Seed Axis Road: అమరావతి మాస్టర్ ప్లాన్ అమల్లోకి...! వేగంగా సాగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు! Predator Drone Deal: భారత్–అమెరికా ఒప్పందాలపై రాహుల్ ఫైర్…! వివరణ ఇవ్వాలి…! Nimmala Rama Naidu: శివరాత్రి పూట శ్రమదానం...! స్మశాన వాటికలో మంత్రి నిమ్మల రామానాయుడు సేవ! AI Development: విశాఖపట్నంకు గ్లోబల్ గుర్తింపు..! దేశంలోనే తొలి AI డేటా నగరం ఇక్కడే...! Bill Gates: ఏపీకి బిల్ గేట్స్ రాక..! అమరావతిలో గ్లోబల్ మీటింగ్..! PM Rahat Scheme: పీఎం రాహత్ స్కీమ్... రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఉచిత వైద్యం! Tech Hub: ఏపీలో మరో బెంగళూరు..! క్వాంటం వ్యాలీ నుండి డేటా సెంటర్ల వరకు.. టెక్ విప్లవం! APGovernment: మహాశివరాత్రికి డబుల్ హాలిడే…! అధికారిక ఉత్తర్వులు జారీ! Free Electricity: ఏపీ బడ్జెట్‌లో నేతన్నలకు పెద్దపీట..! ఉచిత విద్యుత్ అమలుకు ముహూర్తం ఖరారు! Free Bus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నుండి వారికి కూడా.. ఫ్రీ బస్సు! Seed Axis Road: అమరావతి మాస్టర్ ప్లాన్ అమల్లోకి...! వేగంగా సాగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు! Predator Drone Deal: భారత్–అమెరికా ఒప్పందాలపై రాహుల్ ఫైర్…! వివరణ ఇవ్వాలి…! Nimmala Rama Naidu: శివరాత్రి పూట శ్రమదానం...! స్మశాన వాటికలో మంత్రి నిమ్మల రామానాయుడు సేవ! AI Development: విశాఖపట్నంకు గ్లోబల్ గుర్తింపు..! దేశంలోనే తొలి AI డేటా నగరం ఇక్కడే...! Bill Gates: ఏపీకి బిల్ గేట్స్ రాక..! అమరావతిలో గ్లోబల్ మీటింగ్..! PM Rahat Scheme: పీఎం రాహత్ స్కీమ్... రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఉచిత వైద్యం! Tech Hub: ఏపీలో మరో బెంగళూరు..! క్వాంటం వ్యాలీ నుండి డేటా సెంటర్ల వరకు.. టెక్ విప్లవం! APGovernment: మహాశివరాత్రికి డబుల్ హాలిడే…! అధికారిక ఉత్తర్వులు జారీ! Free Electricity: ఏపీ బడ్జెట్‌లో నేతన్నలకు పెద్దపీట..! ఉచిత విద్యుత్ అమలుకు ముహూర్తం ఖరారు! Free Bus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నుండి వారికి కూడా.. ఫ్రీ బస్సు!

ఈ సంక్రాంతి నుంచి కొత్త కాంత్రి ప్రజల జీవితాల్లో వచ్చేలా మన అడుగులు పడాలని ఆకాంక్షిస్తున్నా: నారా చంద్రబాబు నాయుడు

తెలుగు ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుగుజాతికి స్వర్ణయుగం -సంక్రాంతి సంకల్పం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెల

Published : 2024-01-13 05:09:00

తెలుగు ప్రజలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

తెలుగుజాతికి స్వర్ణయుగం -సంక్రాంతి సంకల్పం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
మనిషి మనుగడకు మూలం, ప్రగతికి సంకేతం సూర్యభగవానుడు. అటువంటి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నాం.
ఇది కేవలం ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదు. మన జీవితంలో కూడా ప్రగతితో కూడిన మార్పు రావాలనే సందేశాన్ని సంక్రాంతి పండుగ ఇస్తుంది.
రాష్ట్రంలో గత 5 ఏళ్ల విధ్వంస పాలనతో ప్రతి ఒక్కరి జీవితం చీకటి మయం అయ్యింది. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల్లేవు. నిత్యావసర వస్తువుల ధరలు పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీశాయి. ఉపాధి, ఉద్యోగాలు లేని కుటుంబాలు, అస్తవ్యస్తమైన రోడ్లు, భయపెడుతున్న ఆర్టీసీ చార్జీలు గ్రామాల్లో పండుగ శోభను దెబ్బతీశాయి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

నేడు ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా పండుగ జరుపుకోలేని దుస్థితిలోకి ప్రభుత్వం ప్రజలను నెట్టివేసింది. ప్రతి పేద కుటుంబం పండగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో నాటి తెలుగుదేశం హయాంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసి పండుగ సంతోషాలను ప్రజలకు దూరం చేసింది.
ప్రభుత్వ విధ్వంసకర, విద్వేష విధానాలతో ఉపాధి కూడా దొరక్క యువత రోడ్డున పడింది.

మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని అటకెక్కించారు. ఈ చీకట్లు పోయేలా, ఈ సంక్రాంతి నుంచి కొత్త కాంత్రి ప్రజల జీవితాల్లో వచ్చేలా మన అడుగులు పడాలని ఆకాంక్షిస్తున్నా. బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అంతా కలుసుకునే సంక్రాంతి పండుగ సమయం కొత్త మార్పుకు బాటలు వేయాలి.


సమాజ హితం, రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించి సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని కోరుతున్నా. 5 ఏళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలుకుతూ... స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీ, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇది సరైన సమయం.

రండి! కదలి రండి! రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేము చేసే పోరాటంలో భాగస్వాములవ్వండి. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దాం.
మీకు, మీ కుటుంబ సభ్యులకు మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు
మీ, నారా చంద్రబాబు నాయుడు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →