మంచు లక్ష్మీ సడన్ సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

దేశంలో విమాన ప్రయాణాలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘ఫేర్స్ సే ఫుర్సత్’ పేరుతో రూపొందించిన ఈ వినూత్న విధానం ద్వారా ఇకపై టికెట్ ధరలు ఎప్పటికప్పుడు మారవు. అంటే, మీరు ముందుగానే బుక్ చేసినా, చివరి నిమిషంలో టికెట్ తీసుకున్నా ధర ఒకటే ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సోమవారం మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, అలయన్స్ ఎయిర్ ఛైర్మన్ అమిత్ కుమార్, సీఈఓ రాజర్షి సేన్ కూడా పాల్గొన్నారు.

Cool news: దీపావళి తర్వాత వెండి ధరల్లో చల్లని వార్త.. మార్కెట్ నిపుణుల అంచనా ఇదే!

ఇప్పటి వరకు విమానయాన రంగంలో అమల్లో ఉన్న ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానం ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. డిమాండ్‌, పండగ సీజన్లు, పోటీ పరిస్థితులను బట్టి టికెట్ ధరలు మారుతుండటం వల్ల చాలా మంది చివరి నిమిషంలో అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పైలట్ ప్రాజెక్ట్‌ అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు కొన్ని ఎంపిక చేసిన రూట్లలో అమలులోకి వస్తుంది.

PM Modi : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి.. విశాఖ AI కనెక్టివిటీ హబ్ చంద్రబాబు విజన్‌కి ప్రతిఫలం... ప్రధాని మోదీ!

ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, ఆపరేషనల్ పరిమితులు, లాభనష్టాలపై పరిశీలన అనంతరం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ‘ఫేర్స్ సే ఫుర్సత్’ ద్వారా టికెట్ ధరల్లో పారదర్శకత, స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యమని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా, ఉడాన్ పథకం స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి రావాలి” అని మంత్రి చెప్పారు.

Google: గూగుల్ వన్ స్టోరేజ్ ప్లాన్స్ ఇప్పుడు కేవలం రూ.11 కే..! 3 నెలల సూపర్ ఆఫర్..!

ఈ స్థిర ధర విధానం వల్ల చిన్న పట్టణాల నుంచి మొదటిసారిగా విమానంలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లాభం కంటే సేవకు ప్రాధాన్యతనిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్న అలయన్స్ ఎయిర్‌కి మంత్రి అభినందనలు తెలిపారు. రాబోయే నెలల్లో ప్రయాణికుల అనుభవాల ఆధారంగా ఈ విధానాన్ని మరిన్ని రూట్లకు విస్తరించే అవకాశముంది. మొత్తంగా చూస్తే, ఈ కొత్త మార్పుతో భారత విమానయాన రంగం కొత్త దిశగా అడుగుపెడుతోంది.

సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన షెడ్యూల్ పూర్తి వివరాలు!!
అమరావతిలో లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్‌! ఏపీ ప్రభుత్వం ఆమోదం!
బుల్లెట్ ప్రియులకు బంపర్ ఆఫర్! రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరలు.. భారీ డిస్కౌంట్లు!
శ్రీశైల దర్శనం తరువాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించి కర్నూలు సభకు చేరుకున్న ప్రధాని మోదీ!!
Stock markets: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో జోష్!