- 2025–28 బార్ పాలసీ కింద తాజా డ్రా ఆఫ్ లాట్స్‌కు షెడ్యూల్ విడుదల..
- జిల్లాల వారీగా రీ-నోటిఫికేషన్..
2025–28 నూతన బార్ పాలసీ కింద రాష్ట్రవ్యాప్తంగా 301 ఓపెన్ కేటగిరీ బార్ లైసెన్సులను మళ్లీ నోటిఫై చేయాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రకటించారు. డ్రా ఆఫ్ లాట్స్ విధానంలో ఇప్పటికే ఓపెన్ కేటగిరీలో 541 బార్లు, రిజర్వ్ కేటగిరీలో 84 బార్లు కేటాయించబడినప్పటికీ, 299 బార్లు ఇంకా కేటాయింపు పూర్తి కాలేదని చెప్పారు. గుంటూరు, ఎన్‌టీఆర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు బార్లకు రీ-నోటిఫికేషన్‌కు అనుమతి ఇవ్వడంతో, మొత్తం 301 బార్లను మళ్లీ నోటిఫై చేయనున్నట్లు డైరెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు.
జిల్లాల వారీగా రీ-నోటిఫికేషన్ చేయనున్న బార్లలో ఎన్‌టీఆర్ (55), విశాఖపట్నం (52), గుంటూరు (42), ఎస్పీఎస్ నెల్లూరు (27), పల్నాడు (22), విజియానగరం డైరెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ, అప్లికేషన్ ప్రక్రియను అనుసరించి జిల్లా గెజెట్లలో బార్ల జాబితా ఇప్పటికే ప్రచురించామని, తదనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఆన్‌లైన్ / హైబ్రిడ్ / ఆఫ్‌లైన్ విధానాల్లో ఫిబ్రవరి 4, 2026 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 5, 2026 ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించబడతాయని, అదే రోజు ఎంపికైన వారికి తాత్కాలిక లైసెన్సుల మంజూరుపై సమాచారం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత జిల్లా ఎక్సైజ్ అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని డైరెక్టర్ శ్రీధర్ ఆదేశించారు.