Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !! Minister Savitha: 104 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు! Gummadi Sandhya Rani: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా వీధులు శుభ్రం చేసిన మంత్రి సంధ్యారాణి! TDP: మహిళా సాధికారతలో టీడీపీ చారిత్రాత్మక అడుగు.. 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో కొత్త దిశ! New Pensions: ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్... కొత్తగా 5,606 మందికి పెన్షన్లు!! Palla Srinivasa Rao: గాజువాక సమస్యలపై దిశా సమావేశంలో పల్లా! Operation Sindoor: శత్రువుల గుండెల్లో వణుకు.. ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం- ఆర్మీ చీఫ్! Chandrababu: వైసీపీపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ”గా ప్రజల్లో చర్చ! Double Decker Flyover: డబుల్ డెక్ర్ ఫ్లై ఓవర్‌పై కీలక అప్డేట్... రూ.1,000 కోట్లతో ఈ రూట్లో ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!! Pawan Kalyan: తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్! Green Energy: స్కూళ్లు, హాస్టళ్లకు సోలార్ పవర్! 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !!

నాకు ప్రాణ హాని ఉంది... సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్న

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కా 420 అని.. జైలుకు వెళ్లడానికే ఆయన భీమిల

Published : 2024-01-30 17:05:00

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పక్కా 420 అని.. జైలుకు వెళ్లడానికే ఆయన భీమిలిలో ‘సిద్ధం’ సభను నిర్వహించారని అన్నారు. మరో మూడు నెలల్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు.

‘సిద్ధం’ సభలో జగన్ ‘శిలువ’ మీద క్యాట్ వాక్ చేశారని ఎద్దేవా చేశారు. జగన్ ఓ సీఎంలా వ్యవహరించడం లేదని, పగటి వేషగాడిలా ప్రవర్తిస్తున్నాడని, తాను డబ్బా కొట్టినట్టు జగన్ అర్జునుడు ఏం కాదని.. సిద్ధం సభలో చెప్పిందంతా సోదేనని రాజమహేంద్రవరం పదాన్ని సైతం జగన్ స్పష్టంగా ఉచ్ఛరించలేకపోయారని విమర్శించారు. 

లండన్‌లో లేదా మరెక్కడైనా దాక్కున్నా.. జగన్‌ని ఏమాత్రం విడిచిపెట్టమని హెచ్చరించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. జగన్ తిన్న డబ్బులన్నింటినీ కక్కిస్తామని ఉద్ఘాటించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

గాదిరాజు ప్యాలెస్ మీద కూడా కన్నేశారని.. భారతికి నచ్చితే ఆ ప్యాలెజ్‌ని దొబ్బేస్తారా? అని అయ్యన్న పాత్రుడు నిలదీశారు. ప్రజల పాస్ బుక్ మీద, ఆఖరికి సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో ఎందుకు ఉందని ప్రశ్నించారు. భూముల రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఒరిజినల్ పేపర్స్ మీ దగ్గర పెట్టుకోవడం ఏంటి? అమ్ముకోవడానికా? అని అడిగారు. రాత్రుల సమయంలో తనని చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని అయ్యన్న కుండబద్దలు కొట్టారు. అందుకే గన్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నానన్నారు.

అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం తన తనయుడు దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని తిరిగి ప్రశ్నించారు. అనకాపల్లిలో వైసీపీ నేతలు 1200 ఎకరాలకు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని.. తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఈ భూ కుంభకోణాలపై సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరిన ఆయన.. న్యాయం కోసం న్యాయస్థానానికి కూడా వెళ్తానన్నారు.

98 శాతం హామీలు ఎక్కడ అమలు చేశారు జగన్? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, సీపీఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం.. వంటివి ఏమీ అమలు చేయలేదన్నారు. అమరావతి రాజధాని లేదని.. మూడు రాజధానులు కూడా లేవన్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక దొంగ నాకొడుకని, అతడు చెప్పేవన్నీ అబద్ధాలే విరుచుకుపడ్డారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →