Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Nara Lokesh: విశాఖలో నారా లోకేష్ సందడి... విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన శ్రేణులు! APSRTC: అమరావతిలో 165 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్స్..! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! AP Assembly: ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు! పిల్లల సంక్షేమం అందరికీ ఇస్తాం! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం!

Bill Gates Amaravati Visit: ఈ నెల 16న అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన.. పూర్తి వివరాలు ఇవే!

Bill Gates Amaravati Visit: ఏపీ రాజధాని అమరావతికి బిల్ గేట్స్ రాక ఖరారైంది. ఈ నెల 16న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ గవర్నెన్స్ విధానాలను పరిశీలించనున్నారు..

Published : 2026-02-14 10:27:00

అమరావతికి టెక్ దిగ్గజం…

ఈ నెల 16న ఏపీకి బిల్ గేట్స్ రాక…

ఏపీ అభివృద్ధిలో మైలురాయి..

ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 16వ తేదీన  అమరావతికి  రానున్నారు ఈ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు  గొప్ప దాత అయిన బిల్ గేట్స్ రాక కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయన పర్యటన వల్ల రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అమరావతికి చేరుకున్న తర్వాత బిల్ గేట్స్ గారు పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న సాంకేతిక విప్లవం గురించి ఆయన స్వయంగా తెలుసుకోనున్నారు. ముఖ్యమంత్రితో కలిసి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల మీద చర్చలు జరుపుతారు అని సమాచారం. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలను, డిజిటల్ గవర్నెన్స్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలిస్తారు. సాంకేతికతను సామాన్య ప్రజలకు ఏ విధంగా చేరువ చేస్తున్నారో ఆయనకు వివరించనున్నారు.

ఈ పర్యటనలో అత్యంత ప్రధానమైన ఘట్టం RTGS (Real Time Governance Society) కేంద్రాన్ని సందర్శించడం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పనిని, సంక్షేమ పథకాల అమలును ఒకే చోటు నుండి పర్యవేక్షించే ఈ కేంద్రాన్ని చూసి ఆయన అభిప్రాయాలను పంచుకుంటారు. సాంకేతికతను ఉపయోగించి పాలనను ఎలా పారదర్శకంగా మార్చవచ్చో RTGS ద్వారా తెలుసుకోవచ్చు. బిల్ గేట్స్ వంటి టెక్ దిగ్గజం ఈ కేంద్రాన్ని సందర్శించడం మన రాష్ట్ర సాంకేతిక నైపుణ్యానికి ఒక నిదర్శనం.

సాంకేతికతతో పాటు సామాజిక అంశాల మీద కూడా బిల్ గేట్స్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఆయనకు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా మన రాష్ట్రంలో ఆరోగ్యం, వ్యవసాయం మరియు పారిశుధ్యం వంటి రంగాలలో జరుగుతున్న మార్పులను ఆయన అడిగి తెలుసుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యం  పోషకాహార లోపం తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయనకు వివరించనున్నారు.

దీనివల్ల భవిష్యత్తులో గేట్స్ ఫౌండేషన్ నుండి మన రాష్ట్రానికి మరింత సహకారం అందే అవకాశం ఉంది.
బిల్ గేట్స్ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప శుభపరిణామం. ఇది కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతికి దొరికిన ఒక పెద్ద ప్రోత్సాహం. ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు మన రాష్ట్ర ఐటి రంగంలో  పాలనా యంత్రాంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయని అందరూ ఆశిస్తున్నారు. అమరావతి వీధులు ఈ ప్రపంచ స్థాయి అతిథికి ఘనస్వాగతం పలకడానికి ముస్తాబ్ అవుతున్నాయి.

Spotlight

Read More →