వందేభారత్ స్లీపర్ రైలుపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్న వేళ ట్రయల్ రన్‌లో చోటుచేసుకున్న ఒక సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న రైలులో టేబుల్‌పై ఉంచిన నీటి గ్లాసులు ఏమాత్రం కదలకపోవడం ప్రజల్లో ఆశ్చర్యాన్ని రేపింది.
ఈ వీడియో బయటకు రావడంతో వందేభారత్ స్లీపర్ రైళ్ల నిర్మాణం, సాంకేతికత, స్థిరత్వం గురించి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యానికే కాకుండా వేగం, భద్రత విషయంలో కూడా ఈ కొత్త రైలు ఎలా మార్పు తేవబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది.
దేశంలో ఇప్పటికే అనేక రూట్లలో సేవలందిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటివరకు ఇవి ప్రధానంగా చెయిర్‌కార్ కోచ్‌లతో నడుస్తుండగా ఇప్పుడు ప్రయాణికుల అనుకూలంగా రాత్రి ప్రయాణాల కోసం ప్రత్యేకంగా స్లీపర్ వెర్షన్‌ను తయారు చేస్తున్నారు.
ఈ స్లీపర్ రైలు ట్రయల్స్ పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని రోహల్థూర్ద్–కోట మధ్య జరుగుతున్నాయి. రైలు స్థిరత్వం, వేగం, బ్రేకింగ్ సిస్టమ్, ప్రయాణ అనుభవం – అన్నింటినీ పలు దశల్లో పరీక్షిస్తున్నారు. ఖాళీగా, లోడుతో, విభిన్న వేగాలతో రైలు ఎలా స్పందిస్తుందో నిపుణులు ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
అందులో భాగంగా చేసిన “వాటర్ టెస్ట్” వీడియోనే ఇప్పుడు వైరల్ అయింది. ఒక కోచ్‌లో టేబుల్‌పై మూడు గ్లాసుల నీటిని ఉంచి రైలును గంటకు 180 కిలోమీటర్ల వేగానికి పెంచడం జరిగినది. సాధారణంగా అంత వేగంలో రైలు ప్రయాణిస్తే కుదురుగా నిలబడటం కష్టం కానీ ఈ వీడియోలో నీరు ఒరిగిపోలేదు, గ్లాసులు కదల్లేదు. అంతే కాదు ఒక గ్లాసును మిగతా రెండింటి మీద ఉంచినప్పటికీ అవి కిందపడలేదు. ఇది రైలు డిజైన్‌లో తీసుకున్న ఆధునిక సాంకేతికత తక్కువ వైబ్రేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ నాణ్యతను చూపించే ఉదాహరణగా మారింది. ఈ దృశ్యాలు బయటకు రాగానే ప్రజలు భారతీయ రైల్వే అభివృద్ధిని ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుత రైళ్లలో ఉన్న బెర్త్‌లు, డిజైన్ లోపాలపై రైల్వే ఇప్పటికే పలు మార్పులు చేస్తోంది. బెర్త్‌ల మధ్య ఉండే పదునైన ఎడ్జ్‌లను మార్చడం కోచ్‌లో కదలికలు తగ్గించే ఇంజనీరింగ్ మార్పులు తీసుకువస్తున్నారు. అసలు ఈ సంవత్సరం సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లోనే వందేభారత్ స్లీపర్‌ను సేవల్లోకి తీసుకురావాలని రైల్వే ప్రణాళిక వేసినా, కొన్ని సాంకేతిక కారణాలతో తేదీలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ట్రయల్ రన్స్ వేగంగా జరుగుతుండడంతో రైలును త్వరలోనే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురావచ్చని అంచనా.
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్లీపర్ రైలును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెద్ద బెర్త్‌లు, విశాలమైన వాక్వేలు, ఆధునిక లైటింగ్, వేగవంతమైన వైఫై, ప్రతి బెర్త్ వద్ద ఛార్జింగ్ పాయింట్లు, శబ్దాన్ని తగ్గించే సాంకేతికత, రాత్రి ప్రయాణానికి అనుకూలంగా ఉండే అమెనిటీలను అందిస్తున్నారు. దీర్ఘదూర ప్రయాణాల్లో ప్రయాణికులు మరింత సౌకర్యంగా నిద్రపోవడం, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా రైల్వే ఈ స్లీపర్ కోచ్‌లను రూపొందిస్తోంది.
వైరల్ అయిన వీడియోతో వందేభారత్ స్లీపర్‌పై ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది. భారత రైల్వే సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో రాబోయే సంవత్సరాల్లో హైస్పీడ్ రైళ్ల నెట్‌వర్క్‌ను విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ స్లీపర్ రైళ్లు మరొక భారీ అడుగుగా మారనున్నాయి. ఇప్పుడు అందరి చూపూ ఈ సరికొత్త స్లీపర్ రైలు అధికారికంగా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపైనే ఉంది.