సోషల్ మీడియాలో మహిళలను అసభ్యకరంగా దూషిస్తే కూటమి ప్రభుత్వం ఊరుకోదని ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ రాష్ట్ర ఛైర్పర్సన్ కావలి గ్రీష్మ అన్నారు. గుంటూరులోని జిల్లా మహిళా ప్రగతి ప్రాంగణంలోని రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఛైర్పర్సన్గా గ్రీష్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె తల్లి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ కె. ప్రతిభాభారతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రీష్మ మీడియాతో మాట్లాడుతూ ఈ పదవిలో ఉన్నంత కాలం మహిళల అభ్యున్నతికి, ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టుల వల్ల ఒక మహిళగా ఎంతో ఆవేదన అనుభవించానని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని.. చంద్రబాబు, లోకేశైల అండతో తట్టుకుని నిలబడ్డానన్నారు. వైకాపా నేతల అసభ్యకర రాతలకు బుద్ధి చెప్పేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తనకు పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. టైలరింగ్, బ్యుటీషియన్ కోర్సుల శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు ఆమె ధ్రువపత్రాలు అందజేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? మీకు ఎంత జీతం వస్తుంది?
రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదు! ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే!
శుభవార్త: మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న కూటమి సర్కార్! లక్షల మందికి ఊరట.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: