అగ్రరాజ్యం అమెరికా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజులు పెంచింది. H1B, L1, EB5 వీసాల ఫీజు, దరఖాస్తు ఫీజును పెంచుతూ ఓ ప్రకటన చేసింది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
వీసా పాత ఫీజు కొత్త ఫీజు
H1B రూ.38,160 రూ.64,706
H1B రిజిస్ట్రేషన్ రూ.829 రూ.17,835
L1 రూ.38.160 రూ.1,14,887
EB5 రూ.3,04,845 రూ.9,25,718
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
H1B వీసా: ఇతర దేశాల వృత్తి నిపుణులకు అమెరికాలో ప్రవేశం కోసం ఈ వీసాలు జారీ చేస్తారు.
L1 వీసా: వివిధ దేశాల్లో బ్రాంచిలు ఉన్న అమెరికన్ కంపెనీలు ఆయా బ్రాంచిల నుంచి అమెరికాలో పనిచేసేందుకు ఉద్యోగులను రప్పిస్తుంటాయి.
ఈ అంతర్గత బదిలీలపై వచ్చేవారికి ఇచ్చే వీసాను L1 వీసాగా పరిగణిస్తారు.
EB5 వీసా: అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే వీసాలు ఇవి. రూ.4 కోట్లు, అంతకుమించి పెట్టుబడి పెట్టగలిగి ఉండి, కనీసం 10 మందికి ఉపాధి కల్పించగల పెట్టుబడిదారులకు, వారి కుటుంబ సభ్యులకు EB5 వీసాలు కేటాయిస్తారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి