Kavuri SambasivaRao: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కన్నుమూత! నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి! Quantum Valley : 9 నెలల్లో సిద్ధం కానున్న అమరావతి క్వాంటం కంప్యూటర్ సెంటర్! Praja Vedika: నేడు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! CRDA: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం... రూ. 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు! ఎక్కడంటే... Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Kavuri SambasivaRao: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కన్నుమూత! నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి! Quantum Valley : 9 నెలల్లో సిద్ధం కానున్న అమరావతి క్వాంటం కంప్యూటర్ సెంటర్! Praja Vedika: నేడు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! CRDA: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం... రూ. 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు! ఎక్కడంటే... Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు!

AP Women Empowerment: చంద్రబాబు సమక్షంలో చారిత్రాత్మక ఒప్పందాలు.. మహిళా సంఘాలకు ప్రపంచ స్థాయి శిక్షణ!

AP Women Empowerment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో సెర్ప్, మెప్మా సంస్థలు ఐఎస్‌బీ, ఐఐఎం విశాఖపట్నం, సీఎస్ఐఆర్ వంటి దిగ్గజ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నాయి..

Published : 2026-03-08 18:44:00

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో శనివారం సెర్ప్  మెప్మా సంస్థలు పలు ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలకమైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మహిళలకు కేవలం బ్యాంక్ రుణాలు ఇప్పించడమే కాకుండా, వారిని నైపుణ్యం కలిగిన పారిశ్రామికవేత్తలుగా మార్చడం. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళా శక్తిని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా అత్యున్నత సంస్థల సహకారం తీసుకోవడం శుభపరిణామమని స్పష్టం చేశారు.

ఈ ఒప్పందాల్లో భాగంగా సముద్రపు నాచు (సీవీడ్) సాగు  దాని ద్వారా రకరకాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లోని మహిళలకు సరికొత్త ఉపాధి మార్గాలను చూపేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా మొదటి విడతలో సుమారు 500 మంది మహిళలకు సముద్రపు నాచు పెంపకంలో అధునాతన శాస్త్రీయ శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా, ఈ నాచు నుంచి రకరకాల వస్తువులను తయారు చేసే సాంకేతికతను అందించేందుకు సీఎస్ఐఆర్ సంస్థ ముందుకు వచ్చింది. దీనివల్ల మహిళలు కేవలం ముడి సరుకు అమ్మడమే కాకుండా, సొంతంగా బ్రాండెడ్ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో నేరుగా విక్రయించే వీలు కలుగుతుంది.

మహిళల్లో దాగి ఉన్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసి, వారిని సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దేందుకు ఎక్స్‌ఎల్‌ఆర్ఐ  ఐఎస్‌బీ వంటి అగ్రశ్రేణి మేనేజ్మెంట్ సంస్థలు రంగంలోకి దిగాయి. మహిళలు తాము పొదుపు చేసిన మొత్తాన్ని వృధా చేయకుండా, దానితో లాభదాయకమైన చిన్నతరహా పరిశ్రమలు ఎలా స్థాపించాలో ఐఎస్‌బీ సంస్థ మెళకువలను నేర్పించనుంది. అలాగే కేరళకు చెందిన ప్రసిద్ధ అమృత వర్సిటీ పీఠంతో కుదిరిన ఒప్పందం ద్వారా వివిధ రకాల వినూత్న ఉత్పత్తుల తయారీలో మహిళలకు శిక్షణ లభిస్తుంది. 

దీనివల్ల మన రాష్ట్ర మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు లభించేలా శిక్షణ కార్యక్రమాలను రూపొందించారు. ఉత్పత్తుల తయారీ ఎంత ముఖ్యమో, వాటిని సరైన ధరలకు విక్రయించడం కూడా అంతకంటే ముఖ్యం కాబట్టి ప్రభుత్వం మార్కెటింగ్ రంగంలో కీలక ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యంగా చేనేత వస్త్రాలు  ఇతర ఫ్యాబ్రిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఆప్కో సంస్థతో సెర్ప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల గ్రామీణ చేనేత కార్మికుల కుటుంబాలకు మరియు మహిళా సంఘాలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది.

 మరోవైపు, నేటి ఆధునిక డిజిటల్ యుగానికి అనుగుణంగా మహిళా సంఘాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఐఐఎం విశాఖపట్నం తనవంతు సహకారం అందించనుంది. డిజిటల్ కామర్స్ రంగంలో అవగాహన కల్పించడం ద్వారా ఎఫ్‌పీవో ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడేలా ఈ సంస్థ కృషి చేస్తుంది.ఈ ఒప్పందాల ద్వారా రాబోయే రోజుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుందని నిపుణులు భావిస్తున్నారు.

Spotlight

Read More →