యాటకులకు హాట్ టాపిక్…

మన దేశంలో ఎన్నో వింతలు, విశేషాలు. కొన్ని నమ్మశక్యంగా ఉంటే, మరికొన్ని వింటే ఒళ్లు గగుర్పొడుస్తాయి. తాజాగా బెంగళూరు సమీపంలోని 'బమ్వ' (Bamva) అనే గ్రామంలో ఉన్న ఒక పురాతన శివాలయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ గుడిని మనుషులు కాదు, దయ్యాలు కట్టాయని అక్కడి స్థానిక ప్రజలు నమ్ముతుండటం విశేషం. ఇంతకీ ఆ 'దయ్యాలు కట్టిన గుడి' కథేంటి? అందులో నిజమెంత?

స్థానిక కథనాల ప్రకారం.. సుమారు 600 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో దయ్యాల సంచారం విపరీతంగా ఉండేదట. చీకటి పడితే చాలు, ఊరి ప్రజలు బయటకు రావడానికి గజగజ వణికిపోయేవారు. రాత్రి పూట వింత వింత శబ్దాలు, అరుపులతో ఆ గ్రామం ఒక నరకంలా ఉండేది. పని చేసుకుందామన్నా, పొలాలకు వెళ్దామన్నా దయ్యాల భయంతో ప్రజలు ఇబ్బందులు  పడేవారట.

అయితే అదే గ్రామంలో 'బుచ్చన్న' అనే శివ భక్తుడు ఉండేవారు. ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన ఆయన, ఆ గ్రామంలో ఒక శివాలయాన్ని నిర్మించి, శివుడిని ప్రతిష్ఠిస్తే ఈ దయ్యాల పీడ వదులుతుందని నమ్మారు. గ్రామస్తులందరినీ ఒప్పించి గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న దయ్యాలకు విపరీతమైన కోపం వచ్చింది. తాము ఉండాల్సిన చోట దేవుడి గుడి ఏంటని అవి రగిలిపోయాయి.

బుచ్చన్న తన తాంత్రిక విద్యల ద్వారా ఆ దయ్యాలను బంధించి, వాటికి ఒక సవాలు విసిరారు. "మీరు ఈ ఊరి నుంచి వెళ్లిపోవాలంటే, ఒక్క రాత్రిలో ఈ శివాలయాన్ని పూర్తి చేయాలి. అలా చేస్తేనే మీకు విముక్తి" అని కండిషన్ పెట్టారు. దీంతో వేరే దారి లేక, ఆ దయ్యాలన్నీ కలిసి ఒక్క రాత్రిలోనే ఆ భారీ ఆలయాన్ని నిర్మించాయట. తెల్లవారేసరికి గుడి సిద్ధం కావడంతో, ఆ దయ్యాలు అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోయాయని గ్రామస్తులు చెప్పుకుంటారు.

ఈ ఆలయంలో ఈశ్వర స్వామి (సుందరేశ్వర స్వామి) కొలువై ఉన్నారు. ఈ గుడి నిర్మాణం చూస్తే చాలా వింతగా ఉంటుంది. పాతకాలపు రాతి కట్టడాలు, పక్కనే ఉన్న పురాతన కోనేరు చూస్తుంటే ఏదో తెలియని రహస్యం దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. నేటికీ చాలా మంది పర్యాటకులు, భక్తులు ఈ 'దయ్యాలు కట్టిన గుడి'ని చూడటానికి వస్తుంటారు.

సైన్స్ పరంగా దయ్యాలు గుడి కట్టడం అనేది నమ్మశక్యంగా లేకపోయినా, తరతరాలుగా వస్తున్న ఈ జానపద కథలు, ఆ ప్రాంత చరిత్రను విడదీయలేని భాగంగా మార్చాయి. మీరు కూడా ఇలాంటి వింత ప్రదేశాలను సందర్శించాలనుకుంటే బెంగళూరు సమీపంలోని ఈ గ్రామాన్ని ఒకసారి విజిట్ చేయండి.

Spotlight

Read More →