TTD విద్యాసంస్థలకు టెక్నాలజీ టచ్! రూ. 118.89 కోట్లతో... సీఎం చంద్రబాబు కొత్త ఆదేశాలు! Semi Ring Road: విశాఖకు కొత్త హంగులు... 60 కి.మీ.ల సెమీ రింగ్ రోడ్డుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Industrial Smart City: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! 10 వేల ఎకరాల్లో క్రిస్ సిటీ... ప్రత్యేకతలు ఇవే! Chandrababu Naidu: తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా వదిలేది లేదు! డ్రగ్స్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్..! Vizag Metro: మూడేళ్లలో అందుబాటులోకి విశాఖ మెట్రో..! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Praja Vedika: నేడు (16/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: ఏపీ రైతులకు తీపి కబురు... ఉచిత భూ సబ్‌డివిజన్ గడువు పొడిగింపు! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! TTD విద్యాసంస్థలకు టెక్నాలజీ టచ్! రూ. 118.89 కోట్లతో... సీఎం చంద్రబాబు కొత్త ఆదేశాలు! Semi Ring Road: విశాఖకు కొత్త హంగులు... 60 కి.మీ.ల సెమీ రింగ్ రోడ్డుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Industrial Smart City: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! 10 వేల ఎకరాల్లో క్రిస్ సిటీ... ప్రత్యేకతలు ఇవే! Chandrababu Naidu: తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా వదిలేది లేదు! డ్రగ్స్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్..! Vizag Metro: మూడేళ్లలో అందుబాటులోకి విశాఖ మెట్రో..! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Praja Vedika: నేడు (16/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: ఏపీ రైతులకు తీపి కబురు... ఉచిత భూ సబ్‌డివిజన్ గడువు పొడిగింపు! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం!

Aviation News: తెలంగాణలో మరో 2 విమానాశ్రయాలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!!

Telangana New Airports: తెలంగాణలో విమానయాన రంగానికి భారీ ఊతం లభించనుంది. వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్‌లలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు

Published : 2026-03-16 10:23:00

తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు గాలి మోటారు సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా వరంగల్ ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ రెండు విమానాశ్రయాలకు వచ్చే జూన్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముహూర్తం ఖరారు చేస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి పచ్చజెండా రావడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు.

వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం దాదాపు రూ. 850 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. చారిత్రక ఓరుగల్లు వైభవం ఉట్టిపడేలా ఈ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని నిర్మించబోతున్నారు. అటు ఆదిలాబాద్‌లో సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకోనుంది. దీనికోసం ఇప్పటికే 415 ఎకరాల భూమి సిద్ధంగా ఉండగా, మిగిలిన 700 ఎకరాల సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుల వల్ల ఉత్తర తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని నిపుణులు భావిస్తున్నారు.

ముఖ్యంగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేను 2.9 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. ఇక్కడ కేవలం పౌర విమానాలే కాకుండా, మిలిటరీ అవసరాలకు తగ్గట్టుగా రన్‌వేను డిజైన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక ప్రత్యేక డిఫెన్స్ సెంటర్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. విమానాల పార్కింగ్ విషయంలో కూడా రాయితీలు కల్పించడం ద్వారా ఎక్కువ విమాన సంస్థలను ఆకర్షించాలని చూస్తున్నారు. సుమారు రూ. 400 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ప్లాన్.

ప్రస్తుతం తెలంగాణ ప్రజలు విదేశాలకు వెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా కేవలం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌పైనే ఆధారపడుతున్నారు. మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తే శంషాబాద్‌పై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి విమాన ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇది రవాణా పరంగా రాష్ట్రానికి పెద్ద ఊరటనిచ్చే అంశం.

ఈ కొత్త ఎయిర్‌పోర్టుల రాకతో ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా, కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే సరుకు రవాణా పెరగడం వల్ల లాజిస్టిక్స్ రంగం కూడా పుంజుకుంటుంది. మొత్తానికి ఈ జూన్ నెలలో పడబోయే పునాది రాయి తెలంగాణ అభివృద్ధిలో కీలక మలుపు కానుంది.

Spotlight

Read More →