ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కొత్త సినిమా గ్లోబ్‌ట్రాటర్’ (తాత్కాలిక పేరు) పై మరో పెద్ద అప్‌డేట్ వచ్చింది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ అధికారికంగా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ధృవీకరించారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో డెడ్‌లైన్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ప్రియాంక, ఇది నిజం అని ప్రకటించారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఈ చిత్రం ప్రస్తుతం అమెరికా డిస్ట్రిబ్యూషన్ కోసం చర్చల్లో ఉందని సమాచారం. అంతకుముందు, నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను రాజమౌళి విడుదల చేశారు. కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో పృథ్విరాజ్ కనిపిస్తున్నారు. బ్లాక్ సూట్‌లో, వీల్‌చెయిర్‌లో కూర్చున్న అతని చుట్టూ నాలుగు రోబోటిక్ చేతులు కనిపించే ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజమౌళి ఆ పోస్టర్‌ను పంచుకుంటూ పృథ్విరాజ్‌తో మొదటి షాట్ తీసిన వెంటనే చెప్పాను నువ్వు నేను చూసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు ఈ పాత్రలో అతడు చూపిన నిష్ఠ, క్రూరత్వం, శక్తి అద్భుతంగా ఉన్నాయి అని రాశారు.
ప్రియాంక, మహేశ్ ఇద్దరూ ఆ పోస్టర్‌ను తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ప్రియాంక ఇటీవల భారతదేశానికి తిరిగి వచ్చినట్టు తెలిసింది. గ్లోబ్‌ట్రాటర్ షూటింగ్‌లో ఆమె పాల్గొనబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి.
మహేశ్ బాబు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. నవంబర్ 2025లో ఈ విజన్‌ను మీతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నాను. Globetrotter అని రాశారు.
సినిమా కథ, మిగతా తారాగణంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే రాజమౌళి, మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా అనే అద్భుత కాంబినేషన్ కారణంగా గ్లోబ్‌ట్రాటర్ ఇప్పటికే పాన్-వరల్డ్ లెవెల్‌లో భారీ అంచనాలు సృష్టించింది.
చిత్ర పరిశ్రమ వర్గాల ప్రకారం, ఇది యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో సైన్స్‌ఫిక్షన్ టచ్‌తో తెరకెక్కనుందన్న ప్రచారం నడుస్తోంది. పృథ్విరాజ్ ప్రతినాయకుడిగా కనిపించనుండటంతో ఈ చిత్రానికి తగిన హాలీవుడ్ లెవెల్ విజువల్ ట్రీట్మెంట్ ఉండబోతోందని సమాచారం.
రాజమౌళి గతంలో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలతో ప్రపంచానికి భారత సినిమా శక్తిని చూపించగా, ఈసారి గ్లోబ్‌ట్రాటర్ ద్వారా గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, ఆమె ఈ ప్రాజెక్టులో భాగమవడం చిత్రానికి అంతర్జాతీయ రేంజ్ ఇస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
చిత్రబృందం త్వరలో మహేశ్ బాబు–ప్రియాంక ఫస్ట్ లుక్ విడుదల చేయబోతోందని సమాచారం. అభిమానులు మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో #Globetrotter ట్రెండ్ చేస్తూ, ఈ కలయికపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.