Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! Tirumala: ఉదయం 8:30 గంటల నుంచే శ్రీవారి దర్శనాలు నిలిపివేత! Hiranyakasipu plan: హిరణ్యకశిపుని పన్నాగం.. అగ్నికీలల్లో హోలిక దహనం! ఆ రాత్రి ఏం జరిగింది? Tirumala: గ్రహణం వేళ తిరుమలలో కీలక నిర్ణయం...! బ్రేక్ దర్శనాలు, సేవలు రద్దు! Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...! తిరుమలలో కొత్తగా హైటెక్ అన్నప్రసాద భవనం! TTD: టీటీడీ బోర్డు మీటింగ్‌లో కీలక నిర్ణయం! 5400 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు! Srisailam: శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు అలర్ట్! ఆ రోజు ఆలయం మూసివేత... దర్శనాలు రద్దు! Andhrapradesh: కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశం! కీలక అంశాలు... Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు సేవలు ప్రారంభం! రూట్లు, టైమింగ్స్ పూర్తి వివరాలు! Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!! Tirumala: ఉదయం 8:30 గంటల నుంచే శ్రీవారి దర్శనాలు నిలిపివేత! Hiranyakasipu plan: హిరణ్యకశిపుని పన్నాగం.. అగ్నికీలల్లో హోలిక దహనం! ఆ రాత్రి ఏం జరిగింది? Tirumala: గ్రహణం వేళ తిరుమలలో కీలక నిర్ణయం...! బ్రేక్ దర్శనాలు, సేవలు రద్దు! Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...! తిరుమలలో కొత్తగా హైటెక్ అన్నప్రసాద భవనం! TTD: టీటీడీ బోర్డు మీటింగ్‌లో కీలక నిర్ణయం! 5400 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు! Srisailam: శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు అలర్ట్! ఆ రోజు ఆలయం మూసివేత... దర్శనాలు రద్దు! Andhrapradesh: కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశం! కీలక అంశాలు... Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు సేవలు ప్రారంభం! రూట్లు, టైమింగ్స్ పూర్తి వివరాలు!

MangalagiriBrahmotsavam: వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి నారా లోకేష్ దంపతులు!

MangalagiriNarasimhaSwamy: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు..

Published : 2026-03-03 09:10:00

ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ

కనుల పండువగా కళ్యాణ వేడుక

పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు

MangalagiriNarasimhaSwamy:  ప్రముఖ పుణ్యక్షేత్రం మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లోనే అత్యంత ప్రధాన ఘట్టమైన స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి వేళ భక్తుల జయజయధ్వానాల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణి గారితో కలిసి పాల్గొన్నారు.

దేవస్థాన ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ వేడుకకు మంత్రి దంపతులు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున స్వామి వారికి, అమ్మవారికి పట్టువస్త్రాలను నారా లోకేష్ దంపతులు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు  స్థానిక నాయకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో వారికి ఆశీర్వచనాలు అందించారు.

సోమవారం రాత్రి 12 గంటల శుభ ముహూర్తాన వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య స్వామి వారి కళ్యాణం ప్రారంభమైంది. రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై లక్ష్మీనరసింహస్వామి వారిని చూసి భక్తులు పులకించిపోయారు. లోకేష్, బ్రాహ్మణి దంపతులు కళ్యాణాన్ని పూర్తిస్థాయిలో తిలకించి, స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా వారు మొక్కుకున్నారు.

స్వామి వారి కళ్యాణాన్ని కళ్ళారా చూడాలని మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ 'గోవిందా.. నరసింహ' నామస్మరణతో మారుమోగిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ల దగ్గర వలంటీర్లు సేవలందించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంత్రి దంపతులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పద్మశాలీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి  స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామి వారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ బ్రహ్మోత్సవాల వల్ల మంగళగిరి పట్టణం మొత్తం ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. 

Spotlight

Read More →