కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు! Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌కు అరుదైన గౌరవం.. అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం! AP welfare news: ఏపీ డ్వాక్రా మహిళలకు భారీ ఆర్థిక సాయం... పూర్తి సమాచారం మీ కోసమే!! రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఈ జిల్లాల్లో ఇక నుంచి కొత్తగా.! పోషక విలువలు పెంచేందుకు.. Vandebharat Update: నర్సాపురం - చెన్నై వందేభారత్ ప్రారంభం వేళ కొత్త ట్విస్ట్.. తిరుపతి ఇక కొత్తగా.! AP Govt: విత్తనాలు కొనేముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..! రైతులకు కీలక సూచనలు! Court Shock: ఏయూ మాజీ వీసీకి జైలుశిక్ష! కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంపై..! Chandrababu: అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సమీక్ష! రూపాయి పతనం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! ఈ క్రమంలో బ్యాంకు రుణాలు.. AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..! కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు! Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌కు అరుదైన గౌరవం.. అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం! AP welfare news: ఏపీ డ్వాక్రా మహిళలకు భారీ ఆర్థిక సాయం... పూర్తి సమాచారం మీ కోసమే!! రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఈ జిల్లాల్లో ఇక నుంచి కొత్తగా.! పోషక విలువలు పెంచేందుకు.. Vandebharat Update: నర్సాపురం - చెన్నై వందేభారత్ ప్రారంభం వేళ కొత్త ట్విస్ట్.. తిరుపతి ఇక కొత్తగా.! AP Govt: విత్తనాలు కొనేముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..! రైతులకు కీలక సూచనలు! Court Shock: ఏయూ మాజీ వీసీకి జైలుశిక్ష! కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంపై..! Chandrababu: అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సమీక్ష! రూపాయి పతనం.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు! ఈ క్రమంలో బ్యాంకు రుణాలు.. AP CM: నెల్లూరులో లేడీడాన్స్ షాక్…! గత పాలనలో భద్రత కుప్పకూలిందని విమర్శించిన సీఎం చంద్రబాబు..!

Chandrababu: అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సమీక్ష!

2025-12-07 07:06:00

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమై రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పనితీరు అంశాలు పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ—తాజాగా నిర్వహించిన వన్-టూ-వన్ భేటీల తర్వాత ఎక్కువ మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగైందని తెలిపారు. అయితే 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రమే ఇంకా మెరుగుపడాలని స్పష్టంగా చెప్పారు.

ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సర్వే రిపోర్ట్లు తెప్పించుకుంటున్నానని, వాటిని ఆధారంగా చేసుకుని సూచనలు ఇస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. ప్రజలతో అనుసంధానం, సమస్యల పరిష్కారం, స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా క్రమశిక్షణతో పనిచేయాలని సూచిస్తూ, బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ ఎలా నిస్వార్థంగా పనిచేస్తుందో, అలాంటి నిబద్ధత టీడీపీ క్యాడర్‌లో కూడా ఉండాలని నేతలకు సూచించారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు స్పందించారు. జగన్ ‘అర్థం పర్థం లేకుండా మాట్లాడే’ వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజలకు ఏమి మంచిదో వారికి స్పష్టంగా తెలుస్తుందని, జగన్ చేసిన అనవసర వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. ముఖ్యంగా తిరుమల పరకామణి కేసులో జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల పరకామణి ఘటనపై మాట్లాడుతూ— రూ.70 వేల దొంగతనం చేసిన వ్యక్తి రూ.14 కోట్లు ఆస్తి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడంటే నేపథ్యంలో ఉన్న అక్రమాలు ఎంత భారీగా ఉన్నాయో అర్థమవుతుందని చంద్రబాబు అన్నారు. నేరస్తులను ప్రోత్సహించడం, భక్తుల భావాలను దెబ్బతీయడం వైసీపీకి సహజమైందని మండిపడ్డారు. ఏ నేరానికి అయినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఇక నెల్లూరు ‘లేడీ డాన్ల’ వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు, వైసీపీ హయాంలో మాఫియా చాపకింద నీరులా పెరిగిందని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారి 'తోకలు కట్ చేస్తాం' అని హెచ్చరించారు. అమరావతి విషయంలో కూడా కొంతమంది శాంతి భద్రతలు క్రమంగా సాధారణం అవుతుండటం తట్టుకోలేక రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్న వాస్తవాన్ని తెలంగాణలో అధికారంలో ఉన్న నాయకులు కూడా అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు.

Spotlight

Read More →