Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు!

Varla Ramaiah: జగన్‌ను వెంటాడుతున్న '11' అంకె.. 11 సీట్లు, 11 చార్జిషీట్లు.. ఆ రోజు తెల్లవారుజామున ఏం జరిగిందో చెప్పాలి! సీబీఐ ఉచ్చు బిగుస్తోందా?

Varla Ramaiah: గడచిన ఐదేళ్లు రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, నిరంకుశంగా పాలించిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నేడు 'కుడితిలో పడ్డ ఎలుక'లా తయారైందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా వెలిగిన వ్యక్తికి, నేడు ప్రతిపక్ష హోదా కూడా దక్కని దయనీయ స్థితి పట్టడం ఆయన స్వయంకృతాపరాధమేనని ధ్వజమెత్తారు.

Published : 2026-03-25 21:44:00
  • Politics: జగన్ పరిస్థితి 'కుడితిలో పడ్డ ఎలుక'లా మారింది: మాజీ సీఎంపై వర్ల రామయ్య ఘాటు విమర్శలు!
     
  • వివేకా హత్య కేసులో ఫోన్ కాల్స్ మర్మం ఏంటి? ఆ రోజు తెల్లవారుజామున ఏం జరిగిందో చెప్పాలి!

Varla Ramaiah: గడచిన ఐదేళ్లు రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని, నిరంకుశంగా పాలించిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నేడు 'కుడితిలో పడ్డ ఎలుక'లా తయారైందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా వెలిగిన వ్యక్తికి, నేడు ప్రతిపక్ష హోదా కూడా దక్కని దయనీయ స్థితి పట్టడం ఆయన స్వయంకృతాపరాధమేనని ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం కుంభకోణం ద్వారా రూ.3500 కోట్లు కొల్లగొట్టారు. ఈ అక్రమ సంపాదలో అంతిమ లబ్ధిదారులు ఎవరు? రాజ్ కసిరెడ్డి, ధనంజయ్ రెడ్డి, చెవిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి వారు కేవలం పావులేనా లేక వారి వెనుక ఉన్న అసలు సూత్రధారి జగనేనా? దీనిపై లెక్కలు తేలాల్సి ఉంది. రూ. 43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణలు, జోగి రమేష్ కల్తీ మద్యం కేసులు ఒకవైపు జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐదేళ్లకు పైగా 'కండిషనల్ బెయిల్'పై తిరుగుతున్న రాజకీయ నేతగా ఆయన రికార్డు సృష్టిస్తున్నారు.  

రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా జగన్ ఒంటరివాడయ్యారు. తండ్రి వైఎస్సార్ బ్రతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకంలో తన చెల్లికి అన్యాయం చేశారని సొంత తల్లి విజయమ్మ గారే లేఖ రాయడం సిగ్గుచేటు. బాబాయ్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో రాష్ట్రం మొత్తానికి తెలుసు. చెల్లెలు సునీత గారు పట్టువదలకుండా పోరాడుతుంటే, నాటి 'కాల్ డేటా' బయటపడుతుందన్న భయంతో జగన్ కంటిమీదు కునుకు లేకుండా గడుపుతున్నారు. మా నేత పట్టాభి గారు వాస్తవాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక, ఆయన ఇంటిపై దాడి చేయించి, ఆయన కుమార్తెను భయభ్రాంతులకు గురిచేయడం మీ ఫ్యాక్షనిస్ట్ బుద్ధికి నిదర్శనం. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను కొట్టించారు. తండ్రి చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించిన నైజం మీది. అలాంటి మిమ్మల్ని ప్రశ్నిస్తే శవయాత్రలు చేస్తారా? రాజకీయాల్లో విమర్శలు సహజం. అవి తట్టుకోలేనప్పుడు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి లేదా వ్యాపారాలు చూసుకోండి. జగన్ గారూ.. మీరు ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా, ఫ్యాక్షనిస్ట్‌లా వ్యవహరిస్తున్నారు. 

