Pawan Kalyan: గోదావరి కాలుష్య ప్రాంతాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలన! CNG Price Hike: పెట్రోల్‌ను దాటేలా ఉందిగా... రెక్కలొచ్చిన సీఎన్‌జీ ధరలు! సామాన్యుడి గుండె గుభేల్! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! AI Data center: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ.81 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్! US AirStrikes: ఇరాన్‌పై అమెరికా భారీ దాడి - ఈ సారి క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Pawan Kalyan: గోదావరి కాలుష్య ప్రాంతాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలన! CNG Price Hike: పెట్రోల్‌ను దాటేలా ఉందిగా... రెక్కలొచ్చిన సీఎన్‌జీ ధరలు! సామాన్యుడి గుండె గుభేల్! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! AI Data center: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ.81 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్! US AirStrikes: ఇరాన్‌పై అమెరికా భారీ దాడి - ఈ సారి క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో..

Bandla Ganesh: పవన్‌తో ఆ ఒక్క సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి... బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

Bandla Ganesh: నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్, తన చిరకాల కోరికను బయటపెట్టారు. తన ఆరాధ్య దైవం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో యావత్ ప్రపంచంలోని తెలుగువారంతా ఉలిక్కిపడేలా ఒక భారీ చిత్రాన్ని నిర్మించాలని, ఆ ఒక్క సినిమా తర్వాత ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్‌ను శాశ్వతంగా మూసివేస్తానని సంచలన ప్రకటన చేశారు.

Published : 2026-05-25 15:36:00
  • Cinema: చిన్న బడ్జెట్ చిత్రాల కోసం కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు వెల్లడి..
     
  • పవన్‌తో ప్రపంచం ఉలిక్కిపడే సినిమా తీసి తన బ్యానర్ మూసేస్తానన్న‌ బండ్ల గణేష్..

Bandla Ganesh: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, అగ్ర నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును మరియు క్రేజ్‌ను సొంతం చేసుకున్న బండ్ల గణేష్ తాజాగా తన మనసులోని ఒక చిరకాల కోరికను బయటపెట్టి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. తన ఆరాధ్య దైవమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో యావత్ ప్రపంచంలోని తెలుగువారంతా ఉలిక్కిపడేలా, మునుపెన్నడూ చూడని విధంగా ఒక భారీ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మించాలని, ఆ ఒక్క సినిమా రికార్డులు సృష్టించిన తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్‌ను శాశ్వతంగా మూసివేస్తానని ఆయన ప్రకటించారు. ఇటీవల ‘రాజా రవీంద్ర టాక్స్’ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్.. పవన్ కల్యాణ్‌ను 'పవనేశ్వరా', 'దేవరా' అంటూ దేవుడిలా ఆరాధించే తన భక్తిని చాటుకుంటూ, తన దేవుడితో మరో బ్లాక్‌బస్టర్ సినిమా తీయాలన్నదే తన జీవిత ఆశయమని స్పష్టం చేశారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో మళ్లీ పవన్ కల్యాణ్‌తో సినిమా తీసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ తెలుగోడు ఆశ్చర్యపోయేలా ఆ చిత్రం ఉండాలని, ఆ భారీ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే సదరు బ్యానర్‌లో నిర్మాణాన్ని ఆపేయాలన్నది తన అంతిమ కోరికని ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆ సువర్ణావకాశం కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, తిరుమల ఏడుకొండలవాడు ఆ రోజు ఎప్పుడు ఇస్తాడో చూడాలని వ్యాఖ్యానించారు. చిరంజీవితో ఏదో ఊరికే ఒక సినిమా తీస్తే ఉపయోగం లేదని, రాబోయే 30 ఏళ్ల తర్వాత కూడా తన పిల్లలు ఎంతో గర్వంగా చెప్పుకునేలా ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించే కథతోనే సినిమా చేయాలని, గతంలో తమ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ విడుదలై 14 ఏళ్లయినా ఇంకా జనం మాట్లాడుకున్నట్టే, చిరంజీవితో తాను చేసే సినిమా కూడా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు ప్రస్తుత చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై బండ్ల గణేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిశ్రమలో నూతన కథలు దొరకడం చాలా కష్టంగా మారిందని, దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత రాకతో ఇండస్ట్రీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనన్న భయం కలుగుతోందని విశ్లేషించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదని, ఒకవేళ కంటెంట్ కొంచెం బాగాలేకపోతే రెండో రోజే థియేటర్లన్నీ పూర్తిగా ఖాళీ అవుతున్నాయని, ఇదంతా చూస్తుంటే ఒక మిస్టరీలా అనిపిస్తూ పరిశ్రమలో ఏదో పెద్ద మార్పు జరగబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఒక ఎగ్జిబిటర్‌గా తనకు కూడా ఈ మధ్య కాలంలో చాలా చెత్త అనుభవం ఎదురైందని, థియేటర్ నిర్వహణపై ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా లాభం రావడం లేదని ఆయన ఆవేదన చెందారు. అయితే పెద్ద సినిమాల పట్ల ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ, చిన్న చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవలే తాను 'బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్' అనే పేరుతో సరికొత్త బ్యానర్‌ను స్థాపించానని బండ్ల గణేష్ వెల్లడించారు. ఈ కొత్త బ్యానర్ ద్వారా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్ ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా చేతులు కలిపి, దాదాపు రూ. 4 నుంచి 5 కోట్ల పరిమిత బడ్జెట్‌లో వినూత్నమైన చిన్న సినిమాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఆయన ఈ ఇంటర్వ్యూ వేదికగా స్పష్టం చేశారు.

Spotlight

Read More →