వైసీపీ సీనియర్ నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూటమి సర్కార్ మరో బిగ్ షాక్ ఇచ్చింది. ద్వారంపూడి కుటుంబానికి చెందిన మరో రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో ద్వారంపూడి కుటుంబానికి చెందిన రొయ్యలశుద్ధి పరిశ్రమలో ఉల్లంఘనలు గుర్తించి ఈ ఏడాది ఆగస్టు 6న అధికారులు దానిని మూసివేయించారు. తాజాగా, ప్రత్తిపాడు మండలం లంపకలోవ సమీపంలోని వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ పేరిట ఉన్న రెండో యూనిట్‌ను మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్ కార్యాలయం నిన్న ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పరిశ్రమలో అతిక్రమణలు గుర్తించారు. ఆ అతిక్రమణలను సరిదిద్దుకోవాలని పీసీబీ నోటీసులు జారీ చేసినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఉత్పత్తి నిలిపివేయమని (క్లోజింగ్ ఆర్డర్) ఉత్తర్వులు ఇచ్చారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?
ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!
విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!
బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!
మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: