Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Darling movie: రీ-రిలీజ్‌లోనూ ప్రభాస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. 10 కోట్ల మార్కును దాటేసిన 'డార్లింగ్'! Rajamouli: మాహిష్మతికి పునాది అక్కడే పడింది.. చిచెన్ ఇట్జా పిరమిడ్ స్ఫూర్తిని వెల్లడించిన జక్కన్న.. Tollywood: ఒకవైపు కేసు.. మరోవైపు అషు రెడ్డి వార్నింగ్.. అసలేం జరిగింది? Akshay Kumar: భయపడని నిటార.. కటకటాల్లోకి నిందితుడు! స్టార్ కిడ్ మనోధైర్యాన్ని మెచ్చుకున్న పోలీసులు.. Rajamouli: వారణాసి మేకింగ్ చూసి ఫిదా అయిన జక్కన్న - చిత్ర బృందంపై ప్రశంసల జల్లు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్.. Dhurandhar: ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల! అంతర్జాతీయ వేదికపై మరో ఘనత.. Samantha: పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజు.. భర్త రాజ్ నిడిమోరు, అభిమానుల సమక్షంలో సమంత వేడుకలు.! Tolywood: పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను! ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే..! Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Darling movie: రీ-రిలీజ్‌లోనూ ప్రభాస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే రూ. 10 కోట్ల మార్కును దాటేసిన 'డార్లింగ్'! Rajamouli: మాహిష్మతికి పునాది అక్కడే పడింది.. చిచెన్ ఇట్జా పిరమిడ్ స్ఫూర్తిని వెల్లడించిన జక్కన్న.. Tollywood: ఒకవైపు కేసు.. మరోవైపు అషు రెడ్డి వార్నింగ్.. అసలేం జరిగింది? Akshay Kumar: భయపడని నిటార.. కటకటాల్లోకి నిందితుడు! స్టార్ కిడ్ మనోధైర్యాన్ని మెచ్చుకున్న పోలీసులు.. Rajamouli: వారణాసి మేకింగ్ చూసి ఫిదా అయిన జక్కన్న - చిత్ర బృందంపై ప్రశంసల జల్లు! Agadha: 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ హంగులతో.. విజువల్ వండర్‌గా రాబోతున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్..

Ranveer Singh: కాంతార వ్యాఖ్యలు వైరల్.. లీగల్ ఇష్యూలో రణ్వీర్ సింగ్!

Ranveer Singh: కాంతార చాప్టర్-1 వివాదంలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. దేవతను అవమానించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు కొట్టివేయాలంటూ ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

Published : 2026-02-24 10:52:00

Ranveer Singh: కాంతార వివాదం.. రణ్వీర్ సింగ్‌పై ఫిర్యాదు

దేవతను అవమానించారంటూ రణ్వీర్ సింగ్‌పై కేసు డిమాండ్

కాంతార చాప్టర్-1పై వివాదం.. రణ్వీర్‌కు లీగల్ ట్రబుల్స్

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తాజాగా నటిస్తున్న కాంతార చాప్టర్–1 సినిమా నేపథ్యంలో వివాదంలో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో చాముండి దేవత పాత్రను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో మాట్లాడిన సందర్భంగా దేవతను “దెయ్యం”గా పేర్కొన్నారని, అలాగే పవిత్రంగా భావించే ‘ఓ’ శబ్దాన్ని హాస్యంగా ప్రస్తావించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలు మతపరమైన భావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూహిందూ జనజాగృతి సమితి (HJS) నేతలు గోవా రాజధాని పనాజి లోని పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా మెమొరాండం సమర్పించారు.

హిందూ జనజాగృతి సమితి ప్రతినిధులు రణ్వీర్ సింగ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా కోరారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కొందరు నటుడి వ్యాఖ్యలను తప్పుబడుతుండగా, మరికొందరు అది సినిమా ప్రమోషన్‌లో భాగమని వాదిస్తున్నారు. అయితే మతపరమైన అంశాలు కలగలిపిన సినిమాల విషయంలో సంభాషణలు, వ్యాఖ్యలు ఎంత జాగ్రత్తగా ఉండాలనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

ఇక తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ రణ్వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించడం మరో కీలక పరిణామంగా మారింది. తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని నటుడి తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ విజ్ఞప్తిపై స్పందించిన జస్టిస్ నాగప్రసన్న, “పిటిషనర్ బాలీవుడ్ స్టార్ కాబట్టి ప్రత్యేకంగా విచారణ వేగవంతం చేయాలా?” అంటూ ప్రశ్నిస్తూ అర్జెంట్ హియరింగ్‌కు నిరాకరించారు. దీంతో సాధారణ ప్రక్రియ ప్రకారమే కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టమైంది.

ఈ వివాదం సినిమాల సృజనాత్మక స్వేచ్ఛ, మతపరమైన భావోద్వేగాలు, ప్రజా వ్యక్తుల బాధ్యత వంటి అంశాలపై విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా దైవారాధన, స్థానిక సంప్రదాయాలు, సంస్కృతి ఆధారంగా తెరకెక్కే చిత్రాల్లో పాత్రల చిత్రీకరణపై మరింత జాగ్రత్త అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంతార ఫ్రాంచైజ్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అభిమాన వర్గం ఉండటంతో ఈ వివాదం సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు విచారణ తర్వాత ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఏ దిశగా సాగుతాయో చూడాల్సి ఉంది.

Spotlight

Read More →