మీ అక్రమాలను ప్రశ్నిస్తే నా మీద కూడా దాడి చేస్తారా? సిద్ధంగా ఉన్నాను. మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మీ పాపం పండిన రోజు దగ్గరలోనే ఉందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలి 'ఊరంతా ఒక దారి అయితే.. ఉలిపిక్కట్టెది ఒక దారి' అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక దాడులకు తెగబడటం ఆయన ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. జగన్ రెడ్డిని '11' అనే అంకె వదిలేలా లేదు. అసెంబ్లీలో గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలు. సీబీఐ వేసినవి 11 చార్జిషీట్లు. నిన్న పార్లమెంట్‌లో కూడా 11వ నంబర్ గది ఇస్తే.. మళ్ళీ 12వ నంబర్ గదికి మార్పించుకున్నారట. చార్జిషీట్ల విచారణ జరిగితే తన భవిష్యత్తు ఏమవుతుందో అన్న గందరగోళంలో జగన్ కొట్టుమిట్టాడుతున్నారు. విజయమ్మ గారు రాసిన లేఖ జగన్ అసలు రంగును బయటపెట్టింది. 

నాడు వైఎస్సార్ గారికి ఇచ్చిన మాట ప్రకారం 'చెల్లి మేలు కోరే మొదటి వ్యక్తిని' అని చెప్పిన జగన్, నేడు ఆమెకు రావాల్సిన ఆస్తిని నొక్కేయడం ధర్మమేనా? 2009 నుండి 2019 మధ్య కాలంలో కేవలం డివిడెండ్ రూపంలోనే చెల్లికి రూ. 200 కోట్లు ఇచ్చారు. ఆడిటర్ల లెక్కల ప్రకారం.. షర్మిల గారికి రూ. 200 కోట్లు లాభం పంపిణీ చేశారంటే, ఆ సంస్థల మొత్తం లాభం దాదాపు రూ. 2500 కోట్లు ఉండాలి. ఇంత లాభం రావాలంటే ఆ సంస్థల్లో పెట్టిన పెట్టుబడి రూ. 25,000 కోట్ల పైమాటే. రాష్ట్ర ప్రజల తరపున, మీ తల్లి, చెల్లి తరపున నేను ఒకటే అడుగుతున్నా.. సమాధానం చెప్పండి 2004లో మీరు ఆదాయ పన్ను శాఖకు చూపించిన మొత్తం ఆదాయం కేవలం కోటి 74 లక్షలు. పదేళ్ల కాలంలో వేల కోట్ల లాభాలు వచ్చే స్థాయికి మీ వ్యాపారాలు ఎలా పెరిగాయి? ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రి కొడుకు తండ్రి అధికారంలో ఉన్న ఐదేళ్లలోనే ఇన్ని వేల కోట్లు సంపాదించిన దాఖలాలు ఉన్నాయా? ఆ కిటుకు ఏంటో రాష్ట్ర ప్రజలకు చెప్పండి జగన్ గారూ! ఇది ప్రజా ధనం కాదా? మీ నాన్న ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆకాశం నుండి డబ్బులు పడ్డాయా? చంద్రబాబు గారు మాట్లాడితే తప్పు, పట్టాభి గారు ప్రశ్నిస్తే తప్పు, చివరికి మీ తల్లి, చెల్లి నిజాలు చెబితే అవి కూడా తప్పేనా? మీరు ఒక్కరే నిజాయితీ పరులా? చేతకాక దాడులు చేయించడం మానుకోండి. మీరు చేసిన అక్రమాలపై, మీ ఆదాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

2004లో మీరు ఆదాయ పన్ను శాఖకు చూపించిన ఆస్తి కేవలం కోటి 74 లక్షలు. మరి పదేళ్లలో వేల కోట్ల సామ్రాజ్యం ఎలా వెలిసింది? మీ చెల్లి షర్మిల గారికి కేవలం డివిడెండ్ (లాభం) రూపంలోనే రూ. 200 కోట్లు ఇచ్చారంటే, ఆ సంస్థలకు కనీసం రూ. 2,500 కోట్ల లాభం వచ్చి ఉండాలి. ఆ స్థాయి లాభం రావాలంటే మీరు పెట్టిన పెట్టుబడి రూ. 25,000 కోట్ల పైమాటే కదా. కోటి రూపాయల ఆస్తి ఉన్న వ్యక్తికి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? మీకు ఏమైనా లాటరీ తగిలిందా? లేక కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేశారా? రూ. 43,000 కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ వేసిన 11 చార్జిషీట్లు అక్షర సత్యాలని మీరే నిరూపిస్తున్నారు. మీ తల్లి విజయమ్మ గారు రాసిన లేఖ చదివితే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. "బిడ్డలందరూ సమానమే.. ఒక బిడ్డకు అన్యాయం జరుగుతుంటే తల్లిగా చూస్తూ ఊరుకోలేను" అని ఆమె ఆవేదన చెందారు.  తండ్రి వైఎస్సార్ బ్రతికి ఉన్నప్పుడు ఇచ్చిన మాటను తుంగలో తొక్కి, ఆస్తుల కోసం సొంత చెల్లిని రోడ్డున పడేసిన మీరు ఒక రాజకీయ నాయకుడా? తల్లి చెబుతున్నది తప్పా? చెల్లి అడుగుతున్నది తప్పా? సీబీఐ వేసిన చార్జిషీట్లు తప్పా? సుప్రీంకోర్టు జడ్జీలు మీ సంపాదనపై వ్యక్తం చేసిన సందేహాలు తప్పా? మీరు ఒక్కరే సత్యవంతులా అని ప్రశ్నించారు. రాజకీయంగా 11 సీట్లకు పరిమితమైన జగన్ రెడ్డిని, ఇప్పుడు 11 సీబీఐ చార్జిషీట్లు వెంటాడుతున్నాయి. 

జైలుకు వెళ్లక తప్పదనే భయంతోనే ఆయన మానసిక సమతుల్యత కోల్పోయి మాట్లాడుతున్నారు. వివేకానంద రెడ్డి గారు హత్యకు గురైన నాడు తెల్లవారుజామున మీ ఇంట్లో ఏం జరిగింది? రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ కల్లం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి కీలక నేతలతో కలిసి మీరు మేనిఫెస్టో ఫైనల్ చేస్తున్నట్లు కూర్చున్నారు కదా. సరిగ్గా అదే సమయంలో మీ శ్రీమతి భారతి గారి నుండి ఫోన్ రాగానే హడావుడిగా పైకి వెళ్లారు.. మళ్ళీ కిందకు వచ్చి వారితో ఏం మాట్లాడారు? ఆ ఫోన్ చేసింది ఎవరు? మీకు వచ్చిన సమాచారం ఏంటి? ఈ విషయాలను సీబీఐకి ఎందుకు చెప్పలేదు? మీ పార్టీ నేత "మా అన్నకు ఏమీ తెలియదు" అని బుకాయిస్తున్నారు. కానీ, అన్నీ వేళ్లు మీ వైపే చూపిస్తుంటే బాహ్య ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుందనుకుంటున్నారా? కన్నతల్లిని క్షోభపెట్టి, తోడబుట్టిన చెల్లిని ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ, బాబాయ్ కూతురు సునీతమ్మను కోర్టుల చుట్టూ తిప్పిస్తున్న మీకు మానవత్వం ఉందా? బాబాయ్ హత్య ఎవరి వల్ల జరిగిందో తెలిసి కూడా నిజాలు దాచిపెట్టి, సీబీఐ దర్యాప్తును అడుగడుగునా అడ్డుకున్న వ్యక్తి మీరు కాదా? అప్పట్లో సీబీఐని మన రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని చూసిన చరిత్ర మీది కాదా? అవినీతి కేసుల్లో 11 చార్జిషీట్లు ఎదుర్కొంటూ, 43 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపణలు ఉన్న వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుంది? సొంత కుటుంబ సభ్యులకే రక్షణ ఇవ్వలేని వాడు, రాష్ట్ర ప్రజలకు రక్షణ ఇస్తాడా? ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం సబబేనా అని ప్రతి ఒక్కరూ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలి. వివేకానందరెడ్డి గారి హత్యపై సీబీఐ దర్యాప్తు ఇంకా లోతుగా జరగాలని నేను కోరుతున్నాను. ఆ రోజు తెల్లవారుజామున జరిగిన ఫోన్ కాల్స్ మర్మం బయటపడితే, అసలు సూత్రధారి ఎవరో లోకానికి తెలుస్తుంది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, చట్టం నుండి తప్పించుకోలేరు.

Spotlight

Read More →