Investment Tips: 5 లక్షలు దాచుకుంటే 2.25 లక్షల వడ్డీ..! ఈ పథకం గురించి మీకు తెలుసా? Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Second Airport: బెంగళూరుకు రెండో విమానాశ్రయం! సిద్ధరామయ్య బడ్జెట్ హైలైట్స్...! Salary Hike: ఏపీలో వారికి తీపికబురు! వేతనాలు పెంపు... ఉత్తర్వులు జారీ! Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! AP Womens: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ! పూర్తి వివరాలు ఇవే! Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Investment Tips: 5 లక్షలు దాచుకుంటే 2.25 లక్షల వడ్డీ..! ఈ పథకం గురించి మీకు తెలుసా? Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Second Airport: బెంగళూరుకు రెండో విమానాశ్రయం! సిద్ధరామయ్య బడ్జెట్ హైలైట్స్...! Salary Hike: ఏపీలో వారికి తీపికబురు! వేతనాలు పెంపు... ఉత్తర్వులు జారీ! Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! AP Womens: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ! పూర్తి వివరాలు ఇవే! Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల!

Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల!

Kingfisher: హైదరాబాద్‌లోని మల్లాపూర్ ప్రాంతంలో ఉన్న ఒక వైన్ షాపులో వింత ఘటన వెలుగుచూసింది. ఒక కస్టమర్ కొన్న కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల కనిపించింది. దీనిపై నిలదీసిన కస్టమర్‌పై వైన్ షాపు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Published : 2026-03-07 10:50:00

సీలు చేసిన బీరు సీసాలో చేపల సందడి…

మీ బీరులో ఏముందో చెక్ చేసుకోండి…

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వింత ఘటన…

Kingfisher: హైదరాబాద్ నగరంలో ఒక వింత మరియు విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఆహార పదార్థాలు లేదా పానీయాలలో కల్తీ జరగడం గురించి వింటూ ఉంటాం, కానీ ఇక్కడ ఏకంగా ఒక సీలు చేసిన బీరు సీసాలో బ్రతికున్న చేప పిల్ల కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి వైన్ షాపులో కొనుగోలు చేసిన కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో ఈ చేప పిల్ల ప్రత్యక్షమైంది.

మల్లాపూర్‌లోని జేపీ వైన్ షాపులో ఒక కస్టమర్ కింగ్‌ఫిషర్ లైట్ బీరు బాటిల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్ళి ఆ సీసాను గమనించగా, అందులో నీటిలో ఈదినట్లుగా ఒక చిన్న చేప పిల్ల బాటిల్ లోపల తిరుగుతూ కనిపించింది. అది చూసి సదరు కస్టమర్ షాక్‌కు గురయ్యాడు. సీలు వేసిన బాటిల్ లోపలికి చేప పిల్ల ఎలా వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నాణ్యత పాటించాల్సిన కంపెనీల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన నిరూపిస్తోంది.

వెంటనే ఆ వ్యక్తి బాటిల్‌ను తీసుకుని వైన్ షాపు యజమానిని నిలదీశాడు. అయితే, అక్కడి సిబ్బంది బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు. తాము కేవలం మద్యం అమ్ముతామని, బాటిల్ లోపల ఏమున్నా అది తయారు చేసిన కంపెనీదే తప్పని, తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆ వ్యక్తి అక్కడే ఉన్న దృశ్యాలను తన సెల్ ఫోన్‌లో వీడియో తీశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. బీరు బాటిల్‌లో చేప పిల్ల ఈదుతున్న దృశ్యాలను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మందు బాబులు ఈ వీడియో చూసి బెంబేలెత్తిపోతున్నారు. కింగ్‌ఫిషర్ వంటి పెద్ద కంపెనీలో ప్యాకింగ్ సమయంలో ఇలాంటి పొరపాట్లు ఎలా జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు. బీరు తయారీలో వాడే నీటిని సరిగ్గా శుద్ధి చేయడం లేదని, అందుకే ఇలాంటివి జరుగుతున్నాయని మండిపడుతున్నారు.
 

Spotlight

Read More →