ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) దేశవ్యాప్తంగా గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పాఠశాలలు. ఈ పాఠశాలలు ఆధునిక సౌకర్యాలు మరియు నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. ఈ స్కూల్లో పని చేయడానికి ప్రభుత్వం ఉద్యోగాలను విడుదల చేయడం జరిగినది అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్రింది విధంగా తెలపడం జరిగింది.
మొత్తం పోస్టులు సంఖ్య
కేంద్ర ప్రభుత్వం EMRSలో 7,267 టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందుకు సంబంధించిన వివిధ ఖాళీలను ఈ క్రింది విధంగా వివరించడం జరిగినది
* ప్రిన్సిపల్ – 225
* పీజీటీ (Post Graduate Teacher) – 1,460
* టీజీటీ (Trained Graduate Teacher) – 3,962
* హాస్టల్ వార్డెన్ (Male) – 346
* హాస్టల్ వార్డెన్ (Female) – 289
* జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Clerk) – 228
* అకౌంటెంట్ – 61
* స్టాఫ్ నర్స్ (Female) – 550
* ల్యాబ్ అటెండెంట్ – 146
విద్యార్హతలు
ప్రిన్సిపల్ – పీజీ + బీ.ఎడ్.
పీజీటీ – సంబంధిత సబ్జెక్టులో పీజీ + బీ.ఎడ్.
టీజీటీ – సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ + బీ.ఎడ్.
హాస్టల్ వార్డెన్ – ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్
అకౌంటెంట్ – కామర్స్ గ్రాడ్యుయేషన్
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 12వ తరగతి
స్టాఫ్ నర్స్ – బి.ఎస్సీ నర్సింగ్
ల్యాబ్ అటెండెంట్ – 10వ లేదా 12వ తరగతి + ల్యాబ్ డిప్లొమా
వయో పరిమితి:
ప్రిన్సిపల్ – 50 ఏళ్లు గరిష్టం
పీజీటీ – 40 ఏళ్లు
టీజీటీ – 35 ఏళ్లు
హాస్టల్ వార్డెన్ / స్టాఫ్ నర్స్ – 35 ఏళ్లు
అకౌంటెంట్ / ల్యాబ్ అటెండెంట్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 30 ఏళ్లు
(ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది)
జీతం:
ప్రిన్సిపల్ – రూ.78,800 – రూ.2,09,200
పీజీటీ – రూ.47,600 – రూ.1,51,100
టీజీటీ – రూ.44,900 – రూ.1,42,400
అకౌంటెంట్ – రూ.35,400 – రూ.1,12,400
స్టాఫ్ నర్స్ / హాస్టల్ వార్డెన్ – రూ.29,200 – రూ.92,300
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – రూ.19,900 – రూ.63,200
ల్యాబ్ అటెండెంట్ – రూ.18,000 – రూ.56,900
దరఖాస్తు రుసుము
జనరల్ / OBC / EWS: ప్రిన్సిపల్ – రూ.2,500, పీజీటీ & టీజీటీ – రూ.2,000, నాన్-టీచింగ్ – రూ.1,500
మహిళలు / SC / ST / PWD – రూ.500 మాత్రమే
దరఖాస్తు గడువు
అక్టోబర్ 23, 2025
ఎంపిక విధానం
అభ్యర్థులను రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన అభ్యర్థులు nests.tribal.gov.in
https://nests.tribal.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.అవసరమైన సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం స్కాన్ కాపీలు ముందుగా సిద్ధం ఉంచుకోవాలి.