Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! Used Cars: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 తనిఖీలు చేయకుంటే చిక్కుల్లో పడ్డట్టే! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! KGBV Notification: ఏపీ కేజీబీవీ అడ్మిషన్స్ 2026! 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల! Iran Updates: అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి మారాలి..! ఇరాన్ అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! Used Cars: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 తనిఖీలు చేయకుంటే చిక్కుల్లో పడ్డట్టే! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! KGBV Notification: ఏపీ కేజీబీవీ అడ్మిషన్స్ 2026! 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల! Iran Updates: అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి మారాలి..! ఇరాన్ అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్!

GLMC 2026: సౌదీ అరేబియాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం!

Saudi Global labour market conference: సౌదీ అరేబియాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో ఆంధ్ర వనిత చేతనకు తన అభిప్రాయాలను పంచుకునే అరుదైన అవకాశం దక్కింది.

Published : 2026-02-16 11:53:00

అంతర్జాతీయ వేదికపై ఆంధ్ర వనిత గళం…

 సౌదీ సదస్సులో చేతన జగదీశ్వరి ప్రసంగం…

ప్రపంచ కార్మిక సదస్సులో హిందూపూర్ మహిళ సత్తా…

సౌదీ అరేబియాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో ఆంధ్ర వనిత చేతనకు తన అభిప్రాయాలను పంచుకునే అరుదైన అవకాశం దక్కింది. విదేశాల్లో పనిచేసే భారతీయ కార్మికుల ఆరోగ్య భద్రతపై ఆమె ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పుల గురించి చర్చించడానికి తాజాగా ప్రపంచ కార్మిక మార్కెట్ సదస్సు (జీఎల్ఎంసీ) జరిగింది. ఇందులో వందకు పైగా దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలు, సౌదీ అరేబియా: మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సత్యసాయి జిల్లా హిందూపూర్‌కు చెందిన చేతన జగదీశ్వరికి కూడా ఈ సదస్సులో ఓ ముఖ్య అంశంపై మాట్లాడే అవకాశం దక్కింది. సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ కార్మిక సంస్థ, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ఐరోపా యూనియన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 'అధిక ఉష్ణోగ్రతల్లో, సరైన వసతులు, వెలుతురు, గాలి లేకుండా నివసించే కార్మికుల పరిరక్షణలో సామాజిక బాధ్యత' అంశంపై జరిగిన సదస్సులో తాను పాల్గొని ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో మాట్లాడానని చేతన చెప్పారు.

కార్మికులు తమ ఉపాధి దేశం నుంచి మాతృదేశాలకు తిరిగి వెళ్ళిన తర్వాత సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టే దిశగా సరిహద్దులకు అతీతంగా కృషి జరగాలని చేతన సూచించారు. అధిక ఉష్ణోగ్రత నుంచి కార్మికులను కాపాడే దిశగా ఇప్పటికే సౌదీ అరేబియా ప్రభుత్వం వేసవి కాలంలో బయట ఎండలో పని చేయడాన్ని నిషేధించిందన్నారు. తద్వారా ఈ దిశగా పురోగతి సాధిస్తున్నందుకు సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు తెలిపారు.

సౌదీ అరేబియాలో క్రియాశీలక తెలుగు మహిళలలో ఒకరైన చేతన చాలా కాలంగా కుటుంబ సమేతంగా అక్కడే నివసిస్తున్నారు. వివిధ సమస్యలపై స్పందించే ఆమె సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల సంస్థ సాటా సెంట్రల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చేతన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నందుకు సాటా సెంట్రల్ ఆమెను అభినందించింది.

Spotlight

Read More →