Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Ring Road: ఏపీలో ఆ జిల్లాకు రింగ్ రోడ్డు! మంత్రి కీలక ప్రకటన... రూపురేఖలు మారబోతున్నాయి! Praja Vedika: నేడు (20/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి! ఆరు వరుసలుగా.. రూ.13వేల కోట్లతో... బెంగళూరుకు 5 గంటల్లో వెళ్లొచ్చు! 2 Telugu States: రూ. 1,083 కోట్లతో దేశంలోనే తొలి కేబుల్ వంతెన! వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు! Aadhaar card : త్వరలో ఆధార్ కార్డులో భారీ మార్పులు.. కేవలం ఫొటో, QR కోడ్ మాత్రమే! కడప రచ్చబండలో సీఎం చంద్రబాబు ప్రసంగం! సూపర్ సిక్స్‌ సూపర్ హిట్! High Court: మద్యం కుంభకోణం కేసు! హైకోర్టు కీలక తీర్పు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!!

Industrial Sector: పారిశ్రామిక రంగానికి బంపర్ ఆఫర్..! రూ.1,030 కోట్ల ప్రోత్సాహకాలు విడుదలకు గ్రీన్ సిగ్నల్..!

2025-10-24 06:35:00
చాక్లెట్ పరిశ్రమ పెట్టండి.. అబుదాబిలో సీఎం చంద్రబాబు వన్ టూ వన్ సమావేశాలు.! ఆతిథ్య రంగంలోనూ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన పారిశ్రామిక ప్రోత్సాహకాలను మళ్లీ విడుదల చేస్తూ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ), భారీ మరియు మెగా యూనిట్లకు ఆర్థిక బలాన్నివ్వాలని నిర్ణయించింది. మొత్తం రూ.1,030.95 కోట్ల ప్రోత్సాహకాలను ఈసారి విడుదల చేయబోతోంది. ఇందులో తొలి విడతగా 2,536 ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రూ.275.47 కోట్లు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీపావళి సందర్భంగా ఈ నిర్ణయం పారిశ్రామికవేత్తలకు గిఫ్ట్‌లా మారింది. గత ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలు నిలిపివేయడంతో అనేక పరిశ్రమలు మూతపడే దశకు చేరగా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆర్థిక చైతన్యాన్ని నింపేందుకు ముందడుగు వేసింది.

DGCA: విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై కొత్త నిబంధనలు!

ఇక ‘జగనన్న బడుగు వికాసం’ పథకం కింద గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బస్సులు మంజూరు చేసి, వాటిని ఆర్టీసీ లో నడిపేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ పథకంలో రూ.100 కోట్ల నకిలీ ఇన్వాయిస్‌ కుంభకోణం జరిగిందని దళిత్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వం తక్షణమే చర్యలు ప్రారంభించింది. ఈ పథకం కింద మంజూరైన 426 బస్సులకు సంబంధించిన ప్రోత్సాహకాల వివరాలు సేకరించాలని పరిశ్రమల శాఖ డీలర్లను ఆదేశించింది. ఇప్పటివరకు 310 బస్సులకు సంబంధించిన వివరాలు అందగా, వాటికి ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. మిగతా 116 బస్సుల వివరాలు అందిన తర్వాత మరో రూ.14 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం కఠిన నిఘా పెట్టింది.

Singapore: ఆ పని చేయకపోతే శాశ్వత నివాస హోదా రద్దు! డిసెంబర్ నుండి..

ఇదే సమయంలో టెక్స్‌టైల్ పరిశ్రమలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు చెల్లిస్తే కొంత ఊరట లభిస్తుందని పరిశ్రమల వర్గాలు సూచించాయి. ప్రభుత్వం ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, కొన్ని నిబంధనలను సడలించింది. ఆరేళ్లు పూర్తయిన ఎంఎస్‌ఎంఈలు, ఎనిమిదేళ్లుగా ఉత్పత్తిలో ఉన్న భారీ మరియు మెగా యూనిట్లకు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. పరిశ్రమలు ప్రస్తుతం మూతపడినా, యాజమాన్యం మారినా ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. ఈ నిర్ణయం టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కొత్త జీవం పోయనుంది.

Delhi Pollution: ఢిల్లీని మళ్లీ కమ్మేసిన స్మాగ్‌.. వాయు కాలుష్యం పెరిగిపోవడంతో GRAP-2 అమల్లోకి!

అదనంగా, గతంలో బడుగు వికాసం పథకం కింద ఇచ్చిన బస్సులకు సంబంధించిన రిబేట్/డిస్కౌంట్ వివరాలను పరిశీలించి, వాటికి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీలర్ల నుంచి పొందిన డిస్కౌంట్ మొత్తాన్ని భవిష్యత్ చెల్లింపుల్లో సర్దుబాటు చేయనున్నారు. స్టేట్ లెవెల్ కమిటీ ఈ కేసులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. అలాగే, ఆడిట్ శాఖ నుంచి క్లియర్ అయిన యూనిట్లకు మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. ఎన్వోసీ లేకుండా బ్యాంకు ఖాతాలను మార్చిన యూనిట్లకు కూడా సడలింపు ఇచ్చి, ప్రోత్సాహకాలు అందించే మార్గం సుగమం చేశారు. మొత్తం మీద ఈ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం మళ్లీ ఉత్సాహభరిత దశలోకి ప్రవేశించనుందని పరిశ్రమల వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Indian Techie: 15 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి.. అమెరికా టెక్ ఇంజినీర్ పోస్ట్ వైరల్!
Venezuelan plane: టేకాఫ్ నుంచి కూలిపోయే వరకు.. వైరల్ అవుతున్న వెనిజులా విమాన ప్రమాదం!
WhatsApp: వాట్సాప్‌లో కొత్త మార్పు! ఇక ఫోన్ నంబర్ లేకుండానే..
Gold Prices: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం ప్రధాన కారణం!
Tourism: భారతీయులు వీసా లేకుండా వెళ్లగలిగే ఆసియా దేశాలు! కానీ ఆ వీసా ఉండాలి!
Metro: మెట్రోలో నిషేధిత వస్తువులు.. వాటికి కూడా నో..! DMRC కఠిన భద్రతా చర్యలు..!

Spotlight

Read More →