రహదారుల నిర్వహణపై వినూత్నంగా ఆలోచించానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగించే యోచన చేస్తున్నట్టు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. “ఐదేళ్లలో రాష్ట్రంలో రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయి. రోడ్ల మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి. జనవరిలో పండుగల సందర్భంగా రాష్ట్రానికి ఎవరైనా వస్తే మెరుగైన రహదారులు కనిపించాలనే ఉద్దేశంతో.. దృఢ సంకల్పంతో ముందుకుపోతున్నాం. మన దగ్గర డబ్బుల్లేవు.. ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో ఉన్న రోడ్ల నిర్వహణ జాతీయ రహదారుల మాదిరిగా టెండరు పిలిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇస్తాం. గ్రామం నుంచి మండల కేంద్రానికి ఎక్కడా టోల్ ఫీజు ఉండదు. మిగిలిన చోట్ల టోల్ ఉంటుంది.. అది కూడా బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే యూజర్ ఛార్జి ఉటుంది. ఈ విధానం బాగుంటుందని సభ్యులంతా భావిస్తే ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాల్లో అమలు చేద్దాం” అని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: