Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Bhogapuram Airport: ఏపీలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... Chandrababu: దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర వెలకట్టలేనిది.. 47 ఏళ్ల ప్రస్థానంపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు.! Indo Pak Border: పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.... అసలేం జరుగుతోంది! Trump Comments: ట్రంప్ వ్యాఖ్యలతో పెరగనున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! ఇరాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు! pawan kalyan: "తమిళనాడులో జనసేనాని గర్జన": నేడు నాగర్‌కోయిల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్. Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Sharwanand: రాజశేఖర్ గారిపై నాకు జెలసీ.. జీవిత గారు ఆయన్ని చూసుకునే విధానంపై శర్వానంద్ కామెంట్స్! Iran War: "ప్రపంచ రికార్డు సృష్టించిన డిజిటల్ చీకటి": ఇరాన్‌లో 37 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్‌డౌన్! Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Bhogapuram Airport: ఏపీలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... Chandrababu: దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర వెలకట్టలేనిది.. 47 ఏళ్ల ప్రస్థానంపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు.! Indo Pak Border: పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.... అసలేం జరుగుతోంది! Trump Comments: ట్రంప్ వ్యాఖ్యలతో పెరగనున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! ఇరాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు! pawan kalyan: "తమిళనాడులో జనసేనాని గర్జన": నేడు నాగర్‌కోయిల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్. Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Sharwanand: రాజశేఖర్ గారిపై నాకు జెలసీ.. జీవిత గారు ఆయన్ని చూసుకునే విధానంపై శర్వానంద్ కామెంట్స్! Iran War: "ప్రపంచ రికార్డు సృష్టించిన డిజిటల్ చీకటి": ఇరాన్‌లో 37 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్‌డౌన్!

Amaravathi Works: అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం..!!

Minister Narayana about Amaravati works: రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, గడువులోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంపై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు.

Published : 2026-03-02 10:26:00

నేలపాడులో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీ…

పనిచేయడం చేతకాకపోతే తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోండి…

అమరావతి పనుల్లో జాప్యంపై మంత్రి సీరియస్…

Minister Narayana about Amaravati works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వం తన దూకుడును పెంచింది. గత కొంతకాలంగా పనులు నత్తనడకన సాగుతుండటంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజధాని ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి, నేలపాడులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు సంస్థల నిర్లక్ష్య వైఖరిపై ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, గడువులోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంపై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నేలపాడు ప్రాంతంలో జరుగుతున్న భవన నిర్మాణాల వద్ద కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటం, యంత్రాల వినియోగం సరిగ్గా లేకపోవడాన్ని ఆయన గమనించారు. "కోట్లాది రూపాయల నిధులు కేటాయించినా, పనులు ఎందుకు వేగవంతం కావడం లేదు? అని నిర్మాణ సంస్థల ప్రతినిధులను నిలదీశారు.

పనుల జాప్యంపై సమాధానం చెప్పలేక తడబడిన కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువుల ప్రకారం పనులు జరగాలి. పని చేయడం చేతకాకపోతే తట్టాబుట్టా సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సదరు నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను తక్షణమే ప్రాజెక్టు నుంచి పంపించేయాలని అక్కడి అధికారులను ఆదేశించారు.

కేవలం హెచ్చరికలతోనే ఆగకుండా, పనుల జాప్యానికి గల కారణాలపై సదరు సంస్థ యాజమాన్యం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సంజాయిషీ ఇచ్చుకోవాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరిస్తే సహించేది లేదు. వెంటనే మీ సంస్థ యాజమాన్యం సీఎంతో మాట్లాడి, జాప్యంపై వివరణ ఇవ్వాలి అని ఆదేశించారు.

రాజధాని పనుల్లో ఇకపై ఎలాంటి జాప్యం జరిగినా కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే కాంట్రాక్టులను రద్దు చేసి కొత్త సంస్థలకు అప్పగించేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Spotlight

Read More →