Tirumala Ghee Case: నిబంధనల సడలింపు.. రహస్య సమావేశాలు తిరుమల నెయ్యి స్కామ్‌పై కేబినెట్ విస్తుపోయే నిజాలు! TDP కేంద్ర కార్యాలయం ముఖ్య సూచన! ఫిబ్రవరి నెలలో మంత్రుల ప్రజా వేదిక షెడ్యూల్! India russia: ఆయిల్ కొనుగోళ్లు ఆపుతున్నట్టు భారత్ చెప్పలేదు.. రష్యా! తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక మలుపు..! అసలు ఆట ఇప్పుడే మొదలు..! అమరావతికి రెండు దారుల బుల్లెట్ రైళ్లు..! ఏపీకి గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్! Land Survey News: భూవివాదాలకు చెక్.. జస్ట్ స్కాన్ చేస్తే మీ ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షం..!! Sheikh Hasina: రెండు కేసులు, రెండు తీర్పులు.. షేక్ హసీనాకు మొత్తం 10 ఏళ్ల జైలు! Jana Sena Party meeting: ఆ ఒక్క మాటతో అందరిలో వణుకు .. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక వాటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఏపీ మీదుగా సూపర్ కనెక్టివిటీ..! కోల్‌కతా–చెన్నై హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! Tirumala Ghee Case: నిబంధనల సడలింపు.. రహస్య సమావేశాలు తిరుమల నెయ్యి స్కామ్‌పై కేబినెట్ విస్తుపోయే నిజాలు! TDP కేంద్ర కార్యాలయం ముఖ్య సూచన! ఫిబ్రవరి నెలలో మంత్రుల ప్రజా వేదిక షెడ్యూల్! India russia: ఆయిల్ కొనుగోళ్లు ఆపుతున్నట్టు భారత్ చెప్పలేదు.. రష్యా! తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక మలుపు..! అసలు ఆట ఇప్పుడే మొదలు..! అమరావతికి రెండు దారుల బుల్లెట్ రైళ్లు..! ఏపీకి గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్! Land Survey News: భూవివాదాలకు చెక్.. జస్ట్ స్కాన్ చేస్తే మీ ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షం..!! Sheikh Hasina: రెండు కేసులు, రెండు తీర్పులు.. షేక్ హసీనాకు మొత్తం 10 ఏళ్ల జైలు! Jana Sena Party meeting: ఆ ఒక్క మాటతో అందరిలో వణుకు .. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక వాటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఏపీ మీదుగా సూపర్ కనెక్టివిటీ..! కోల్‌కతా–చెన్నై హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్!

TDP కేంద్ర కార్యాలయం ముఖ్య సూచన! ఫిబ్రవరి నెలలో మంత్రుల ప్రజా వేదిక షెడ్యూల్!

షార్ట్ నోట్ (Short Note): మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో ప్రతిరోజూ జరిగే 'ప్రజా వేదిక' కార్యక్రమానికి సంబంధించి ఫిబ్రవరి నెలకు గాను ప్రభుత్వం మరియు పార్టీ కీలక మార్పులను ప్రకటించింది.

Published : 2026-02-03 18:45:00

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రతి రోజు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో సంబంధిత శాసనసభ్యుల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించబడుతున్నందున ఎన్టీఆర్ భవన్‌లో ప్రతి శుక్రవారం ఎటువంటి గ్రీవెన్స్ నిర్వహించబడదు. 8వ తేదీన కలెక్టర్లతో కాన్ఫరెన్స్, 15, 22వ తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 28వ తేదీన పేదల సేవలో - పింఛన్లు పంపిణీ కార్యక్రమం వలన ఆ రోజుల్లో సెలవు ఉంటుంది. కావున ప్రజలు గమనించగలరు.

రేపటి నుండి ప్రజావేదికలో పాల్గొనే నాయకుల షెడ్యూల్ :-

•    04-02-2026 – మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఎస్. రాజశేఖర్ గారు.
•    05-02-2026 – మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు, పల్నాడు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ చిరు మాముల మధుబాబు గారు.
•    07-02-2026 – మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, మాజీ ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ సెక్రటరీ పరుచూరి అశోక్ బాబు గారు.
•    09-02-2026 – ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్ గారు.
•    10-02-2026 – పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డి సుబ్రమణ్యం గారు, ఏపీ బొండిలి వెల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ డి. విక్రమ్ సింగ్ గారు
•    11-02-2026 – పార్టీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కావలి ప్రతిభా భారతి గారు, ఏపీ కల్చర్ కమిషన్ చైర్మన్ పొడపటి తేజస్వి గారు.
•    12-02-2026 – గుంటూరు మేయర్ కోవెల ముడి నాని గారు, ఏపీ నూర్ బాషా, నూర్బాషా దూదేకుల చైర్మన్ నాగుల్ మీరా కాసునూరి గారు.
•    14-02-2026 – ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయా కృష్ణా రంగారావు గారు, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీ దేవి గారు.
•    16-02-2026 – ఏపీ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ మంతెన రామరాజు గారు, బెస్త సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ బొమ్మన గారు
•    17-02-2026 – విజయనగరం డీసీసీబీ చైర్మన్ కమిడి నాగార్జున గారు, ఏపీ జంగం సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వి. చంద్రశేఖర్ గారు
•    18-02-2026 – ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు, ఏపీ కృష్ణా బాలజీ, పూసల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గంటా తిరుమల గారు.
•    19-02-2026 – టీటీడీ మెంబర్, పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మీ గారు, ఏపీ కూరాకల, పొందర కార్పొరేషన్ చైర్మన్ దామోదర నర్సింహులు గారు
•    21-02-2026 – ఏపీ సీవోబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు, మాజీ ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ సెక్రటరీ పరుచూరి అశోక్ బాబు గారు.
•    23-02-2026 – పార్టీ సెంట్రల్ జనరల్ సెక్రటరీ కంభంపాటి రామ్మోహన్ రావు గారు, డీసీసీబీ చైర్మన్ శివల సూర్యనారాయణ గారు.
•    24-02-2026 – రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి గారు, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ గారు
•    25-02-2026 – ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, కర్నూల్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ సోమి శెట్టి వెంకటేశ్వర్లు గారు.
•    26-02-2026 – ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నర్సింహ యాదవ్ గారు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాశ్ గారు.

Spotlight

Read More →