PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం!

AP IT Policy: సంక్షేమం + సాంకేతికత.. ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

అమరావతిలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఏపీని క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా మారుస్తామని, ఏఐ, డేటా సెంటర్లతో పెనుమార్పులు రాబోతున్నాయని ప్రకటించారు. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాల పురోగతిని వివరిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Published : 2026-02-09 12:43:00

క్వాంటం విప్లవం - అమరావతి నుంచే ప్రపంచానికి కంప్యూటర్లు.

సంక్షేమ పథకాలు - కోట్లలో లబ్ధిదారులు.. వేల కోట్ల నిధులు.

పాలనా వేగం - కలెక్టర్ల సమీక్షలతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని  అభివృద్ధి  సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలబెట్టడమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన దిశా నిర్దేశం చేశారు. కేవలం సంక్షేమ పథకాల అమలుకే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన  తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  రంగాల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ మార్పులను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందంజలో ఉంటుందని చెబుతూ, అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్‌కు శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో అమరావతిలోనే క్వాంటం కంప్యూటర్ల తయారీ ప్రారంభమవుతుందని, తద్వారా ప్రపంచ దేశాలకు క్వాంటం పరిజ్ఞానాన్ని మనమే అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డేటా సెంటర్లు, ఏఐ నెట్‌వర్క్ లతో రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పాలన గాడి తప్పిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను ప్రక్షాళన చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాల వివరాలను ఆయన వెల్లడించారు..

 తల్లికి వందనం: ఈ పథకం కింద సుమారు 67 లక్షల మంది లబ్ధిదారులకు రూ.10,090 కోట్లు అందజేసినట్లు తెలిపారు.

 స్త్రీశక్తి: ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ద్వారా ఇప్పటివరకు 4.29 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారు.

 అన్నదాత సుఖీభవ: 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,310 కోట్లను నేరుగా జమ చేశాం.

ఎన్టీఆర్ భరోసా: పింఛన్ల రూపంలో రూ.58,654 కోట్ల ఆర్థిక చేయూతను పేదలకు అందించామని, ప్రతినెలా 'పేదల సేవలో' పేరుతో ఈ పంపిణీ జరుగుతోందని వివరించారు.

పాలనలో వేగం పెంచేందుకు ప్రతి నెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు, ప్రతి మూడు నెలలకోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. "కేవలం కొంతమంది మంత్రులు లేదా అధికారులు కష్టపడితే సరిపోదు, ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసినప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయి" అని ఆయన హితవు పలికారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయంతో పనిచేస్తూ పథకాలను అట్టడుగు వర్గాలకు చేరవేయాలని ఆదేశించారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రూ.10 వేల కోట్లను రైతులకు చెల్లించామని సీఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాయలసీమను ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, సాగునీటి సరఫరా ద్వారా కరువును పారద్రోలుతామని హామీ ఇచ్చారు. విద్యుత్ రంగంలో సంస్కరణల ద్వారా గతంలో ఉన్న ట్రూ అప్ ఛార్జీల భారాన్ని తగ్గించి, 'ట్రూడౌన్' చేసే స్థాయికి చేరుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు.

సమాజంలో పెరుగుతున్న ఆత్మహత్యల పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటానికి గల కారణాలను శాస్త్రీయంగా ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. తప్పులను సరిదిద్దుకుంటూ, పటిష్టమైన పాలసీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →