తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో తన ప్రత్యేక గుర్తింపుతో టాలీవుడ్లో నేషనల్ పాపులారిటీ సంపాదించిన యంగ్ హీరోయిన్ రెజీనా కసాంద్రా తాజాగా ఒక సరదా సంఘటనను బయటపెట్టారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది.
రెజీనా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా, ఆమెకు ఆహారం అంటే ప్రాణం. షూటింగ్ సమయంలో ఎప్పుడూ లంచ్ బాక్స్ తీసుకెళ్తారని, తినే సమయం కూడా ఒక చిన్న సెలబ్రేషన్ లాంటిదని వెల్లడించారు.
ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఒక వినోదభరిత ఘటనను పంచుకున్నారు. బెంగళూరులోని షూటింగ్ సమయంలో ఆమెకు బెంగాలీ స్వీట్ “మిష్టి దోయ్” తినాలనే ఆకాంక్ష తీవ్రంగా కలిగిందని తెలిపారు. పలు స్వీట్ షాపులు తిరిగినా, దొరకలేదని, చివరికి ఒక షాపులోకి వెళ్ళగా అది మూసివేయబడినట్లు తెలిసి కొంత నిరాశ చెందారని చెప్పారు.
అయితే, అక్కడ ఆమె సరదాగా ఒక చిన్న అబద్ధం చెప్పినట్టు రివీల్ చేశారు. నేను గర్భవతిని, స్వీట్ తినాలనే క్రేవింగ్ చాలా ఎక్కువ అని చెప్పి ఒక్క బౌల్ మిష్టి దోయ్ కోసం అడిగారు. ఈ మాట విని షాపు యజమాని ఆశ్చర్యపోయి, వెంటనే షాపును తిరిగి తెరిచి ఆమెకు స్వీట్ సర్వ్ చేశాడని ఆమె వెల్లడించారు.
రెజీనా ఈ సంఘటనను పంచిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మిష్టి దోయ్ కోసం ఇంత కష్టమా! అని నవ్వుకుంటే, మరికొందరు “స్టార్స్ కూడా ఇలాంటి చిన్న అబద్ధాలు చెబుతారంటే చాలా క్యూట్‌గా ఉంది అని కామెంట్ చేస్తున్నారు