ఓ ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యం వేధింపులతో తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు ఆమె తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చిలకలపాడుకు చెందిన చెక్కపల్లి శ్రీనివాస్కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె వెన్నెల శ్రీషిర్డీసాయి విద్యానికేతన్లో పదోతరగతి చదువుతోంది. దసరా సెలవులు ఇవ్వకపోవడంతో గత నెల 6న కలెక్టర్కు వెన్నెల ఫోన్ చేసి సెలవులివ్వకుండా తరగతులు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఆ మర్నాటి నుంచి పాఠశాలకు సెలవులు ప్రకటించి 14న తిరిగి తెరిచారు. వెన్నెలను స్కూలు డైరెక్టర్ ఉమారాణి పిలిచి.. కలెక్టర్కు ఎందుకు ఫిర్యాదు చేశావని ప్రశ్నించడంతో పాటు పదో తరగతి ఫెయిల్ చేస్తామని బెదిరించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో వెన్నెల 18న ఇంట్లో ఉరి వేసుకొని మృతిచెందింది. యాజమాన్యం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు విలపించారు.
కాన్వాయ్కు అడ్డుపడి వేడుకుంటూ
శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లేందుకు వెన్నెల తల్లిదండ్రులు ప్రయత్నించారు. వినతిపత్రం అందిస్తూ కాన్వాన్కు అడ్డుపడి న్యాయం చేయాలని వేడుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఇక్కడికే వస్తానని.. సమస్య పరిష్కరిస్తానని ఆయన వెల్లడించారు. దీంతో వారు అక్కడే వేచి ఉన్నారు. సాయంత్రం వచ్చిన ఉప ముఖ్యమంత్రి వారితో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. అండగా ఉంటానని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: