IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Modi Phone Call: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా.. అసలు ఏం జరిగిందంటే.! Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Modi Phone Call: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా.. అసలు ఏం జరిగిందంటే.! Telangana free travel: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. ఆడ, మగ తేడా లేదు.. అందరికీ ఉచిత ప్రయాణం!

Poland: పోలాండ్‌లో విశాఖ వాసి మృతి.. స్వగ్రామానికి రానున్న మృతదేహం!

Poland: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో విషాదాన్ని నింపింది. భీమునిపట్నం మండలం మహాలక్ష్మిపురం గ్రామానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (40) ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోసం పోలాండ్‌కు వెళ్లగా, ఈ నెల 4వ తేదీన అక్కడే కన్నుమూశారు.

Published : 2026-04-19 09:54:00

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు అనారోగ్యంతో మృతి..

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో..

విశాఖపట్నం: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో విషాదాన్ని నింపింది. భీమునిపట్నం మండలం మహాలక్ష్మిపురం గ్రామానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (40) ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోసం పోలాండ్‌కు వెళ్లగా, ఈ నెల 4వ తేదీన అక్కడే కన్నుమూశారు.

వెల్డర్‌గా పనిచేస్తున్న ప్రసాద్ బాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది.

మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంలో కొంత ఆలస్యం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పోలాండ్‌లోని పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) సభ్యులు ముందుకొచ్చారు. సంఘం అధ్యక్షుడు చంద్రబాను అక్కల, కార్యదర్శి శైలేంద్ర గంగుల, అలాగే ప్రసాద్ బాబు స్నేహితులు కలిసి ఒక బృందంగా ఏర్పడి చర్యలు ప్రారంభించారు.

వారు పోలాండ్‌లోని భారత రాయబారి కార్యాలయం, స్థానిక ఆసుపత్రి అధికారులు, విమాన సంస్థలతో సమన్వయం చేస్తూ మృతదేహాన్ని త్వరితగతిన భారత్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. వారి కృషి ఫలించి, ప్రసాద్ బాబు మృతదేహం ఈ నెల 20వ తేదీ సోమవారం స్వగ్రామానికి చేరుకోనుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

అదే రోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాలు చూపిన సహకారం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే కార్మికుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Spotlight

Read More →