Mahanadu: 11 క్లస్టర్లలో ఉత్సాహంగా మహానాడు కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి ఆనం! Mahanadu: మహిళలు, యువత రాజకీయాల్లో ముందుకు రావాలి.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి! Atchennaidu: బక్రీదు సందర్భంగా అక్రమ జంతువుల వధపై కఠిన చర్యలు.. మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరిక! Chandrababu: మహానాడులో చంద్రబాబు రౌండ్ టేబుల్ వార్నింగ్.. "గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలు వీడి కూటమితో కలిసి సాగండి!" Nara Lokesh: టీమ్ 11 కెప్టెన్‌కు లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్ - ‘డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చెయ్... తేల్చుకుందాం! Nara Lokesh: చెప్పినట్టే 'భారీ ప్రకటన' చేసిన నారా లోకేశ్.. దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారిన టీడీపీ నిర్ణయం! Nara Lokesh: మహిళల్లో కొత్త ఆశలు నింపిన లోకేష్ నిర్ణయం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు! Central Govt: జనాభా మార్పుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ! కేంద్రం కీలక నిర్ణయం! Chandrababu: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాం": మహానాడు ముగింపు వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! chandrababu: వాహనాల హోరు తగ్గింది.. తమ్ముళ్ల జోరు తగ్గలేదు.. సరికొత్త హైబ్రిడ్ మహానాడుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Mahanadu: 11 క్లస్టర్లలో ఉత్సాహంగా మహానాడు కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి ఆనం! Mahanadu: మహిళలు, యువత రాజకీయాల్లో ముందుకు రావాలి.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి! Atchennaidu: బక్రీదు సందర్భంగా అక్రమ జంతువుల వధపై కఠిన చర్యలు.. మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరిక! Chandrababu: మహానాడులో చంద్రబాబు రౌండ్ టేబుల్ వార్నింగ్.. "గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలు వీడి కూటమితో కలిసి సాగండి!" Nara Lokesh: టీమ్ 11 కెప్టెన్‌కు లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్ - ‘డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చెయ్... తేల్చుకుందాం! Nara Lokesh: చెప్పినట్టే 'భారీ ప్రకటన' చేసిన నారా లోకేశ్.. దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారిన టీడీపీ నిర్ణయం! Nara Lokesh: మహిళల్లో కొత్త ఆశలు నింపిన లోకేష్ నిర్ణయం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు! Central Govt: జనాభా మార్పుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ! కేంద్రం కీలక నిర్ణయం! Chandrababu: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాం": మహానాడు ముగింపు వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! chandrababu: వాహనాల హోరు తగ్గింది.. తమ్ముళ్ల జోరు తగ్గలేదు.. సరికొత్త హైబ్రిడ్ మహానాడుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

Mahanadu: మహిళలు, యువత రాజకీయాల్లో ముందుకు రావాలి.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

Mahanadu: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.

Published : 2026-05-27 19:48:00

కార్యకర్తే పార్టీకి వెన్నెముక : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..

స్త్రీశక్తి, యువగళంపై మహానాడులో విస్తృత చర్చలు..

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాయచోటి టౌన్ మాసాపేటలోని సాయి శుభ కళ్యాణ మండపంలో నిర్వహించిన 7వ క్లస్టర్ మహానాడు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ, “కార్యకర్తే పార్టీకి అసలైన బలం” అని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి కార్యకర్తల కృషే ప్రధాన ఆధారం అని అన్నారు.

మహానాడు సమావేశంలో “కార్యకర్తే అధినేత”, “స్త్రీశక్తి”, “యువగళం”, అలాగే పేదల సేవలో తెలుగుదేశం పార్టీ పాత్ర వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. మహిళలు, యువత రాజకీయాల్లో మరింత చురుకుగా పాల్గొని పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి పిలుపునిచ్చారు.

మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు.

ఈ మహానాడు కార్యక్రమంలో పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, మహిళా నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.

Spotlight

Read More →