ముంబై ఇండియన్స్ జట్టు తనతో పాటు ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంపై ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. రోహిత్ శర్మతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలను ముంబై ఇండియన్స్ జట్టు రిటైన్ చేసుకుంది.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా స్పందిస్తూ... తన ప్రయాణం ఇక్కడే మొదలైందని, తన జీవితంలో సాధించినవన్నీ ముంబై ఇండియన్స్‌లో భాగమేనన్నాడు. తనను రిటైన్ చేసుకోవడం సంతోషకరమన్నాడు. యాజమాన్యం నుంచి తాను ఎంతో ప్రేమను తిరిగి పొందానన్నాడు. ప్రతి సంవత్సరం తనకు ప్రత్యేకమైనదేననీ... కానీ ఈ జట్టుకు మళ్లీ ఆడే అవకాశం లభించినందుకు మరింత ఆనందంగా ఉందన్నాడు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2013, 2015, 2017, 2019, 2020లలో తాము ఐదుగురం ఓ బృందంగా జట్టుకు ప్రాతినిధ్యం వహించామని గుర్తు చేశాడు. 2025లో తాము మరింత బలంగా తిరిగి వస్తామన్నాడు. తమ ఐదుగురికి ఈ జట్టులో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, తాము చేతికి ఉన్న ఐదు వేళ్లలాంటి వారమన్నాడు. ఐదు వేళ్లలా విభిన్న వ్యక్తులమైనప్పటికీ పిడికిలి బిగించినట్లుగా కలిసి ఉంటామని పేర్కొన్నాడు. తమ మధ్య సోదర భావం, స్నేహ భావం ఎప్పటికీ కొనసాగుతుందన్నాడు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: