Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... Chandrababu: పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై చంద్రబాబు సంతకం! రూ.56.39 కోట్ల - 7,074 మంది లబ్ధిదారులకు! Praja Vedika: వైసీపీ నాయకుల కనుసన్నల్లో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం.. జేసీబీలతో ఇంటి పునాదుల ధ్వంసం!

AP Group1 Exam: గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. సీఎస్‌ను నిలదీసిన ధర్మాసనం.!

AP Group1 Exam: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాల అమలు అంశంపై బుధవారం రాష్ట్ర హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ స్వయంగా హాజరయ్యారు.

Published : 2026-02-25 15:11:00
  • మా ఆదేశాలు అమలు చేస్తారా లేదా? సీఎస్ విజయానంద్‌ను సూటిగా నిలదీసిన హైకోర్టు..
     
  • 15 రోజుల గడువు.. ఆపై ఉపేక్షించేది లేదు: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్ లైన్!

AP Group1 Exam: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాల అమలు అంశంపై బుధవారం రాష్ట్ర హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ స్వయంగా హాజరయ్యారు. గ్రూప్-1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను నాన్ ఫోకల్ పోస్టులకు మార్చాలని గతంలోనే హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ, దాని అమలులో జరుగుతున్న జాప్యంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.

విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలను వినిపించారు. అసలు సర్వీస్ నిబంధనల్లో లేదా చట్టంలో 'ఫోకల్', 'నాన్ ఫోకల్' అనే పదాలకు సంబంధించి ఎక్కడా సరైన వివరణ లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి గతంలోనే ఒక పిటిషన్ దాఖలు చేశామని, ఈ సాంకేతిక అంశాల వల్లే ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతోందని ఏజీ వివరించే ప్రయత్నం చేశారు. అయితే, కోర్టు మాత్రం ఈ వాదనలతో సంతృప్తి చెందలేదు.

తీర్పు ఇచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన హైకోర్టు, సీఎస్ విజయానంద్‌ను నేరుగా కొన్ని ప్రశ్నలు వేసింది. "మా ఆదేశాలను అమలు చేస్తారా లేదా? ఒకవేళ చేస్తే ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పండి" అంటూ న్యాయస్థానం నిలదీసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం అంటే న్యాయవ్యవస్థను అగౌరవపరచడమేనని, ఇలాంటి ధోరణి సరికాదని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ పెద్దలు కోర్టు ఆదేశాలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది.

కోర్టు ప్రశ్నలకు సీఎస్ విజయానంద్ వినయంగా సమాధానమిస్తూ, న్యాయస్థానం పట్ల ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తామని, అయితే దీనికి కొంత 'రీజనబుల్ టైమ్'  అవసరమవుతుందని ఆయన కోర్టుకు విన్నవించారు. క్షేత్రస్థాయిలో ఉన్న కొన్ని ఇబ్బందులను అధిగమించి, అభ్యర్థుల పోస్టింగ్‌ల మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి కనీసం 15 రోజుల సమయం కావాలని సీఎస్ విజయానంద్ హైకోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ విన్నపాన్ని పరిశీలించిన న్యాయస్థానం, ఇచ్చిన గడువులోగా ఆదేశాలను అమలు చేసి తీరాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వివాదం ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో, రాబోయే రెండు వారాల్లో ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా  మారనుంది.

Spotlight

Read More →