మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకల్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రులు కళావెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు వెయ్యి కిలోల భారీ కేకును కోసి శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా నేత కొమ్మారెడ్డి కిరణ్ అందించిన బడ్డీ దుకాణాల్ని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన చిరువ్యాపారులకు అందజేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ లోను లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలంగాణ తెదేపా నేతలతో పాటు ఏపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి